For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 నిమిషాల్లో మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్.. అమెజాన్ కొత్త సేవలు!

|

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్... ఇండియాలో తన విస్తృతి పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ కామర్స్ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన ఈ సంస్థ... ఇండియా లోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే, ఇండియా లో కేవలం ఈ కామర్స్ రంగానికే పరిమితం కావాలని భావించటం లేదు. ఇక్కడ ఒక పూర్తిస్థాయి ఆర్థిక సేవల సంస్థగా పాగా వేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇన్సూరెన్స్ పంపిణీ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ మేరకు సాధారణ బీమా రంగంలో సేవలు అందించే అక్కో అనే స్టార్టుప్ కంపెనీ తో చేతులు కలిపింది. అమెజాన్ పే అనే తన ఆర్థిక సేవల ఆప్ ద్వారా ఇన్సూరెన్స్ సేవలను కూడా అందించబోతోంది. ఇందుకోసం కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అవతారం ఎత్తిన అమెజాన్.. త్వరలోనే పూర్తిస్థాయిలో సేవలు ప్రారంభించబోతోంది. అత్యంత వేగంగా, వీలైనంత తక్కువ ధరలో పాలసీ లను అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

హోమ్‌లోన్‌పై అదిరిపోయే ఆఫర్, మార్కెట్లో అతి తక్కువ: ఎవరికి... ఎంత వడ్డీ?హోమ్‌లోన్‌పై అదిరిపోయే ఆఫర్, మార్కెట్లో అతి తక్కువ: ఎవరికి... ఎంత వడ్డీ?

మోటార్ వెహికల్ పాలసీ లు...

మోటార్ వెహికల్ పాలసీ లు...

తన కొత్త అవతారంలో భాగంగా... అమెజాన్ ఇకపై అమెజాన్ పే ప్లాట్ఫారం పై మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ లను విక్రయించనుంది. ఇండియా లో సాధారణ బీమా రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్టాలను పటిష్టం చేస్తూ కఠినతరమైన నిబంధనలు పెడుతోంది. వినియోగదారుల్లోనూ గతంతో పోల్చితే అవగాహన పెరిగింది. దీంతో మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ కు గిరాకీ పెరుగుతోంది. ఈ పాలసీ లను అన్ని కంపెనీలు ఆన్లైన్ లో కూడా విక్రయిస్తున్నా ... ఇటీవల కాలంలో అక్కో వంటి స్టార్టప్ కంపెనీల రాకతో ఈ రంగంలో ఆన్లైన్ పాలసీ విక్రయాలు పెరిగాయని చెప్పాలి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వినియోగదారులు కాంటాక్ట్ లెస్ సేవలకు పెద్ద పీట వేస్తున్నారు. ఇది కూడా ఈ రంగంలో ఆన్లైన్ పాలసీ విక్రయాలు పెరిగేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

2 నిమిషాల్లో పాలసీ...

2 నిమిషాల్లో పాలసీ...

వినియోగదారులను ఆకర్షించేందుకు, వారికి మెరుగైన సేవలు అందించేందుకు అమెజాన్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కేవలం 2 నిమిషాల్లోనే మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ ని జారీ చేయనుంది. అలాగే అనేక వేల్యూ యాడెడ్ సర్వీసులను కూడా అందించనుంది. అలాగే మూడు రోజుల్లో తప్పనిసరి క్లెయిమ్ సేవలు, ఒక ఏడాది రిపేర్ సర్వీస్ వారంటీ వంటి అనేక సేవలను కూడా ఆఫర్ చేయబోతోంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తో పాటు సెల్ఫ్ డామేజ్ పాలసీ లను విక్రయించటంలో భాగంగా ఇలాంటి అనేక వినూత్న సర్వీసులను వినియోగదారులకు అందించబోతోంది. ఈ కామర్స్ ప్లాట్ఫారం లో ఒక ప్రొడెక్టును కొనుగోలు చేసినంత తేలిగ్గా ఇన్సూరెన్స్ పాలసీ ని విక్రయించటమే లక్ష్యం. అందులో భాగంగా తక్కువ ధరలో, సులభమైన పాలసీ లను ఆఫర్ చేస్తాం అని అమెజాన్ పే ఇండియా డైరెక్టర్ వికాస్ బన్సల్ వెల్లడించారు.

పోటీ వల్లే ....

పోటీ వల్లే ....

ఇండియన్ ఈ కామర్స్ రంగంలో పోటీ విపరీతంగా ఉన్న విషయం తెలిసిందే. ఫ్లిప్ కార్ట్ తో అమెజాన్ కు ఉన్న పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. డిజిటల్ పేమెంట్స్ లో పేటీఎం కూడా ఉండనే ఉంది. ఈ రెండు సంస్థలు కూడా సరిగ్గా ఇలాంటి ప్రోడక్టులు, సేవలు అందించే ప్రయత్నాల్లో ఉండటంతో అమెజాన్ కూడా ఈ రంగంలో వాటితో పోటీ పడాలని భావిస్తోంది. లేదంటే పరుగు పందెంలో వెనుకబడే అవకాశం ఉంటుందని భావిస్తోంది. పైగా ఇప్పటికే అమెజాన్ అటు ఈ కామర్స్ తో పాటు, ప్రైమ్ తో ఓటీటీ సేవలు అందిస్తోంది. గ్రోసరీస్ డెలివరీ లోకి ప్రవేశించింది. త్వరలోనే ఫుడ్ డెలివరీ కూడా చేయనుందని వార్తలు వెలువడ్డాయి. అమెజాన్ పే తో యూపీఐ పేమెంట్ సేవలు కూడా అందిస్తోంది. అలాగే, ఇన్సూరెన్స్ రంగంలో కూడా ప్రవేశిస్తే ఇండియా లో వేగంగా అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాల్లోనూ పాగా వేసి మరింతగా అభివృద్ధి సాధించాలని అమెజాన్ భావిస్తున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం.

English summary

2 నిమిషాల్లో మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్.. అమెజాన్ కొత్త సేవలు! | Amazon enters insurance distribution business, ties up with Acko to sell motor cover

Amazon has entered the insurance distribution business in India, tying up with general insurance startup Acko to sell motor vehicle policies on its Pay platform.
Story first published: Friday, July 24, 2020, 7:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X