For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పెరిగిన బంగారం ధర, రూ.39,000 మార్క్ క్రాస్

|

న్యూఢిల్లీ: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్‌కు తోడు రూపాయి కరెన్సీ పతనం కావడంతో బంగారం ధరలు మళ్లీ రూ.39,000 మార్క్ దాటాయి. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.348 పెరిగి రూ.39,115కు చేరుకుంది. వెండి ధర కూడా పెరిగింది. పారిశ్రామికవర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్లు మద్దతుతో కిలో వెండి ఏకంగా రూ.1630 పెరిగి రూ.47,580కి చేరింది.

గ్లోబల్ మార్కెట్లో అతివిలువైన ధరలు ఎక్కువ కావడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం, ట్రేడ్ వార్ భయాలు.. వంటి కారణాలతో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్పాట్ గోల్డ్ ధర రూ.348 పెరిగిందని ఇందుకు గ్లోబల్ ట్రెండ్స్, రూపాయి బలహీనం కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ చెప్పారు.

వాటాలు అమ్మి రూ.90,000 కోట్ల సమీకరణ, అమ్మకానికి ఆస్తులివే..!వాటాలు అమ్మి రూ.90,000 కోట్ల సమీకరణ, అమ్మకానికి ఆస్తులివే..!

Gold prices jump Rs.348 to Rs.39,115 per 10 gram, silver zooms Rs.1,630

అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం 1501 డాలర్లుగా ఉంది. వెండి ఔన్స్ 17.61 డాలర్లుగా ఉంది. ఇన్వెస్టర్లు మరోసారి బంగారం వంటి విలువైన లోహాల వైపు చూస్తున్నారు.

ముంబై మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛత కలిగిన బంగారం ధర మంగళవారం నాటి ధరతో పోల్చితే రూ.625 పెరిగి రూ.38,000కు చేరింది. కిలో వెండి ధర రూ.755 పెరిగి రూ.45,080కు చేరింది. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నాడు దేశవ్యాప్తంగా మార్కెట్లు పని చేయలేదు.

ఆయా నగరాల్లో బంగారం ధరలు..

ఆయా నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. వరుసగా 24 క్యారెట్లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు...

- చెన్నై ₹ 36,360, ₹ 39,580
- ముంబై ₹ 36,800, ₹ 37,800
- న్యూఢిల్లీ ₹ 37,150, ₹ 38,950
- కోల్‌కతా ₹ 37,300, ₹ 38,500
- బెంగళూరు ₹ 35,650, ₹ 38,820
- హైదరాబాద్ ₹ 36,360, ₹ 39,580
- కేరళ ₹ 35,100, ₹ 38,220
- పూణే ₹ 36,800, ₹ 37,800
- బరోడా ₹ 36,900, ₹ 37,790
- అహ్మాదాబాద్ ₹ 36,900, ₹ 37,790
- జైపూర్ ₹ 37,100, ₹ 38,300
- లక్నో ₹ 37,100, ₹ 38,300
- కోయంబ‌త్తూర్‌ ₹ 36,360, ₹ 39,580
- మ‌దురై ₹ 36,360, ₹ 39,580
- విజ‌య‌వాడ‌ ₹ 36,360, ₹ 39,580
- భువ‌నేశ్వ‌ర్‌ ₹ 36,360, ₹ 39,580
- మంగుళూరు ₹ 35,650, ₹ 38,820
- విశాఖ ప‌ట్నం ₹ 36,360, ₹ 39,580
- మైసూర్‌ ₹ 35,650, ₹ 38,820

English summary

భారీగా పెరిగిన బంగారం ధర, రూ.39,000 మార్క్ క్రాస్ | Gold prices jump Rs.348 to Rs.39,115 per 10 gram, silver zooms Rs.1,630

Gold prices jumped Rs 348 to Rs 39,115 per 10 gram in the national capital on Thursday, tracking firm global cues and a weak rupee.
Story first published: Friday, October 4, 2019, 8:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X