For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్టోబర్ 31 వరకే మీకు ఛాన్స్, నవంబర్ 1 నుంచి వడ్డీ రేటు తగ్గుతుంది!

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గత కొన్ని నెలలుగా వరుసగా రెపో రేటును తగ్గిస్తూ వస్తోంది. దీంతో రుణాలు తీసుకునే వారికి వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. అదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వారికి మాత్రం ఇది అసంతృప్తిని కలిగించే విషయమే. ఎందుకంటే బ్యాంకుల్లో పెట్టే డబ్బులపై వడ్డీ రేటు తగ్గుతోంది. బ్యాంకులే కాదు శ్రీరామ్ ట్రాన్సుపోర్ట్ ఫైనాన్స్ కూడా వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తోంది. ఇది నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. అంటే ఈ నాలుగైదు రోజుల్లో ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది.

రైతులకు మోడీ ప్రభుత్వం శుభవార్త, మద్దతు ధర ఏ పంటకు ఎంత అంటే?రైతులకు మోడీ ప్రభుత్వం శుభవార్త, మద్దతు ధర ఏ పంటకు ఎంత అంటే?

వడ్డీ రేటు 9.25 శాతం

వడ్డీ రేటు 9.25 శాతం

ప్రస్తుతం శ్రీరామ్ ట్రాన్సుపోర్ట్ ఫైనాన్స్ FDపైన ఏడాదికి 9.25 వడ్డీ రేటును అందిస్తోంది. ఈ కంపెనీకి చెందిన డిపాజిట్లకు AAA రేటింగ్ ఉంది. శ్రీరామ్ ట్రాన్సుఫోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (STFC) కంపెనీ 1979లో ప్రారంభమైంది. FAAA రేటింగ్ కలిగి ఉంది. ఈ వ్యాపారంలో 30 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఉంది. వాణిజ్య వాహనాల పరిశ్రమలకు వ్యవస్థీకృత ఫైనాన్స్ ప్రొవైడర్‌లో ఇది ఒకటి. కమర్షియల్ గూడ్స్ వెహికిల్స్ మాత్రమే కాకుండా పాసింజర్ వెహికిల్స్, మల్టీ యుటిలీటీ వెహికిల్స్, త్రీ వీలర్స్, ట్రాక్టర్స్, కన్స్ట్రక్షన్స్ ఎక్విప్‌మెంట్ వంటి వాటికి కూడా రుణాలు అందిస్తోంది.

ఎవరైనా ఇన్వెస్ట్ చేయవచ్చు

ఎవరైనా ఇన్వెస్ట్ చేయవచ్చు

వ్యాపార విస్తరణ, మంచి రేటింగ్ కొనసాగుతుండటం, అధిక వడ్డీ రేటు నేపథ్యంలో STFCలో పెట్టుబడి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రెసిడెంట్ ఇండివిడ్యువల్స్, హెచ్‌యూఎఫ్‌లు, ట్రస్ట్‌లు, డొమెస్టిక్ కంపెనీలు, ఎన్నారైలే కాదు.. మైనర్లు కూడా STFC ఎఫ్‌డీ‌లో పెట్టుబడి పెట్టవచ్చు. రెసిడెంట్ ఇండివిడ్యువల్స్ ఆన్‌లైన్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

సీనియర్ సిటిజన్లకు అదనం

సీనియర్ సిటిజన్లకు అదనం

ఇన్వెస్ట్ చేసే వారికి 1 సంవత్సరం, రెండేళ్లు, మూడేళ్లు, అయిదేళ్ల ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అత్యధిక వడ్డీ రేటు 5 ఏళ్ల కాలపరిమితికి 9.25 శాతం. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.25 శాతం అందిస్తోంది. అలాగే రెన్యూవల్స్ పైన కూడా 0.25 శాతం అందిస్తోంది.

రెండు రకాల ఆప్షన్స్...

రెండు రకాల ఆప్షన్స్...

ఫిక్స్డ్ డిపాజిట్స్ రెండు రకాలుగా ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు క్యుమ్యులేటివ్ లేదా నాన్ క్యుమ్యులేటివ్ ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. క్యుమ్యులేటివ్ ఆప్షన్ ఎంచుకుంటే మీ వడ్డీ మొత్తం డిపాజిట్ మొత్తానికి యాడ్ అవుతుంది. అంటే ఈ ఆప్షన్ ద్వారా మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ చేతికి వస్తుంది. నాన్ క్యుమ్యులేటివ్ అంటే వడ్డీని ఎప్పటికప్పుడు చెల్లిస్తారు. ఇన్వెస్టర్లు మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ.. ఎలా వేటినైనా ఎంచుకోవచ్చు.

English summary

అక్టోబర్ 31 వరకే మీకు ఛాన్స్, నవంబర్ 1 నుంచి వడ్డీ రేటు తగ్గుతుంది! | FD rates to go down from November 1: Here is a chance to earn 9.25% by investing till October 31

With a long series of cuts in policy rates by the Reserve Bank of India (RBI), both deposit and lending rates of leading banks have come down recently. Going with the trend, Shriram Transport Finance is also set to revise its interest rates downwards by up to 25 bps (1 bps = 0.01 per cent) for Fresh/Renewal of Fixed Deposits (FDs) with effect from November 1, 2019.
Story first published: Friday, October 25, 2019, 12:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X