For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈఎంఐతో వాహన బీమా... ఎలాగంటే?

|

కొత్త వాహన చట్టం అమలు తర్వాత వాహనదారుల్లో గుబులు పెరిగిపోయింది. సరైన పత్రాలు లేని వారు వాహనాన్ని బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. బయటకు వెళ్లే సమయంలో అన్ని పత్రాలు ఉన్నది లేనిదీ చూసుకుని మరీ వెళుతున్నారు. లైసెన్స్, బీమా, పొల్యూషన్, హెల్మెట్ ఏది లేకపోయినా జరిమానాల వాయింపు ఉంటుంది మరి. అందుకే ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు చాలా మంది.

బీమా ప్రీమియం లు పెరిగిపోయాయి కాబట్టి ఇప్పటికిప్పుడు వాహన బీమాను రెన్యూవల్ చేయడం లేదా కొత్త బీమా తీసుకోవడం కొంత భారమైన విషయమే. ఈ రోజుల్లో ఒక ఇంట్లో ఒకటికి మించి వాహనాలు ఉంటున్నాయి. వాటికీ ఇప్పుడు ఒక్కసారిగా బీమా తీసుకోవాలంటే కాస్త ఇబ్బందికరమైన విషయమే. కానీ బీమా తప్పదు మరి. అందుకే కొన్ని పద్దతుల ద్వారా ఈ బీమా భారాన్ని తగ్గించుకోవచ్చు. అవేమిటంటే...

ఎయిరిండియా నిర్వహణ నష్టం రూ.4,600 కోట్లు, పాక్ ఎఫెక్ట్ కూడా.ఎయిరిండియా నిర్వహణ నష్టం రూ.4,600 కోట్లు, పాక్ ఎఫెక్ట్ కూడా.

థర్డ్ పార్టీ...

థర్డ్ పార్టీ...

* ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ బీమా తప్పని సరి. వాహనం నడిపినప్పుడు మరో వాహనానికి లేదా మూడో వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినా లేక ప్రాణం పోయినా ఆ మేరకు ప్రమాదానికి కారణమైన వారు భాద్యత వహించాల్సి వస్తుంది. కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో వీటిని సెటిల్ చేసుకోవద్దని పెద్దమొత్తంలో ఖర్చులు భరించాల్సి రావచ్చు. కాబట్టి థర్డ్ పార్టీ బీమా ఉంటే రక్షణ లభిస్తుంది.

* ఇక సమగ్రమైన బీమాను కూడా తీసుకోవచ్చు. ఇందులోఓన్ డ్యామేజీ కవర్ కూడా ఉంటుంది. అంటే వాహనానికి ఏమైనా జరిగినా బీమా పరిహారం పొందవచ్చు. అయితే థర్డ్ పార్టీ బీమాకు, సమగ్రమైన బీమాకు చెల్లించే మొత్తంలో తేడా ఉంటుంది.

* సమగ్ర బీమా తీసుకోలేని పరిస్థితి ఉంటె థర్డ్ పార్టీ బీమాను తీసుకొని బీమా భారాన్ని తగ్గించుకోవచ్చు.

ఆన్ లైన్ లో సులభంగా..

ఆన్ లైన్ లో సులభంగా..

* బీమా రెన్యూవల్ లేదా కొత్త బీమాను చాలా సులభంగా తీసుకోవచ్చు. నిమిషాల వ్యవధిలో ఈ బీమాను పొందవచ్చు. బీమా కంపెనీల వెబ్ సైట్ లేదా బీమా పాలసీల అగ్రిగేటర్ వెబ్ సీట్ల ద్వారా పాలసీని తీసుకోవచ్చు.

* బీమా పాలసీల అగ్రిగేటర్ల వద్ద వివిధ రకాల కంపెనీలు ఇచ్చే పాలసీలను పోల్చిచూసుకునే అవకాశం ఉంటుంది. తక్కువ బీమాను ఉన్న వాటిని ఎంచుకొని భారం తగ్గించుకోవచ్చు..

వాయిదాల్లో...

వాయిదాల్లో...

* వాహన బీమాను ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసే సమయంలో డిజిటల్ విధానంలో అంటే కార్డులు లేదా డిజిటల్ వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నారు.

* ఉదాహరణకు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే బీమా మొత్తాన్ని చెల్లించడానికి కొంత సమయం ఉంటుంది. బిల్లు జెనరేట్ అయినా తర్వాత బీమాను రెన్యూవల్ చేసుకుంటే ఆమొత్తాన్ని దాదాపు 50 రోజుల తర్వాత చెల్లించవచ్చు. అప్పుడు కూడా ఇక మొత్తంగా చెల్లించడం భారమే అయితే ఆ మొత్తాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించే సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి కొంత సొమ్ము చెల్లించాల్సి వస్తుంది. కానీ దీనివల్ల బీమాకు సంభందించిన భారం తగ్గించుకోవచ్చు.

* టూ వీలర్లతో పాటు కారు బీమాను రెన్యూవల్ చేయాలంటే ఎక్కువ మొత్తం అవసరం ఉంటుంది. కాబట్టి ఈఎంఐ ని ఎంచుకోవడం వల్ల బీమా భారాన్ని తగ్గించుకోవచ్చు.

English summary

ఈఎంఐతో వాహన బీమా... ఎలాగంటే? | Vehicle insurance with EMI

Vehicle insurance would typically cover both the property risk (theft or damage to the vehicle) and the liability risk (legal claims arising from an accident).
Story first published: Monday, September 16, 2019, 19:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X