For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్ దూకుడు: ఒక్క నిర్ణయంతో రూ.72,000 కోట్లు, ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు!

|

కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు నేపథ్యంలో శుక్రవారం నుంచి మార్కెట్లు జోరు మీద ఉన్నాయి. మూడో రోజైన మంగళవారం కూడా భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మంగళవారం జోరు కాస్త తగ్గినప్పటికీ లాభాల్లో ఉన్నాయి. ఉదయం గం.9.44 సమయానికి సెన్సెక్స్ 127 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 21 పాయింట్లు లాభపడింది. ఆ తర్వాత గం.10.30 సమయానికి సెన్సెక్స్ 34.80 (0.089%) లాభంతో 39,124.83 వద్ద, నిఫ్టీ 1.10 (0.0095%) పాయింట్ల లాభంతో 11,601.30 వద్ద ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.70.73 వద్ద ఉంది.

రూ.12,500 సాయం: రైతుభరోసాకు ఎవరు అర్హులు, విధివిధానాలురూ.12,500 సాయం: రైతుభరోసాకు ఎవరు అర్హులు, విధివిధానాలు

2006 తర్వాత అత్యధిక వృద్ధి రేటు అవుతుంది..

2006 తర్వాత అత్యధిక వృద్ధి రేటు అవుతుంది..

ప్రభుత్వం కార్పోరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ ఒక్క నిర్ణయం తీసుకుంది. దీంతో షేర్లు దూకుడు మీద ఉన్నాయి. బీఎస్ఈ500 సూచీలోని 300 కంపెనీలు రూ.72,000 కోట్లు మిగలనున్నాయి. దీంతో ఈ కంపెనీలకు నిధుల లభ్యత, ఆదాయం పెరిగే అవకాశముంది. కొన్ని కంపెనీలు డిమాండును పెంచుకోవడం కోసం లబ్ధిలో కొంత భాగాన్ని వినియోగదారులకు బదలాయించే అవకాశాలు లేకపోలేదు. ఇలా జరిగితే 2006 తర్వాత అత్యధిక వృద్ధి రేటును కంపెనీలు సాధించే అవకాశముంది.

లాభాల్లో ఫైనాన్షియల్ సంస్థలు

లాభాల్లో ఫైనాన్షియల్ సంస్థలు

కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ షేర్లు ఎగిసిపడ్డాయి. బజాజ్ హోల్డింగ్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కొటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 5 నుంచి 9 శాతం వరకు పెరిగాయి. ఎన్‌బీఎఫ్‌సీలు కూడా లాభపడ్డాయి. సోమవారం దాదాపు అన్ని ఫైనాన్సియల్ సర్వీసెస్ లాభపడ్డాయి.

వేల కోట్ల లబ్ధి...

వేల కోట్ల లబ్ధి...

నిన్న బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, చమురు, గ్యాస్, లోహ, గనులు, కన్స్యూమర్, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలు ఎక్కువగా లాభపడ్డాయి. ఐటీ, ఫార్మా, ఎలక్ట్రిక్ సంస్థలు పాక్షికంగా లబ్ధి పొందాయి. కార్పోరేట్ పన్ను తగ్గింపు నేపథ్యంలో ONGC, IOC, రిలయన్స్ లాభాలకు మరో రూ.12,459 కోట్లు లబ్ధి చేకూరుతుంది. వేదాంత, కోల్ ఇండియా, టాటా స్టీల్‌కు రూ.8,820 కోట్ల మేరకు మిగిలే అవకాశముంది. హిందూస్తాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ, సీమన్ ఇతర కంపెనీలకు కలిపి రూ.11,000 కోట్ల మేర అదనపు లాభం చేకూరింది.

ఈ కంపెనీలకు లాభం..

ఈ కంపెనీలకు లాభం..

మార్కెట్ ర్యాలీ నేపథ్యంలో విదేశీ బ్రోకరేజీ సంస్థలు నిఫ్టీపై అంచనాలు భారీగా పెంచాయి. 2020 సెప్టెంబర్ నాటికి నిఫ్టీ 13,200కు చేరుతుందని అమెరికాకు చెందిన గోల్డ్‌మన్ సాక్స్ పేర్కొంది. ఈ సంస్థ గతంలో 12,500కు చేరుతుందని అంచనా వేసింది. ఇప్పుడు ఆ అంచనాలను సవరించింది. నిఫ్టీలో దాదాపు 20 శాతం కంపెనీలపై ఈ పన్ను తగ్గింపు ప్రభావం సానుకూలంగా ఉంది. ఈ కంపెనీల విలువ నిఫ్టీలో 39% వరకు ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐచర్, బజాజ్ ఆటో, ONGC, ఏషియన్ పేయింట్స్, హీరో మోటో కార్ప్ వంటి సంస్థలు లబ్ధి పొందనున్నాయి.

భారీగా పెరగనున్న ఎం-క్యాప్

భారీగా పెరగనున్న ఎం-క్యాప్

కార్పోరేట్ ట్యాక్స్ ప్రకటన అనంతరం ఆయా రంగాలకు చెందిన కంపెనీలు లాభాలు మూటగట్టుకుంటున్నాయి. వాటి ఎం-క్యాప్ వ్యాల్యూ భారీగా పెరుగుతోంది. బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ అండ్ మైనింగ్స్, కన్సంప్షన్, కేపిటల్ గూడ్స్, ఆటో అండ్ ఆటో ఏఎన్‌సీ, నిర్మాణం రంగం, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, హెల్త్ కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల్లోని కంపెనీల ఎం-క్యాప్ భారీగా పెరగనుందని అంచనా. మొత్తంగా అన్ని రంగాల M-cap 9,65,04,214 మిలియన్లు ఉండగా, కార్పోరేట్ ట్యాక్స్ ప్రకటన అనంతరం FY21లో 7,27,751 కోట్ల మేర పెరుగుతుందని అంచనా. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ (PAT) అనంతరం మొత్తంగా 13 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 0.8 శాతం పెరుగుదల నమోదయింది. ఈ నేపథ్యంలో అన్నీ తెలుసుకొని ఈ రంగాల్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెడితే ప్రయోజనం కూడా ఉండవచ్చు.

English summary

మార్కెట్ దూకుడు: ఒక్క నిర్ణయంతో రూ.72,000 కోట్లు, ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు! | Sensex holds 39K, Nifty above 11,600: Rs.72,000 crore tax benefit for top stocks

Among sectors, bank, infra, metal and pharma are under pressure, while buying seen in the auto, energy and IT. Midcap and smallcap are trading with marginal gains.
Story first published: Tuesday, September 24, 2019, 11:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X