Zomato Share: జొమాటోను ముంచిన బ్లింకిట్ డీల్.. రూ. 12,000 కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు.. స్టాక్ ని కొనొచ్చా.
Zomato Share: జొమాటో స్టాక్ ధర గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో నిరంతరం పెరుగుతూనే ఉంది. అయితే.. BlinkItతో కొనుగోలు ఒప్పందం ప్రకటన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నిర్ణయం వెలువడటంతో జొమాటో స్టాక్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ క్రమంలో షేర్ ఈ రోజు కొంత కోలుకుంది. ఈరోజు ట్రేడింగ్ సెషన్ లో 4.27 శాతం లాభపడి రూ. 56.15 వద్ద ముగిసింది. డిజిటల్ గ్రోసరీ కంపెనీ బ్లింకిట్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించిన తర్వాత Zomato షేర్లు గురువారం వరకు వరుసగా నాలుగు రోజుల పాడు పతనమయ్యాయి. 4,447.5 కోట్లకు బ్లింకిట్ కొనుగోలుకు జొమాటో బోర్డు ఆమోదం తెలిపిన తరువాత.. Zomato స్టాక్ 25 శాతం పడిపోయింది. నిరుత్సాహం చెందిన అనేకమంది ఇన్వెస్టర్లు షేర్లను అమ్మడం వల్ల ఇలా జరుగుతోందని తెలుస్తోంది.

వరుస నష్టాల తరువాత:
ఒకప్పుడు మెరిసిన ఈ స్టాక్ గురువారం 4 శాతం వరకు పడిపోయి దాదాపుగా 52 వారాల కనిష్ఠ ధరకు దగ్గరలో ట్రేడ్ అయింది. అయితే ఈరోజు (శుక్రవారం) మార్కెట్ ప్రారంభమైన తర్వాత జొమాటో స్టాక్‌లో స్వల్ప మెరుగుదల కనిపించింది. బ్లింకిట్ డీల్ ప్రకటించిన రోజు శుక్రవారం షేరు ధర రూ.70.50 వద్ద ముగిసింది. ఈరోజు అందులో కొంత కోలుకున్నప్పటికీ.. చివరికి రూ. 56.15 వద్ద ముగిసింది.

ఇన్వెస్టర్లకు వేల కోట్లు నష్టం:
జొమాటో స్టాక్ నిరంతర పతనం కారణంగా షేర్లను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు నాలుగు రోజుల్లో రూ.11,680 కోట్ల నష్టాన్ని చవిచూశారు. నాలుగు రోజుల్లో దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.47,366 కోట్ల నుంచి రూ.35,686 కోట్లకు తగ్గింది. 2021 సంవత్సరంలో కంపెనీ తన IPOతో మార్కెట్లోకి వచ్చినప్పుడు.. షేర్ ఇష్యూ ధర రూ.76గా ఉంది. ఆ సమయంలో కంపెనీ పెట్టుబడిదారులకు దాదాపు 122 శాతం రాబడిని ఇచ్చింది. కంపెనీ స్టాక్ ఆ సమయంలో 52 వారాల గరిష్ఠమైన రూ.169 స్థాయిని తాకింది. కానీ ఇప్పుడు.. జొమాటో స్టాక్ దాని గరిష్ఠాల నుండి 68 శాతం పతనమైంది.

జొమాటో స్టాక్ టార్కెట్:
ఈ ఫుడ్ డెలివరీ కంపెనీ స్టాక్ క్షీణించడం చూస్తుంటే.. జొమాటో లాభాల బాటలో బ్లింకిట్ డీల్ పెద్ద అడ్డంకిగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. Blinkit కొనుగోలు డీల్ తర్వాత Zomato లాభాలను ఆర్జించడానికి చాలా సమయం పట్టవచ్చని వారు అంటున్నారు. అయితే.. ఈ క్షీణత ఉన్నప్పటికీ బ్రోకరేజ్ సంస్థలు Zomato స్టాక్‌ను BUY రేటింగ్ ఇస్తున్నాయి. JM ఫైనాన్షియల్.. జొమాటో స్టాక్ రూ.115కి చేరుకోవచ్చని భావిస్తోంది. ఎడెల్‌వీస్ బ్రోకరేజ్ సంస్థ జొమాటోకు రూ.80 టార్గెట్‌గా ఇచ్చింది.

పతనంతో మార్కెట్ ప్రారంభమైంది
స్టాక్ మార్కెట్ ప్రారంభం నేడు బలహీనంగా కనిపిస్తోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈరోజు పతనంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి సెషన్‌లో సెన్సెక్స్ 500 పాయింట్ల నుంచి పతనమై 52,500 మార్కు దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 150 పాయింట్ల నష్టంతో 15,640 పాయింట్ల దిగువన ట్రేడవుతోంది.