For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Multibagger Stocks: లక్షను రూ.77 లక్షలు చేసిన స్టాక్స్..ఈ ఐదు స్టాక్స్ మీ దగ్గర ఉన్నాయా..?

|

Multibagger Stocks: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మంచి రాబడులు తప్పక వస్తాయి. అయితే స్వల్ప కాలంలో మార్కెట్ ఒడిదొడుకులు సైతం దీనికి అదనంగా ఉంటూనే ఉంటాయి. ఇన్వెస్టర్ల సంపదను పదిరెట్లు పెంచిన 5 స్టాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్వెస్టర్లు సైతం ఇలాంటి స్టాక్స్ పై కొంత స్టడీ చేసి పెట్టుబడుల నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమం.

UNO Minda..

UNO Minda..

UNO మిండా షేర్ ధర నవంబర్ 1, 2012న రూ.7.05 వద్ద ఉంది. ప్రస్తుతం నవంబర్ 1, 2022న షేర్ ధర రూ.544.25కి చేరుకుంది. 10 ఏళ్ల కిందట ఈ స్టాక్ లో లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం విలువ రూ.77 లక్షలకు చేరుకుంది. ఈ కంపెనీ వాహనాలకు స్విచ్‌లు, లైటింగ్, అల్లాయ్ వీల్స్, సీట్లు, సైలెన్సర్‌లు మరిన్నింటిని తయారు చేసే ఆటో రంగంలో కాంపోనెంట్స్ తయారీదారు. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున కంపెనీ భవిష్యత్తు వృద్ధి బలంగా కనిపిస్తోంది. మార్కెట్ నిపుణులు ఈ స్టాక్ రానున్న కాలంలో రూ.650కి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

ఎస్కార్ట్స్ కుబోటా..

ఎస్కార్ట్స్ కుబోటా..

ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను తయారు చేసే ఈ కంపెనీ లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లకు 2983% రాబడిని అందించింది. పైగా ఇది దివంగత మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ జున్ జున్ వాలాకు చాలా ఇష్టమైన కంపెనీ కూడా. ప్రస్తుతం ఈ స్టాక్ ధర మార్కెట్లో రూ.1998.20 వద్ద ట్రేడ్ అవుతోంది.

టీవీఎస్ మోటార్స్..

టీవీఎస్ మోటార్స్..

ఇక మూడవ స్థానంలో ఉన్న ఆటో స్టాక్ ఇన్వెస్టర్లకు 2851% రాబడిని అందించింది. 10 ఏళ్ల కిందట ఈ కంపెనీలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినవారికి మార్కెట్ విలువ ప్రకారం ఇప్పుడు రూ.10 లక్షలకు పైగా ఆదాయాన్ని స్టాక్ అందించింది. టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో మీడియం నుంచి దీర్ఘకాలికంగా బలమైన వృద్ధిని సాధిస్తుందని అంచనాలు చెబుతున్నాయి. ఇదే కాలంలో బిఎస్‌ఈ ఆటో ఇండెక్స్ 102% లాభపడింది. దీంతో గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ నిపుణులు టీవీఎస్ మోటార్స్ టార్గెట్ ధరను రూ.1,385గా నిర్ణయించారు.

ఐషర్ మోటార్స్..

ఐషర్ మోటార్స్..

ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందిస్తున్న ఆటో రంగంలోని మరో స్టాక్ ఐషర్ మోటార్స్. ప్రస్తుతం ఈ స్టాక్ ధర మార్కెట్లో రూ.3,705.55 వద్ద ట్రేడ్ అవుతోంది. కంపెనీ ప్రఖ్యాత రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిళ్లను తయారు చేస్తోంది. దీనికి తోడు కంపెనీ ట్రాన్స్ పోర్ట్ వాహనాలు, బస్సులను సైతం తయారు చేస్తుంది. ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు దాదాపు 1515% లాభాన్ని అందించింది.

బాలకృష్ణ ఇండస్ట్రీస్..

బాలకృష్ణ ఇండస్ట్రీస్..

బాలకృష్ణ ఇండస్ట్రీస్ ప్రముఖ టైర్ల తయారీ సంస్థ. ఇది భారీ ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు, మైనింగ్ వాహనాలకు టైర్లను తయారు చేయటంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీ సైతం తన ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించింది. బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేర్ ధర 1388% పెరిగి ఇన్వెస్టర్లు మంచి ఆదాయాన్ని పొందారు.

ఆటో రంగం..

ఆటో రంగం..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు మాంద్యం కారణంగా మార్జిన్లు, లాభాల విషయంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు వడ్డీ రేట్ల పెంపు కంపెనీలకు కొంత ప్రతికూలమనే చెప్పుకోవాలి. అయితే భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని సాధించడం ప్రారంభించినప్పుడు, ఆటోమొబైల్ రంగం వృద్ధి బలంగా ఉంటుందని ఆ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న కాలంలోనూ ఈ రంగంలోని స్టాక్స్ మంచి రాబడులను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

English summary

Multibagger Stocks: లక్షను రూ.77 లక్షలు చేసిన స్టాక్స్..ఈ ఐదు స్టాక్స్ మీ దగ్గర ఉన్నాయా..? | Auto sector top-5 stocks that gave multibagger returns to investors

Auto sector top-5 stocks that gave multibagger returns to investors
Story first published: Friday, November 4, 2022, 12:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X