హైదరాబాద్: సాఫ్టువేర్ దిగ్గజం యాక్సెంచర్ మంగళవారం హైదరాబాదులో సరికొత్త ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన సేవలను, ఉత్పత్తులను తీసుకు వచ్చేందుకు యాక్సెంచర్ తన కొత్త ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేసింది.
ఈ ఇన్నోవేషన్ హబ్‌లో కృత్రిమ మేధ, సెక్యూరిటీ, ఆటోమేషన్, బ్లాక్ చైన్ వంటి టెక్నాలజీలపై 2,000కు పైగా నిపుణులు పని చేస్తారు. వివిధ సంస్థలకు ఆధునాతన సాంకేతికతపై పెట్టుబడులు పెట్టే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని యాక్సెంచర్ టెక్నాలజీ సర్వీసెస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాస్కర్ ఘోష్ అన్నారు. దీంతో ఆవిష్కరణల్లో వెనుకబడుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ హబ్ సహకరిస్తుందన్నారు.

భారత్‌లో ఇప్పటికే యాక్సెంచర్‌కు బెంగళూరులో ఇన్నోవేషన్ హబ్ ఉంది. అమెరికాలో 11 ఇన్నోవేషన్ కేంద్రాలు ఉన్నాయి. టోరంటో, షింజెన్, టోక్యో, జ్యూరిచ్.. నగరాల్లో కూడా ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది యాక్సెంచర్. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఆసియా పసిఫిక్‌లోనే మొదటిసారిగా హైదరాబాద్‌లోని ఇన్నోవేషన్ హబ్‌లో యాక్సెంచర్ నానో ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తోంది.
More From GoodReturns

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్‌లో పెరిగిన డిమాండ్!

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?



Click it and Unblock the Notifications