న్యూఢిల్లీ: బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అమెరికాతో చర్చలకు సిద్ధమని చైనా ప్రకటన చేయడం, అంతర్జాతీయంగా మార్కెట్లు కాస్త కోలుకుంటుండటంతో పసిడి ధరల్లో తగ్గుదల కొద్దిగా కనిపించింది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ 0.5 శాతం తగ్గింది. స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 1,544.66 డాలర్లుగా ఉంది. బుధవారం ఈ ధర 1,557 డాలర్లుగా ఉంది. 2013 నుంచి అత్యధికం ఇదే కావడం గమనార్హం.

బంగారం, వెండి తగ్గుముఖం
భారత్‌లోను బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అహ్మదాబాద్‌లో స్పాట్ బంగారం పది గ్రాముల ధర రూ.39011, గోల్డ్ ఫ్యూచర్ ధర రూ.39496గా ఉంది. గురువారం ఉదయం గం.11.30 సమయంలో ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ.39,470గా ఉంది. కాగా, బుధవారం కిలో వెండి ధర రూ.51,489కు చేరుకున్న విషయం తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో ఎంత తగ్గిందంటే
హైదరాబాదులో 10 గ్రాముల 24 గ్యారెట్లు (99.9 శాతం స్వచ్ఛత) కలిగిన బంగారం రూ.40,920గా ఉంది. విజయవాడలో రూ. 40,920, చెన్నైలో రూ.40,920, ముంబైలో రూ.39,200, ఢిల్లీలో రూ.39,450, బెంగళూరులో రూ.40,150గా ఉంది. కొన్ని నగరాల్లో రూ.41వేలకు సమీపంలో ఉంది. నిన్నటి వరకు భారీగా పెరిగిన ధరలు.. నేడు అతి స్వల్పంగా మాత్రమే తగ్గాయి. ఉదాహరణకు హైదరాబాదులో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం నిన్న రూ.41,070గా ఉంటే నేడు రూ.40,920వద్ద ఉంది. విజయవాడలోను అంతే తగ్గింది.

సురక్షిత పెట్టుబడులు
బంగారం, వెండి ధరలు నిన్నటి వరకు పరుగులు పెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఛాయలు, అమెరికా - చైనా ట్రేడ్ వార్ భయాలు, స్టాక్ మార్కెట్లు నష్టాల నేపథ్యంలో అందరూ సేఫ్ సైడ్‌గా బంగారం వైపు పెట్టుబడులు తరలించారు. బంగారం వంటి లోహాలను సురక్షిత పెట్టుబడులుగా భావిస్తారు. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది.

భారీగా పెరిగిన వెండి
బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర ఏకంగా రూ.2,070 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.50,125కి చేరుకుంది. మంగళవారం ఇది రూ.48,055గా ఉంది. గత రెండు నెలల కాలంలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ఈ కాలంలో వెండి ధర రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు పెరిగింది. న్యూయార్క్‌లో ఔన్స్ వెండి విలువ 19.27 డాలర్లుగా నమోదైంది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

Silver price: బంగారం పని అయిపోయిందా? వెండి వైపు ఇన్వెస్టర్ల క్యూ.. 2026లో కోటీశ్వరులయ్యే ఛాన్స్!

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..



Click it and Unblock the Notifications