For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

3 కంపెనీలు రూ.1 లక్ష కోట్లు ప్లస్, 7 కంపెనీలు రూ.37వేల కోట్లు లాస్

|

గత వారం టాప్ 10‌లోని 7 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ తరిగిపోయింది. అయితే మూడు కంపెనీల పొందిన లాభంతో పోలిస్తే ఏడు కంపెనీల నష్టం తక్కువగా ఉంది. ఈ వారంలో కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ యూనీలీవర్, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీల ఎం-క్యాప్ మాత్రమే పెరిగింది. మిగతా ఏడు కంపెనీల వ్యాల్యూ తగ్గింది.

మినిమం బ్యాలెన్స్ నుండి ఏటీఎం వరకు..: ఆ బ్యాంకుల కస్టమర్లకు షాక్, ఆగస్ట్ 1 నుండి కొత్త రూల్స్మినిమం బ్యాలెన్స్ నుండి ఏటీఎం వరకు..: ఆ బ్యాంకుల కస్టమర్లకు షాక్, ఆగస్ట్ 1 నుండి కొత్త రూల్స్

ఈ 3 కంపెనీల ఎం-క్యాప్

ఈ 3 కంపెనీల ఎం-క్యాప్

రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్ కంపెనీల ఎం-క్యాప్ రూ.98,622.89 కోట్ల మేర పెరిగింది. అలాగే ఏడు కంపెనీలు ఎం-క్యాప్ రూ.37,701.1 తరిగింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.52,046.87 కోట్లు పెరిగి రూ.3,85,027.58 కోట్లకు చేరింది. ఇన్ఫీ కంపెనీ క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఊహలకు మించి రాణించింది. దీంతో ఈ కంపెనీ షేర్లు ఆ రోజు 9 శాతం మేర ఎగిశాయి. హిందూస్థాన్ యూనీలీవర్ ఎం-క్యాప్ రూ.25,751.07 ఎగిసి రూ.5,48,232.26 కోట్లకు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.20,824.95 కోట్లు పెరిగి రూ.12,11,682.08 కోట్లకు చేరుకుంది.

ఈ 7 కంపెనీల ఎం-క్యాప్ తగ్గింది

ఈ 7 కంపెనీల ఎం-క్యాప్ తగ్గింది

HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,920.21 కోట్లు తరిగి రూ.3,13,269.70కు పడిపోయింది. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఎం-క్యాప్ రూ.7,617.34 కోట్లు తరిగి రూ.8,26,031.21, ICICI బ్యాంకు ఎం-క్యాప్ రూ.4,205.71 కోట్లు తరిగి రూ.రూ.2,29,156.24 కోట్లకు, కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాప్రూ.4,175.28 కోట్లు నష్టపోయి రూ.2,62,864.37 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.4,009.83 కోట్లు తగ్గి రూ.3,09,521.05 కోట్లకు, HDFC బ్యాంకు ఎం-క్యాప్ రూ.3,403.97 కోట్లు తగ్గి రూ.6,03,463.97 కోట్లకు, ITC ఎం-క్యాప్ రూ.368.76 కోట్లు తగ్గి రూ.2,38,469.29 కోట్లకు చేరుకుంది.

రిలయన్స్ టాప్

రిలయన్స్ టాప్

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా బీఎస్ఈ టాప్ 10లో తొలి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఆ తర్వాత వరుసగా TCS, HDFC బ్యాంకు, HUL, ఇన్ఫోసిస్, HDFC, భారతీ ఎయిర్ టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ITC, ICICI బ్యాంకు ఉన్నాయి. 30 షేర్ BSE ఇండెక్స్ గత వారం 425.81 పాయింట్లు లేదా 1.16 శాతం ఎగిసింది.

English summary

3 కంపెనీలు రూ.1 లక్ష కోట్లు ప్లస్, 7 కంపెనీలు రూ.37వేల కోట్లు లాస్ | 3 of 10 most valued companies add Rs 98,622.89 crore in M Cap

Seven companies witnessed a decline in their m-cap, but their cumulative loss was less than the total gains made by Reliance Industries, Hindustan Unilever and Infosys.
Story first published: Sunday, July 19, 2020, 19:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X