For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rakesh Jhunjhunwala: ముూడు నెలల్లో రూ.8 వేల కోట్ల నష్టం.. బిగ్ బుల్ ను ముంచిన బేర్ మార్కెట్..

|

Rakesh Jhunjhunwala: పెట్టుబడి పెట్టేవారు వాటి విలువ పడిపోతే ఎంత నష్టపోతారు మహా అంటే వేలల్లోనే లేక లక్షల్లోనే ఆ మెుత్తం ఉంటుంది. కానీ పెద్ద ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోలు వేల కోట్లలో నష్టాలను నమోదు చేస్తుంటాయి. మనందరికీ మార్కెట్ ఇన్వెస్టర్ బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా గురించి తెలుసు. దేశీయ మార్కెట్ ఇన్వెస్టర్లలో ఆయనకు పెద్ద స్థానం ఉంది. గడచిన మూడు నెలల కాలంలో మార్కెట్ల పతనం కారణంగా ఆయన ఏకంగా రూ.8 వేల కోట్లు నష్టాన్ని చవిచూశారు. ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం జూన్ 2022తో ముగిసిన క్వార్టర్లో ఆయన ఆస్తుల విలువ 24.67 శాతం తగ్గి రూ.25,425.88 కోట్లకు చేరుకుంది.

మార్కెట్ల పతనంతో..

మార్కెట్ల పతనంతో..

స్టాక్ మార్కెట్‌లో బిగ్ బుల్‌గా పేరుగాంచిన రాకేష్ జున్‌జున్‌వాలా ఈ ఆర్థిక సంవత్సరం మెుదటి క్వార్టర్ లో భారీ నష్టాన్ని చవిచూశారు. చాలా కంపెనీల షేర్లు భారీగా పతనం కావడంతో రాకేష్ జున్‌జున్‌వాలా ఆస్తుల క్షీణతకు కారణమైంది. జనవరి నుంచి మార్చి 2022 మధ్య కాలంలో జున్‌జున్‌వాలా ఆస్తులు రూ. 33,753.92 కోట్లుగా ఉన్నాయి. అయితే చాలా మంది ఇన్వెస్టర్లు బిగ్ బుల్ పోర్ట్ ఫోలియోను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు. ఆయన చేసే కొనుగోళ్లకు అనుగుణంగా కొనటం లేదా అమ్మటం వంటివి కూడా చేస్తుంటారు.

33 కంపెనీల్లో పెట్టుబడులు..

33 కంపెనీల్లో పెట్టుబడులు..

రాకేష్ జున్‌జున్‌వాలా 33 పబ్లిక్‌గా లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. వాటిలోనూ ఆయన టైటాన్‌లో భారీ మెుత్తంలో పెట్టుబడి పెట్టాడు.రాకేష్ జున్‌జున్‌వాలా ఈ కంపెనీలో రూ.8,728.9 కోట్లు, స్టార్ హెల్త్‌లో రూ.4,755.2 కోట్లు, మెట్రో బ్యాండ్‌లో రూ.2,431.8 కోట్లు పెట్టుబడి పెట్టారు.బిగ్ బుల్ టాటా మోటార్స్‌లో రూ.1,619.8 కోట్లు, క్రిసిల్‌లో రూ.1315 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.

ఏ స్టాక్స్ వల్ల నష్టం వచ్చింది..

ఏ స్టాక్స్ వల్ల నష్టం వచ్చింది..

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టల్లో డెల్టా కార్ప్, నెట్‌వర్క్ 18 షేర్లు 48% నష్టపోయాయి. మరోవైపు ఇండియాబుల్స్ స్టాక్ ధర 45%, నాల్కో 44%, ఇండియాబుల్స్ ఫైనాన్స్ 43% మేర క్షీణించాయి. వీటికి తోడు ఆప్టెక్, డిష్‌మన్ కార్బోజెన్, స్టార్ హెల్త్ వంటి స్టాక్‌లు 30 నుంచి 40 శాతం వరకు పడిపోయాయి.

English summary

Rakesh Jhunjhunwala: ముూడు నెలల్లో రూ.8 వేల కోట్ల నష్టం.. బిగ్ బుల్ ను ముంచిన బేర్ మార్కెట్.. | ace investor and indian stock market bigbull Rakesh Jhunjhunwala portfolio decreased by 8000 crores in 2022 first quarter

bigbull Rakesh Jhunjhunwala lost 8000 crores in just three months..
Story first published: Tuesday, July 5, 2022, 14:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X