For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త ఫండ్లు వచ్చాయి .... త్వరపడండి!

|

మ్యూచువల్ ఫండ్స్ స్కీం ల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు శుభవార్త. మీ కోసమే చాలా రోజుల తర్వాత కొత్త స్కీమ్స్ అందుబాదులోకి వచ్చియి. విభిన్నంగా ఉన్న ఈ స్కీం లలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించవచ్చు.

ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్

ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్

స్కీం పేరు : ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గ్లోబల్ అడ్వాంటేజ్ ఫండ్

లక్ష్యం : ఇది ఫండ్ అఫ్ ఫండ్స్ స్కీం. అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ లేదా ఈటీఎఫ్ (ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ లేదా ఇతర మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తున్న) యూనిట్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిటర్న్ లను పెంచాలన్నది ఈ స్కీం ప్రాథమిక లక్ష్యం.

స్కీం రకం : ఓపెన్ ఎండెడ్

కేటగిరి : అదర్ స్కీం - ఎఫ్ ఓ ఎఫ్ డొమెస్టిక్

ఫండ్ ప్రారంభం : సెప్టెంబర్ 16 ముగింపు : 20వ తేదీ

* ఈ స్కీం లో ఎలాంటి ఎంట్రీ లోడ్ లేదు. యూనిట్ల అలాట్ మెంట్ నుంచి 12 నెలలవరకు ఎగ్జిట్ అయితే ఎన్ ఏ వీ పై ఒక శాతం ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. 12 నెలల తర్వాత ఉండదు.

* ఈ స్కీం లో కనీస పెట్టుబడి రూ . 5,000

ఐటీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్

ఐటీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్

* దీన్ని ఐటీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకువచ్చింది. ఈక్విటీ, ఈక్విటీ సంభందిత సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా క్యాపిటల్ ను పెంచాలన్నది ఈ స్కీం ఉద్దేశం.

* ఈక్విటీ - ఈ ఎల్ ఎస్ ఎస్ కేటగిరీలో వచ్చిన ఓపెన్ ఎండెడ్ స్కీం ఇది.

* ఈ కొత్త ఫండ్ ఆఫర్ జులై 15న ప్రారంభం కాగా అక్టోబర్ 14న ముగుస్తుంది.

* ఎంట్రీ లోడ్ , ఎగ్జిట్ లోడ్ లేదు.

* కనీస పెట్టుబడి రూ.500

ఎస్ బీ ఐ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఓరియెంటెడ్ ఫండ్ - సీరీస్ ఏ (ప్లాన్ 6)

ఎస్ బీ ఐ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఓరియెంటెడ్ ఫండ్ - సీరీస్ ఏ (ప్లాన్ 6)

* ఎస్ బీ ఐ మ్యూచువల్ ఫండ్ దీన్ని తీసుకువచ్చింది. ఇది క్లోజ్ ఎండెడ్ క్యాపిటల్ ఓరియెంటెడ్ స్కీం. హై క్వాలిటీ ఫిక్స్డ్ ఇన్ కమ్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టాలన్నది ఈ స్కీం ప్రాథమిక లక్ష్యం. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మూలధనాన్ని పెంచుకోవాలన్నది రెండో లక్ష్యం.

* ఆదాయం కేటగిరీలో వచ్చిన క్లోజ్ ఎండెడ్ స్కీం ఇది.

* ఈ నెల 12న ప్రారంభమైన ఈ స్కీం 26న ముగుస్తుంది.

* ఇందులో కనీస పెట్టుబడి రూ. 5,000

టాటా బ్యాంకింగ్ అండ్ పీఎస్ యు డెట్ ఫండ్

టాటా బ్యాంకింగ్ అండ్ పీఎస్ యు డెట్ ఫండ్

* ఈ స్కీం ను టాటా మ్యూచువల్ ఫండ్ తెచ్చింది.

* బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ (పీ ఎస్ యు), పబ్లిక్ ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూషన్స్ , మునిసిపల్ బాండ్శ్ జారీ చేసే డెట్, మనీ మార్కెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా రీజనేబుల్ ఆదాయాన్ని జనరేట్ చేయలన్నది ఈ స్కీం ఉద్దేశం.

* డెట్ స్కీం - బ్యాంకింగ్, పీ ఎస్ యు ఫండ్ కేటగిరీలో వచ్చిన ఓపెన్ ఎండెడ్ స్కీం ఇది.

* ఈ నెల 19న ప్రారంభమైన ఈ షెమీ అక్టోబర్ 3న ముగుస్తుంది.

* ఇందులో కనీస పెట్టుబడి రూ.5,000

English summary

కొత్త ఫండ్లు వచ్చాయి .... త్వరపడండి! | Beat the slowdown by investing smartly

The economic slowdown and a volatile stock market are making a lot of investors nervous. Many mutual fund investors are wondering whether they have made a mistake by investing in equity mutual funds.
Story first published: Saturday, September 21, 2019, 11:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X