For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆత్మనిర్భర్ భారత్: రెండేళ్ళుగా వెతికిన ఆ స్టార్టప్ దొరికింది, ఆనంద్ మహీంద్రా భారీ పెట్టుబడి

|

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఆత్మనిర్భర్ భారత్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మోడీ పిలుపు మేరకు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తొలి అడుగు వేశారు. మోడీ ప్రకటనకు ముందు నుండే ఆయన ఓ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి కోసం వెతుకుతున్నారు. రెండేళ్లుగా ఆయన వెతుకుతున్న స్టార్టప్‌ను ఎట్టకేలకు గుర్తించారు. తాజాగా ఆ స్టార్టప్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు.

ఇన్వెస్టర్లు ఆచితూచి, పెరిగిన బంగారం ధరలు: హైదరాబాద్‌లో ఎంతంటేఇన్వెస్టర్లు ఆచితూచి, పెరిగిన బంగారం ధరలు: హైదరాబాద్‌లో ఎంతంటే

రూ.7.5 కోట్ల పెట్టుబడులు

రూ.7.5 కోట్ల పెట్టుబడులు

గురుగ్రాంకు చెందిన సోషల్ మీడియా హ్యాప్‌రాంప్ స్టార్టప్‌లో ఆనంద్ మహీంద్రా 1 మిలియన్ డాలర్లు లేదా దాదాపు రూ.7.5 కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు ఆనంద్ మహీంద్రా. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. పెట్టుబడి పెట్టేందుకు తాను రెండేళ్లుగా వెతుకుతున్న స్టార్టప్‌ను గుర్తించానని పేర్కొన్నారు.

వ్యవస్థాపకులు ఐఐఐటీ-వడోదర విద్యార్థులు

వ్యవస్థాపకులు ఐఐఐటీ-వడోదర విద్యార్థులు

కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా తాను సోషల్ మీడియా స్టార్టప్‌లో ఇన్వెస్ట్ చేస్తానని రెండేళ్ల క్రితం ఆనంద్ మహీంద్రా తెలిపారు. 'నేను ఏ స్టార్టప్ కోసం చూస్తున్నానో రెండేళ్ల తర్వాత దానిని గుర్తించాను' అని తెలిపారు. ఆనంద్ మహీంద్రా ఆకట్టుకున్న హ్యాప్‌రాంప్ స్టార్టప్‌ను ఐఐఐటీ-వదోదరకు చెందిన ఐదుగురు విద్యార్థులు స్థాపించారు. ఈ స్టార్టప్ సృజనాత్మకత, సాంకేతికత, డేటా రక్షణ కలయిక అని మహీంద్రా పేర్కొన్నారు.

గోసోషల్

గోసోషల్

వారి సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్‌ఫామ్ 'గోసోషల్' యాప్‌ను పరిశీలించాలని ఆనంద్ మహీంద్రా కోరారు. బ్లాక్ చెయిన్, సోషల్ మీడియా వంటి సాంకేతిక పరిజ్ఞానాలపై పనిచేసే స్టార్టప్ ఇది. దీనిని ఈ ఐదుగురు విద్యార్థులు 2018లో స్థాపించారు. ఈ సంస్థలో దేశవ్యాప్తంగా 12 మంది ఉద్యోగులు ఉన్నారు.

హ్యాప్‌రాంప్ ఆనందం

హ్యాప్‌రాంప్ ఆనందం

ఆనంద్ మహీంద్రా పెట్టుబడుల అంశంపై హ్యాప్‌రాంప్ సహ వ్యవస్థాపకులు, సీఈవో శుభేంద్ర విక్రమ్ ఆనందం వ్యక్తం చేశారు. గోసోషల్‌కు మూడు నెలల్లో 50వేల కస్టమర్లు వచ్చారని, రాబోయే మూడు నెలల్లో లక్షమంది, ఈ సంవత్సరం చివరి నాటికి 10 లక్షల మంది కస్టమర్లను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఉద్యోగుల సంఖ్య 12 ఉండగా దీనిని 25 నుండి 30కి పెంచుకుంటామన్నారు. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో ఉంది. త్వరలో ఆపిల్ యాప్ స్టోర్స్‌లో లాంచ్ చేయనున్నారు.

English summary

ఆత్మనిర్భర్ భారత్: రెండేళ్ళుగా వెతికిన ఆ స్టార్టప్ దొరికింది, ఆనంద్ మహీంద్రా భారీ పెట్టుబడి | Atmanirbhar Bharat: Anand Mahindra invests $1 mn in home grown social media startup

Anand Mahindra, chairman, Mahindra Group has invested $1 million in Hapramp, a blockchain-based social media startup.
Story first published: Wednesday, June 10, 2020, 18:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X