For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాక్‌మా‌ను దాటేసి ప్రపంచ టాప్ 9 కుబేరుడిగా ముఖేష్ అంబానీ, టాప్ 10లో వీరే..

|

ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ టాప్ 10లోకి వచ్చాడు. ఆసియాలో కుబేరుడిగా నిలిచాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణరహిత కంపెనీగా నిలవడంతో పాటు రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11 లక్షల కోట్లకు చేరుకోవడంతో ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 9వ స్థానంలో నిలిచాడు. ఇటీవల రిలయన్స్ డిజిటల్ వేదిక జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి వరుసగా పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే.

IBMతో కలిసి పని చేయనున్న టెక్ దిగ్గజం TCS, ఎందుకంటేIBMతో కలిసి పని చేయనున్న టెక్ దిగ్గజం TCS, ఎందుకంటే

సాధించారు.. టాప్ 9లో నిలిచారు

సాధించారు.. టాప్ 9లో నిలిచారు

ముఖేష్ అంబానీ సంపద జియో వాటా విక్రయం ద్వారా భారీగా పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.11 లక్షల కోట్లకు చేరుకుంది. ముఖేష్ అంబానీ రూ.4.84 లక్షల కోట్లు లేదా 64.6 బిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. టాప్ 10లో స్థానం దక్కిన ఏకైక భారతీయడిగా నిలిచారు. రిలయన్స్‌లో 42 శాతం వీరిదే. 2021 మార్చి నాటికి రిలయన్స్‌ను రుణరహిత సంస్థగా నిలబెడతానని అంబానీ గత ఏడాది ప్రకటించారు. కానీ పది నెలల ముందే దీనిని సాధించారు.

160 బిలియన్ డాలర్లతో జెఫ్ టాప్, కరోనా టైంలో ఉద్యోగాలు

160 బిలియన్ డాలర్లతో జెఫ్ టాప్, కరోనా టైంలో ఉద్యోగాలు

ప్రపంచ టాప్ 20 బిలియనీర్ల విషయానికి వస్తే ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 160.1 బిలియన్ డాలర్లతో తొలి స్థానంలో నిలిచాడు. అమెజాన్‌లో 11.1 శాతం వాటా ఉంది. దీనిని 1994లో స్థాపించాడు. కరోనా మహమ్మారి సమయంలో మార్చి నుండి ఏప్రిల్ మధ్య అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా 1,75,000 కొత్తగా ఉద్యోగంలోకి తీసుకుంది. కరోనా టైంలో ఎక్కువమంది ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేయడంతో ఉద్యోగ అవకాశాలు కల్పించింది.

రెండో స్థానంలో బిల్ గేట్స్

రెండో స్థానంలో బిల్ గేట్స్

- బిల్ గేట్స్ 108.7 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మైక్రోసాఫ్ట్‌లో మెజర్ షేర్లు విక్రయించి కేవలం ఒక శాతం వాటాను మాత్రమే అట్టిపెట్టుకున్నాడు. వివిధ వాటిల్లో ఇన్వెస్ట్ చేశాడు.

- బెర్నాల్డ్ అర్నాల్ట్ 103.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచాడు. లూయీస్ వూటన్, సెపోరా సహా 70 బ్రాండ్స్ నిర్వహిస్తున్నాడు.

నాలుగో స్థానంలో జుకర్‌బర్గ్

నాలుగో స్థానంలో జుకర్‌బర్గ్

- సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో 15 శాతం వాటా కలిగిన మార్క్ జుకర్ బర్గ్ 87.9 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నాడు.

- దిగ్గజ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హాత్‌వే అధినేత వారెన్ బఫెట్ 71.4 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఈయన 60కి పైగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశాడు.

- 1980లో 30వ ఉద్యోగిగా మైక్రోసాఫ్ట్‌లోచేరి, 2008 నుండి 2014 వరకు సీఈవోగా పని చేసిన స్టీవ్ బాల్‌మర్ 68.9 బిలియన్ డాలర్లతో 6వ స్థానంలో ఉన్నాడు.

- 1977లో ఒరాకిల్‌ను స్థాపించిన లారీ ఎలిసన్ 68.9 బిలియన్ డాలర్లతో 7వ స్థానంలో ఉన్నాడు. 2014లో ఆయన ఒరాకిల్‌లో సీఈవో బాధ్యతల నుండి తప్పుకున్నాడు.

- జరా ఫ్యాషన్ చైన్ కోఫౌండర్ అమాన్సియో ఒర్టెగా 65.8 బిలియన్ డాలర్లతో 8వ స్థానంలో నిలిచాడు.

- ముఖేష్ అంబానీ 64.6 బిలియన్ డాలర్లతో 9వ స్థానంలో నిలిచాడు. ఎలాన్ మస్క్, అలీబాబా జాక్‌మాను దాటేశాడు. ఇటీవల కరోనా కారణంగా చమురు కంపెనీలు డీలా పడటంతో జాక్ మా కంటే వెనుకబడ్డాడు ముఖేష్.

- ప్రపంచ టాప్ 10 బిలియనీర్‌గా అల్పాబెట్ కోఫౌండర్ లారీఫేజ్ ఉన్నాడు. 64.3 బిలియన్ డాలర్లతో టాప్ 10లో నిలిచాడు.

English summary

జాక్‌మా‌ను దాటేసి ప్రపంచ టాప్ 9 కుబేరుడిగా ముఖేష్ అంబానీ, టాప్ 10లో వీరే.. | Ambani, Asia's Wealthiest Man, Joins Club of World’s 10 Richest

The net worth of Mukesh Ambani, chairman of Reliance Industries Ltd., has jumped to $64.5 billion, making him the only Asian tycoon in the exclusive club of the world’s top 10 richest people, according to the Bloomberg Billionaires Index.
Story first published: Sunday, June 21, 2020, 10:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X