For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యువ భారత్ తయారీకి రూ 36,000 కోట్లు, కేంద్ర మానవ వనరుల విభాగం వ్యూహ రచన

|

ప్రపంచమంతా ముసలితనం ఆవహిస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తద్వారా మరో 10-20 ఏళ్ళ లో ఆయా దేశాల్లో శ్రామిక శక్తి మందగించి నుంది. కానీ అదే సమయంలో భారత దేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధం. మరో పదేళ్లలో మన దేశంలో ప్రపంచం లోనే అత్యధిక యువకులు ఉంటారు. అంటే శ్రామిక శక్తి అత్యధికంగా కలిగిన ఏకైక దేశంగా భారత్ అవతరిస్తుంది. మొత్తం జనాభాలో సుమారు 65% యువతే ఉండటం అనేది చాల అరుదైన విషయం.

ఏ దేశంలోనైతే ఎక్కువ జనాభా యువత ఉంటుందో ఆ దేశం ప్రగతి పథం లో దూసుకు పోవటం ఖాయం. అందుకే మన దేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ విషయం పై అత్యధిక శ్రద్ధను కనబరుస్తోంది. ఇంతలా అందుబాటులో ఉండే యువతకు సరైన విద్య, శిక్షణ, ఉపాధి కల్పించడం కోసం భారీగా నిధులను వెచ్చించాలని యోచిస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ 36,000 కోట్ల తో ఒక ప్రణాళిక రూపొందిస్తోంది. దీని ముఖ్య ఉద్దేశ్యం యువతను మెరికల్లా తీర్చిదిద్ది దేశ ప్రగతిని పరుగులు పెట్టించటమే.

వరుసగా 4 రోజులు బ్యాంకులు పని చేయవు: మీరేం చేయాలి!?వరుసగా 4 రోజులు బ్యాంకులు పని చేయవు: మీరేం చేయాలి!?

4 ఈ పాలసీ ...

4 ఈ పాలసీ ...

మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధానంగా 4ఈ పాలసీ ని అనుసరించనుంది. ఇవేమిటంటే... ఎడ్యుకేట్, ఎనర్జిజ్, ఎంప్లాయ్, ఎంపవర్. దేశంలోని ప్రతి పిల్లాడు తప్పని సరిగా ఉన్నత విద్యను అభ్యసించాలి. అదే సమయంలో ఒకేషనల్ కోర్సులు, టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ పొందాలి. అన్ని రకాల చదువుల అనంతరం అందరికి వారి వారి విద్యకు సంభందించిన అంశాల్లో నైపుణ్యాన్ని మెరుగు పరచుకొనేందుకు శిక్షణ అందుబాటులో ఉంచాలి. ఇందుకోసం అప్రెంటిస్ షిప్ లతో కూడిన ఉద్యోగ అవకాశాలను సృష్టించాలి. అనంతరం వారికి పూర్తి స్థాయి ఉద్యోగాన్ని కల్పించటం జరగాలి. ఆ తర్వాత వర్కీకి కెరీర్ లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రోత్సహం అందించాలి. వారు సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని పొదుపు చేయడం నేర్పించాలి. అందరికీ మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా యువత రోజువారీగా ఫిట్ గా ఉండేందుకు తగిన వ్యాయామం చేసేలా విధానాలను రూపొందిచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

2041 వరకు దూకుడే...

2041 వరకు దూకుడే...

భారత దేశంలో ప్రస్తుత జననాల రేటు ప్రకారం చూస్తే 2011 లో మొదలైన యువత సంఖ్య... 2031 భారీగా పెరగనుంది. ఈ దూకుడు 2041 వరకు కొనసాగనుంది. అక్కడి నుంచి జనాభా పేరుగల రేటు నెమ్మదించే అవకాశం ఉంది. ఇదే సమయంలో దేశంలో ఒకరి పై ఆధార పది జీవించే వృద్ధులు వంటి వారి సంఖ్య 49.5% నుంచి 41.1% నికి తగ్గనుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజషన్ (ఐఎల్వో) ఈ గణాంకాలను వెల్లడించింది. దీనిని ఉటంకిస్తూ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. వృద్ధుల సంఖ్య తగ్గడం అంటే... అది దేశం అభివృద్ధి లో దూసుకు పోయేందుకు దొరికిన అద్బుతమైన అవకాశమేనని అంచనా వేస్తున్నారు.

చైనా కంటే మిన్న...

చైనా కంటే మిన్న...

పని చేయ గలిగే యువ శ్రామిక శక్తి పరంగా ఇప్పటికే భారత్ వేగంగా దూసుకు పోతోంది. ఈ విషం లో పొరుగు దేశం చైనా తో పోటీ పడుతోంది. ఇప్పటి వరకు అధికారికంగా చైనా నే ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం. కానీ ఆ దేశంలో జనాభా వృద్ధి మందగించింది. గతంలో అక్కడి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వన్ చైల్డ్ పాలసీ తో జనాభా పెరుగుదల నిలిచి పోయింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ అంతర్గత నివేదిక ప్రకారం... 2020 నాటికీ భారత్ లో 20-24 ఏళ్ళ వయసు గల యువత సంఖ్య 11.6 కోట్లుగా ఉండనుంది. అదే సమయానికి చైనా లో మాత్రం ఇది కేవలం 9.4 కోట్లు మాత్రమే. మరో విషయంలో కూడా భారత్ ప్రపంచంలోనే మెరుగ్గా కనిపిస్తోంది. అదేమిటంటే దేశ సగటు వయస్సు 2020 నాటికీ భారత్ లో 29 సంవత్సరాలు ఉంటె.. అభివృద్ధి చెంది దేశాల్లో ఇది 40 ఏళ్లుగా ఉండనుంది.

సవాళ్లు ఉన్నాయి..

సవాళ్లు ఉన్నాయి..

మన దేశానికి అవకాశాలతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయి. భారత్ లోనూ కొంత కాలంగా జనన వృద్ధి రేటు తగ్గి పోతూ వస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇది అధికంగా కనిపిస్తోంది. ప్రభుత్వ అంచల ప్రకారం దేశంలోని 22 పెద్ద రాష్ట్రాలకు గాను 13 రాష్ట్రాల్లో జననాల రేటు 2.1 కంటే తక్కువగా నమోదవుతోంది. అలాగే బడికి వెళ్లే 5-14 ఏళ్ళ పిల్లల సంఖ్య కూడా గతంలో కంటే తక్కువగా ఉంటోంది. మరో వైపు పెరుగుతున్న యువతకు అదే స్థాయిలో ఉద్యోగాలు కల్పించటం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు.

English summary

యువ భారత్ తయారీకి రూ 36,000 కోట్లు, కేంద్ర మానవ వనరుల విభాగం వ్యూహ రచన | Rs.36,000 crores for Yuva Bharat

Central Government will allot Rs.36,000 crores for Yuva Bharat. Human Resources ministry will follow 4 E-policies for Yuva Bharat.
Story first published: Wednesday, September 18, 2019, 10:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X