సెప్టెంబర్ రికార్డ్ స్థాయి నుంచి రూ.2,400 తగ్గిన బంగారం, వెండి ధరలు!
న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలకు తోడు వివిధ కారణాల వల్ల వరుసగా వారం రోజుల పాటు ధరలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఎంసీఎక్స్‌లో బంగారం ఫ్యూచర్స్ 10గ్రాములకు 0.20 శాతం పెరిగి 37,647కు చేరుకుంది. దీంతో సెప్టెంబర్‌లోని రికార్డ్ ధర రూ.40,000 కంటే రూ.2,300కు పైగా తగ్గింది. ఎంసీఎక్స్‌లో వెండి ధర కూడా కిలో 0.40 శాతం తగ్గి రూ.44,262కు చేరుకుంది.
బంగారం ధరలు ఔన్సుకు అంతర్జాతీయంగా 0.1 శాతం తగ్గి 1,459.91గా ఉంది. రెండు వారాల కనిష్టానికి తాకింది. అమెరికా - చైనా ట్రేడ్ డీల్ సానుకూలత దీనికి తోడైంది.

భారత మార్కెట్లో పసిడి ధర ఈ ఏడాది దాదాపు 20% వరకు పెరుగుదలను నమోదు చేసింది. సెప్టెంబర్ నెల ఆరంభంలో బంగారం ధర ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాములకు రూ. 40 వేల మార్క్‌ను దాటింది. వెండి ధర కూడా కిలోకు రూ. 50వేల మార్క్‌ను దాటింది. ఆ తర్వాత నుంచి కాస్త తగ్గుముఖం పట్టింది.
కాగా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల బంగారం ధరకు కింది స్థాయిల్లో మద్దతు
లభించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలో బంగారం దిగుమతులు 2017 జనవరి నాటికి కనిష్టస్థాయికి పడిపోయాయి. ప్రపంచంలో చైనా తర్వాత బంగారం ఎక్కువగా వినియోగిస్తున్న దేశం భారత్. వృద్ధి రేటు భయాలు, ద్రవ్యోల్బణ పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో చైనాలో పసిడి దిగుమతులు తగ్గిపోయాయి.


Click it and Unblock the Notifications