For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏపీ, తెలంగాణాతో సహా ఆరు రాష్ట్రాలకు, 19,459 కోట్ల అదనపు రుణాలు .. అనుమతించిన కేంద్రం

|

ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన వ్యాపార సంస్కరణలను సులభతరం చేసి విజయవంతంగా పూర్తి చేసిన ఆరవ రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది . బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా 2,731 కోట్ల అదనపు రుణాలు పొందటానికి రాజస్థాన్ రాష్ట్రం అర్హత సాధించింది. సంస్కరణలను పూర్తి చేసిన రాజస్థాన్ ఇప్పుడు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మరియు తెలంగాణ ఐదు రాష్ట్రాలతో చేరిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

భారీ పెట్టుబడులు ప్రకటించిన హైదరాబాద్ ఫార్మా దిగ్గజాలు..వ్యాపార విస్తరణ కోసం ప్రణాళికలుభారీ పెట్టుబడులు ప్రకటించిన హైదరాబాద్ ఫార్మా దిగ్గజాలు..వ్యాపార విస్తరణ కోసం ప్రణాళికలు

 ఆరు రాష్ట్రాలకు రూ .19,459 కోట్ల అదనపు రుణాలు

ఆరు రాష్ట్రాలకు రూ .19,459 కోట్ల అదనపు రుణాలు

వ్యాపారం సులభతరం చేయడానికి సంస్కరణలు పూర్తయిన తరువాత, ఆరు రాష్ట్రాలకు రూ .19,459 కోట్ల అదనపు రుణాలు మంజూరు చేయబడ్డాయి. వ్యాపారం చేయడంలో సౌలభ్యం దేశంలో పెట్టుబడి-స్నేహపూర్వక వ్యాపార వాతావరణానికి ముఖ్యమైన సూచిక. వ్యాపారం సులభతరం చేయడంలో మెరుగుదల, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు వృద్ధిని వేగవంతం చేస్తాయి. మే 2020 లో, అదనపు రుణాలు తీసుకునే అనుమతుల మంజూరును రాష్ట్రాలకు అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 వివిధ రాష్ట్రాల సంస్కరణల అమలు గడువు ఫిబ్రవరి 15 వరకు పొడిగింపు

వివిధ రాష్ట్రాల సంస్కరణల అమలు గడువు ఫిబ్రవరి 15 వరకు పొడిగింపు

ఈ వర్గంలో నిర్దేశించిన సంస్కరణలు ఏ రాష్ట్రం పూర్తిచేస్తే ఆ రాష్ట్రానికి అదనపు రుణాలను ఇస్తామని కేంద్రం ప్రకటించింది.

డిసెంబరు 31 నాటికి వీటిని అమలు చేసిన రాష్ట్రాలు ప్రయోజనాలు పొందడానికి అవకాశం కల్పించారు. కానీ వివిధ రాష్ట్రాల సంస్కరణల అమలు ఉత్సాహం చూసి దీన్ని తాజాగా పొడిగించారు.డిసెంబర్ 30 నాటికి వీటిని అమలు చేసి రాష్ట్రాలు ప్రయోజనాలు పొందడానికి అవకాశం కల్పించినా, తాజాగా దీనిని ఫిబ్రవరి 15వ తారీకు 2021 వరకు పొడిగించారు.

 రాష్ట్రాలు అమలు చేస్తున్న ముఖ్యమైన సంస్కరణలు ఇవే

రాష్ట్రాలు అమలు చేస్తున్న ముఖ్యమైన సంస్కరణలు ఇవే

దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలు ఇప్పటి వరకు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానాన్ని అమలు చేశాయి. ఆరు రాష్ట్రాలు వ్యాపార సంస్కరణలు సులభతరం చేశాయి. రెండు రాష్ట్రాలు స్థానిక సంస్థల సంస్కరణలు చేపట్టాయి. ఈ క్రమంలో కేంద్రం వివిధ పౌర-కేంద్రీకృత సంస్కరణలను చేపట్టిన రాష్ట్రాలకు ఇప్పటివరకు జారీ చేసిన మొత్తం అదనపు రుణ అనుమతి రూ .50, 253 కోట్లుగా ఉంది . వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వ్యవస్థ అమలు , వ్యాపార సంస్కరణ సులభం చేయడం, పట్టణ స్థానిక సంస్థ లేదా వినియోగ సంస్కరణలు, విద్యుత్ రంగ సంస్కరణలు ప్రధానంగా ఉన్నాయి. ఈ సంస్కరణలు చేపట్టి అదనపు రుణాలను తీసుకోవటం కోసం రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.

English summary

ఏపీ, తెలంగాణాతో సహా ఆరు రాష్ట్రాలకు, 19,459 కోట్ల అదనపు రుణాలు .. అనుమతించిన కేంద్రం | Additional borrowings of Rs 19,459 crore to six states, including AP and Telangana

Ministry of Finance, announced Karnataka, Andhra Pradesh, Tamil Nadu, Madhya Pradesh,Rajasthan and Telangana, which have completed the reforms. They have been granted additional borrowing permission of Rs.19,459 crore.
Story first published: Monday, December 28, 2020, 19:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X