For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గూగుల్‌పై భారీ ఫైన్: ఆ జాప్యం ఖరీదు రూ.750 కోట్లు

|

మాస్కో: టాప్ సెర్చింజిన్ గూగుల్‌కు రష్యా హైఓల్టేజ్ షాకిచ్చింది. తమ దేశ చట్టాలకు విరుద్ధంగా, ఉల్లంఘించే కంటెంట్ ఉన్న పోస్టులను తొలగించడంలో విఫలం కావడం వల్ల 7.2 బిలియన్ రూబుల్స్ జరిమానా విధించింది. అమెరిన్ డాలర్లతో పోల్చుకుంటే దీని విలువ 98 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో సుమారు 750 కోట్ల రూపాయలు. గూగుల్‌కు వస్తోన్న వార్షిక ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ జరిమానాను విధించినట్టు మాస్కో న్యాయస్థానం తెలిపింది.

ఈ జరిమానాలను రష్యా న్యాయస్థానాలు ఒక్క గూగుల్‌కు మాత్రమే పరిమితం చేయలేదు. ఈ ఏడాది పలు టెక్ దిగ్గజాలపై కన్నెర్ర చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌ కూడా ఈ జాబితాలో ఉంది. రష్యాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేషన్స్‌కు సంబంధించిన కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. చట్టాలకు విరుద్ధంగా ఉన్న ఏ కంటెంట్‌ను కూడా ఆ దేశ ప్రభుత్వం అంగీకరించదు. దాన్ని వైరల్ కానివ్వకుండా అడ్డుకోవడానికి కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.

 A Moscow court has fined Google $98m for repeated failure to delete content deemed illegal in Russia

విదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఇంటర్నెట్ కంపెనీల కార్యకలాపాలపై కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ప్రభుత్వం గుర్తించని, అనధికారిక నిరసనలను ప్రోత్సహించే పోస్టులు, చట్టవిరుద్ధమని భావించే ఇతర విషయాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పోస్ట్ చేయడంపై నిషేధాన్ని ప్రకటించింది. ఇప్పటికే పోస్ట్ అయిన కంటెంట్‌ను తొలగించాలంటూ గూగుల్‌, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్స్‌కు నోటీసులను జారీ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా- గూగుల్ యాజమాన్యానికి రష్యా పలుమార్లు సూచనలు జారీ చేసింది.

నోటీసులను ఇచ్చింది. వాటిని తొలగించడంలో జాప్యం ఏర్పడింది. మాస్కో న్యాయస్థానం నుంచి తమకు ఆదేశాలు అందాయని, వాటిని తొలగించే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెబుతూ వచ్చిందే తప్ప అడుగు ముందుకు వేయలేదు. దీనితో మాస్కో న్యాయస్థానం జరిమానాను విధించింది. కంటెంట్ పట్ల తాము హెచ్చరించినప్పటికీ అదే తప్పు మళ్లీ మళ్లీ చేస్తోందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. గూగుల్‌కు 98 మిలియన్ డాలర్లు, ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాకు 27.2 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.

English summary

గూగుల్‌పై భారీ ఫైన్: ఆ జాప్యం ఖరీదు రూ.750 కోట్లు | A Moscow court has fined Google $98m for repeated failure to delete content deemed illegal in Russia

A Moscow court has fined Google 7.2bn roubles ($98m; £73m) for repeated failure to delete content deemed illegal in Russia.
Story first published: Saturday, December 25, 2021, 11:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X