For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘అలీబాబా’.. మజాకా? ఒక్క రోజులో రూ.2.69 లక్షల కోట్ల అమ్మకాలు!

|

చైనా ఈ-కామర్స్ దిగ్గజం 'అలీబాబా' అమ్మకాలలో మరో రికార్డు సృష్టించింది. సోమవారం 'సింగిల్స్ డే' సందర్భంగా ఒక్క రోజులో రూ.2.69 లక్షల కోట్ల అమ్మకాలు సాగించి తన రికార్డును తానే బద్దలుకొట్టింది. 2018లో ఇదే సందర్భంగా ఈ ఈ-కామర్స్ దిగ్గజం 30.8 బిలియన్ డాలర్ల ( మన డబ్బులో సుమారు రూ.2,15,600 కోట్లు) అమ్మకాలు సాగించగా, తాజాగా ఆ మొత్తాన్ని ఈ ఏడాది అమ్మకాల ద్వారా అధిగమించింది.

'సింగిల్స్ డే' సందర్భంగా అమ్మకాలు మొదలైన అరగంట వ్యవధిలోనే 10 బిలియన్ డాలర్ల ( రూ.70,000 కోట్లు) అమ్మకాలు సాధించినట్లు అలీబాబా తెలిపింది. అలీబాబా గ్రూప్‌కు చెందిన వేర్వేరు ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లపై 29 నిమిషాల 45 సెకన్లలోనే.. అమ్ముడుపోయిన ఉత్పత్తుల విలువ రూ.70 వేల కోట్లు దాటినట్లు పేర్కొంది.

Alibaba’s Singles’ Day sales top $38 billion

సెకనుకు 5.44 లక్షల ఆర్డర్లు అందుకున్నామని, 2009లో ఈ విక్రయాలు ప్రారంభించిన నాటితో పోల్చితే ఇది 1360 రెట్లు అధికమని అలీబాబా వివరించింది.

తొలి 2 గంటల్లోనే 17.24 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.21 లక్షల కోట్లు) అమ్మకాలు సాధించి 2016 సింగిల్స్ డే విక్రయాల రికార్డును అధిగమించినట్లు.. ఆ తరువాత 16.31 గంటల వ్యవధిలో 31.82 బిలియన్ డాలర్ల ( సుమారు రూ.2.23 లక్షల కోట్లు) విక్రయాలు సాగించడం ద్వారా, 2018 నాటి సింగిల్స్ డే విక్రయాలను అధిగమించినట్లు సంస్థ పేర్కొంది.

English summary

‘అలీబాబా’.. మజాకా? ఒక్క రోజులో రూ.2.69 లక్షల కోట్ల అమ్మకాలు! | Alibaba’s Singles’ Day sales top $38 billion

The Chinese e-commerce giant Alibaba Group said today its sales hit another record high on Singles’ Day, the biggest shopping day on the planet. It's platforms sold goods worth 268 billion yuan, or $38.4 billion today, easily exceeding last year’s record $30.7 billion haul.
Story first published: Tuesday, November 12, 2019, 9:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X