కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఉత్పత్తులు నిలిచిపోయాయి. షాప్స్ క్లోజ్ అయ్యాయి. ప్రజలు బయట తిరిగేందుకే వణికిపోతున్నారు. గత కొంతకాలంగా ఆన్‌లైన్ వ్యాపారం పెరిగింది. అయినప్పటికీ తమకు అవసరమైన వస్తువులు దుకాణాల్లో కొనుగోలు చేయడం కూడా ఎక్కువే ఉండింది. కానీ ఇప్పుడు కరోనా దెబ్బకు దుకాణాలు క్లోజ్ అయి ఆన్‌లైన్ వ్యాపారానికి మరింత భారీ డిమాండ్ పెరిగింది.

లక్ష కొత్త ఉద్యోగాలు
ఆన్‌లైన్ వ్యాపారానికి డిమాండ్ ఎంతగా పెరిగిందంటే.. అమెజాన్ డాట్ ఇన్ ఏకంగా మరో లక్షమంది వేర్‌హౌస్, డెలివరీ వర్కర్స్‌ను నియమించుకునేటంత. ఈ మేరకు అమెజాన్ డాట్ ఇన్ సోమవారం ఓ ప్రకటనలో.... తాము అమెరికాలో మరో 1,00,000 మందిని నియమించుకుంటామని తెలిపింది. ఆన్‌లైన్ ఆర్డర్స్ భారీగా పెరుగుతున్నట్లు వెల్లడించింది.

కరోనా దెబ్బకు ఆన్‌లైన్ వైపు..
కరోనా వైరస్ కారణంగా కస్టమర్లు బయటకు వెళ్లడం లేదని, తమకు అవసరమైన అన్ని వస్తువులను కొనుగోలు చేసేందుకు వెబ్‌ను లేదా ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారని అమెజాన్ డాట్ ఇన్ తెలిపింది. కరోనా అనుమానిత నిర్బంధాలు, ఉత్పత్తి కొరత తదితర కారణాలతో దుకాణాల్లో వస్తువులు తగ్గిపోయాయి. ప్రజలు ఆన్‌లైన్ వైపు చూడటానికి ఇది కూడా ఓ కారణం.

అమెజాన్ మాత్రమే కాదు..
కేవలం అమెజాన్ మాత్రమే కాదు. అమెరికా సూపర్ మార్కెట్ చైన్‌లు అల్బర్ట్ సన్స్, క్రోగెర్, రాలేలు కూడా కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఆన్‌లైన్ ఆర్డర్లు పెరగడంతో కొత్త వారిని తీసుకుంటున్నాయి.

ఆ బిజినెస్‌లు డల్.. ఆ ఉద్యోగులు ఇటువైపు
కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ట్రావెల్, రెస్టారెంట్, ఎంటర్టైన్మెంట్ వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. దీంతో ఆయా రంగాల్లోని ఉద్యోగులు ఖాళీగా ఉన్నారు. దీంతో వారిని అమెజాన్ వంటి ఆన్‌లైన్ సంస్థలు నియమించుకునేందుకు అవకాశం ఏర్పడింది.

సాధారణ స్థితికి వచ్చే వరకు..
ఆయా రంగాల గురించి అవగాహన ఉన్న వారిని తాము ఆహ్వానిస్తున్నామని, కరోనా వైరస్ ప్రభావం తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఇక్కడకు రావొచ్చునని, కరోనా తగ్గిపోయాక తిరిగి అక్కడకు వెళ్లవచ్చునని అమెజాన్ పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 7,100 మంది చనిపోయారు. భారత్‌లో ఈ సంఖ్య మూడుకు చేరుకుంది. కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా లక్షన్నరకు పైగా ఉండగా, దేశంలో 122కు చేరుకున్నాయి.

గంటకు మరింత అదనం..
అమెజాన్‌లో ప్రస్తుతం ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగుల సంఖ్య 7,98,000. అయితే లక్షమందిని తీసుకుంటామని ప్రకటించాక ఎంతమందిని తీసుకుంది, ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా, కొత్త ఉద్యోగులను ఆకర్షించేందుకు అమెజాన్ గంటకు మినిమం 15 డాలర్లకు మరో 2 డాలర్లను యాట్ చేస్తున్నట్లు తెలిపింది. నార్త్ అమెరికా, యూరోప్‌లలో ఈ అదనపు మొత్తం వల్ల అమెజాన్‌పై 350 బిలియన్ డాలర్ల భారం పడుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications