For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబుదాబి కంపెనీతో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక ఒప్పందం

|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ(ADNOC)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. పశ్చిమ అబుదాబిలోని రువైస్‌లో భారీ పెట్రో కెమికల్, ఇండస్ట్రియల్ హబ్ నిర్మాణం జరుగుతోంది. ఈ ఒప్పందంలో భాగంగా అబుదాబీలో భారీ పెట్రో కెమికల్ ప్రాజెక్టును నిర్మిస్తారు. ఈ హబ్‌లో రిలయన్స్-అడ్నాక్ క్లోర్ అల్కాలీ, ఎథిలిన్ డైక్లోరైడ్, పాలీవినైల్ క్లోరైడ్ తయారీ కోసం ప్లాంట్‌ను నిర్మించనున్నారు.

ప్రతి సంవత్సరం 9.40 లక్షల టన్నుల క్లోర్ ఆల్కలీ, 11 లక్షల టన్నుల ఎథిలినై డైక్లోరైడ్, 3.60 లక్షల టన్నుల పాలీవినైల్ క్లోరైడ్(PVC) తయారీ సామర్థ్యంలో ఈ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో ఎంత మొత్తంలో పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని రిలయన్స్ వెల్లడించవలసి ఉంది. దాదాపు రూ.11,250 కోట్ల మేర పెట్టుబడులు పెట్టవచ్చునని అంచనా.

 ADNOC and Reliance sign strategic partnership to set up petrochemical project in Abu Dhabi

అడ్నాక్‌తో తమ దీర్ఘకాల సంబంధాలు మరింత బలోపేతమవుతాయని, ఈ ప్రాజెక్టు ద్వారా భారత్‌కు అవసరమైన పీవీసీలో వినియోగించే ఎథిలీన్ డైక్లోరైడ్‌ను ఉత్పత్తి చేస్తామని, ఇంత ముఖ్యమైన ప్రాజెక్టులో భాగస్వాములం కావడం గర్వంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు.

English summary

అబుదాబి కంపెనీతో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక ఒప్పందం | ADNOC and Reliance sign strategic partnership to set up petrochemical project in Abu Dhabi

eliance Industries and ADNOC have signed an agreement to set up a new petrochemical complex in Ruwais, Abu Dhabi, to produce chlor-alkali, ethylene dichloride, and PVC.
Story first published: Wednesday, June 30, 2021, 7:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X