For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ సమయంలోనూ పెరిగిన విద్యుత్ డిమాండ్, రాష్ట్రాలకు భారమే

|

గత ఆరేళ్లలో ఆర్థిక విస్తరణ చాలా బలహీనంగా ఉంది. కానీ భారత్‌లో విద్యుత్ డిమాండ్ మాత్రం దాదాపు 7 శాతం పెరిగింది. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. ప్రపంచ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్ కూడా మందగమనంగా ఉంది. భారీ పరిశ్రమలు ఉన్న రాష్ట్రాల్లో పవర్ అవసరాల పెరుగుదల ఏప్రిల్ - జూలై క్వార్టర్లో తగ్గింది. అదే సమయంలో డిమాండ్ ఎందుకు పెరిగిందంటే... మోడీ ప్రభుత్వం వచ్చాక పెద్ద సంఖ్యలో హౌస్ హోల్డ్స్‌కు విద్యుత్ కనెక్షన్లు దరి చేర్చారు. ఆయా రాష్ట్రాల్లోని గృహా విద్యుత్ వినియోగం పెరగడంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది.

సెప్టెంబర్ 5న జియో గిగా ఫైబర్: అప్లై ఎలా చేసుకోవాలి, ధరలు ఎంత?సెప్టెంబర్ 5న జియో గిగా ఫైబర్: అప్లై ఎలా చేసుకోవాలి, ధరలు ఎంత?

పరిశ్రమలకు పవర్ డిమాండ్ తగ్గుదల

పరిశ్రమలకు పవర్ డిమాండ్ తగ్గుదల

ప్రభుత్వ సెంట్రల్ ఎలస్ట్రిసిటీ అథారిటీ డేటా ప్రకారం తమిళనాడు, మహారాష్డ్రలు ఆటోమొబైల్ మేకింగ్, విడిభాగాల తయారీ హబ్ రాష్ట్రాలు. ఇక్కడ పవర్ డిమాండ్ వరుసగా 2.7 శాతం, 1.4 శాతం పెరిగింది. లార్జ్ పవర్ కన్స్యూమర్స్‌లకు విద్యుత్ డిమాండ్ నెమ్మదించింది. హర్యానా, గుజరాత్‌లు తయారీ హబ్స్. ఇక్కడ విద్యుత్ అవసర డిమాండ్ గత ఏడాది కంటే తగ్గింది. హర్యానాలో 7.5 శాతం నుంచి 2.9 శాతానికి, గుజరాత్‍‌లో 8.8 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గింది.

ఆర్థిక మందగమనం

ఆర్థిక మందగమనం

గత కొంతకాలంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆటో సేల్స్ భారీగా తగ్గాయి. దీంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కార్ల అమ్మకాలు తిరోగమనం పట్టడంతో వాహన తయారీదారులు ఉద్యోగులను తొలగించడంతో పాటు తాత్కాలికంగా కంపెనీలను మూసివేసే పరిస్థితులు వచ్చాయి. శుక్రవారం విడుదలైన డేటా ప్రకారం జీడీపీ 5 శాతంగా ఉంది. 2013 మార్చి తర్వాత తొలిసారి ఈ క్వార్టర్‌లో నెమ్మదించింది.

కంపెనీలకు విద్యుత్ డిమాండ్ పెరిగితే లాభం

కంపెనీలకు విద్యుత్ డిమాండ్ పెరిగితే లాభం

కమర్షియల్ కంపెనీలు, ఫ్యాక్టరీలు వంటి వాటి నుంచి విద్యుత్‌కు డిమాండ్ పెరగడం.. ఇతర మార్గాల ద్వారా డబ్బును నష్టపోయే విద్యుత్ పంపిణీదారులకు ప్రయోజనం. ఇలాంటి వినియోగదారులు దాదాపు సగం వరకు ఉన్నాయి. వీరు ఎక్కువ మొత్తం చెల్లిస్తారు. ఇలా చెల్లించడం వల్ల పేదల ఇళ్లకు, రైతులకు సబ్సిడీ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది.

రాష్ట్రాలపై భారం

రాష్ట్రాలపై భారం

ప్రతి ఇంటిని విద్యుదీకరిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అంతకుముందు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీని దాదాపు నెరవేర్చారు. 2019లో ఆయన తిరిగి అద్భుత మెజార్టీతో గెలవడానికి ఈ హామీ కూడా ఓ కారణం. అయితే వాణిజ్య కంపెనీలు ఎక్కువ ఎలక్ట్రిసిటీని కొనుగోలు చేయకపోతే ఆ భారం రాష్ట్ర యుటిలీటీస్ పైన పడుతాయి. ప్యాక్టరీ డిమాండ్ తగ్గిందని చెప్పడానికి డీజిల్ డేటా కూడా చెబుతోంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ ప్రకారం అంతకుముందు ఏడాది కంటే ఏప్రిల్ - జూలైలో 2.4 శాతం పెరిగింది.

English summary

ఈ సమయంలోనూ పెరిగిన విద్యుత్ డిమాండ్, రాష్ట్రాలకు భారమే | Why demand for power is surging amid India’s growth slowdown

An almost 7% growth in India’s electricity demand at a time when economic expansion has cooled to its weakest in six years may appear as a paradox at first glance. Clarity emerges with a closer look.
Story first published: Wednesday, September 4, 2019, 13:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X