ముంబైలోని ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయంలో రూ.37 కోట్ల భవిష్యనిధి (పీఎఫ్) అక్రమ చెల్లింపుల స్కాం బయటపడింది. తాజాగా జరిగిన ఆడిట్ లో భారీ మొత్తంలో అక్రమంగా పీఎఫ్ మొత్తాల్ని పాక్షికంగా ఉపసంహరించుకున్నట్లు తేలింది. దీంతో నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.
ముంబై ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయంలో జరిగిన ఈ స్కాంకు ఇంటిదొంగలే కారణమని విచారణలో తేలింది. ఈ బుధవారం నాటికి, రూ. 37 కోట్ల విత్‌డ్రాల్‌లు చేశారని, వీటిలో ఎక్కువ భాగం EPF నుండి పాక్షిక ఉపసంహరణ క్లెయిమ్‌లు అని తెలిసింది, కాండివాలిలోని ప్రాంతీయ ఈపీఎఫ్ కార్యాలయంలో లావాదేవీ రికార్డులను పరిశీలించడానికి EPFO యొక్క ఆడిట్ బృందం వెళ్లినప్పుడు ఈ వ్యపహారం బయటపడింది. నిధులను రికవరీ చేసే ప్రయత్నాలతో పాటు, ఈ విషయంలో అడ్మినిస్ట్రేటివ్ మరియు క్రిమినల్ చర్యలు ప్రారంభించినట్లు ఈపీఎఫ్వో వర్గాలు నిర్దారించాయి.

భారీ ఎత్తున పీఎఫ్ మొత్తాల్ని ఉపసంహరించడానికి వీలుగా నకిలీ క్లెయిమ్ లు తయారు చేసి ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రధానంగా విదేశాలకు వెళ్లిన ఉద్యోగుల్ని లక్ష్యంగా చేసుకుని ఈ స్కాం జరిగినట్లు భావిస్తున్నారు. అలాగే ఉద్యోగాలు మారినా పీఎఫ్ ఖాతాలు మార్చుకోని వారి ఖాతాల్ని కూడా మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుని ఉండొచ్చని తెలుస్తోంది. ప్రతీ ఖాతాలోనూ 25 నుంచి 30 శాతం మొత్తాన్ని నెఫ్ట్ విధానంలో బదిలీ చేశారని తెలిసింది. అయితే ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్ లకు వచ్చిన ముప్పేమీ లేదని ఈపీఎఫ్వో వర్గాలు ప్రకటించాయి.
More From GoodReturns

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

Pak Drone: మూడు రోజుల్లో రెండోసారి.. జమ్మూ కాశ్మీర్లో పాక్ డ్రోన్ కలకలం! అసలేం జరుగుతోంది?

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications