For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెప్టెంబర్ 5న జియో గిగా ఫైబర్: అప్లై ఎలా చేసుకోవాలి, ధరలు ఎంత?

|

ముంబై: రిలయన్స్ గిగా ఫైబర్ సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభం కానుంది. గిగా ఫైబర్‌తో పాటు ఫిక్స్‌డ్ లైన్ ఫోన్ సేవలు, గేమింగ్ కేపబుల్ సెట్ టాప్ బాక్స్, ఉచిత 4K టీవీ, జియో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT) వంటి సేవలు ఉంటాయి. బ్రాండ్ బాండ్ సేవలు విప్లవాత్మకం చేయాలన్న ఉద్దేశ్యంతో ఆగస్ట్ 12వ తేదీన ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్ (AGM)లో గిగా ఫైబర్ పైన ప్రకటన చేసారు. మీరు జియో గిగా ఫైబర్ కోసం ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి....

జియో గిగా ఫైబర్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

జియో గిగా ఫైబర్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

జియో గిగా ఫైబర్ ఏడాదికి పైగా రిజిస్ట్రేషన్స్‌ను ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో గిగా ఫైబర్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చునో తెలుసుకోండి. ఇప్పటికీ ప్రారంభించని వారిని కూడా చేరుకొని, అత్యధిక రిజిస్ట్రేషన్స్‌తో గిగా ఫైబర్‌ను విడుదల చేస్తామని తెలిపింది. దేశంలోని 1,600 టౌన్స్ నుంచి 15 మిలియన్ల రిజిస్ట్రేషన్లు వచ్చాయి. జియో ఫైబర్ సేవల కోసం వెబ్ సైట్‌లోకి వెళ్లి మీ వివరాలు, అడ్రస్ ఇవ్వడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

గిగా ఫైబర్ ధరలు...

గిగా ఫైబర్ ధరలు...

ఆగస్ట్ 12న జరిగిన AGM సమావేశంలో జియో గిగా ఫైబర్ ధరలను, ఎప్పుడు లాంచ్ చేసే విషయాన్ని ముఖేష్ అంబానీ తెలిపారు. జియో గిగా ఫైబర్ నెలవారీ అలాగే సంవత్సరం ప్లాన్స్‌తో వస్తోంది. నెలవారీ ప్లాన్స్ కనీసం రూ.700 నుంచి రూ.10,000 వరకు ఉన్నాయి. అయితే సంవత్సరం ప్లాన్స్ గురించి ఇంకా స్పష్టత రాలేదు.

ఎంత స్పీడ్

ఎంత స్పీడ్

రిలయన్స్ జియో గిగా ఫైబర్ చందాదారుడు కనీసం 100Mbps స్పీడ్‌తో వస్తుంది. ప్లాన్ ధరలు పెరిగేకొద్ది 1Gbps వరకు కూడా స్పీడ్ వస్తుంది. రూ.700 ప్లాన్ 100Mbps స్పీడ్‌ను ఆఫర్ చేస్తుంది.

జియో ఫైబర్ ఏ నగరాల్లో..?

జియో ఫైబర్ ఏ నగరాల్లో..?

జియో గిగా ఫైబర్ సేవలు ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, జైపూర్, హైదరాబాద్, సూరత్, వడోదర, చెన్నై, నోయిడా, ఘజియాబాద్, భువనేశ్వర్, వారణాసి, అలహాబాద్, బెంగళూరు, ఆగ్రా, మీరట్, వైజాగ్, లక్నో, జమ్‌షేడ్‌పూర్, హరిద్వార్, గయా, పాట్నా, పోర్ట్ బ్లెయిర్, పంజాబ్‌లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా మిగతా నగరాలకు విస్తరిస్తుంది.

జియో గిగా ఫైబర్ ఆఫర్స్

జియో గిగా ఫైబర్ ఆఫర్స్

జియో గిగా ఫైబర్ ఆఫర్స్ కూడా కస్టమర్లను ఆఖట్టుకునేలా ఉన్నాయి. ఉచిత లోకల్, ఎస్టీడీ కాల్స్ సౌకర్యం ఉంది. OTT కంటెంట్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. OTT ప్లాట్ ఫామ్స్ అన్నింటిని పేర్కొనలేదు. అయితే సబ్‌స్కైబర్స్ జియో సినిమా, జియో టీవీ, జియో సాన్‌లు పొందుతారు.

ఫస్ట్ డే ఫస్ట్ షో

ఫస్ట్ డే ఫస్ట్ షో

జియో First Day First Show (ఫస్ట్ డే ఫస్ట్ షో) ఆఫర్ ద్వారా ఏదైనా సినిమా థియేటర్‌లో విడుదలైన రోజునే చూడవచ్చు. రిలయన్స్ గిగా ఫైబర్ అందిస్తున్న ఈ ఆఫర్ యూజర్లకు లాభదాయకమే. కానీ వచ్చే ఏడాది నుంచి దీనిని ప్రారంభించనున్నారు.

English summary

సెప్టెంబర్ 5న జియో గిగా ఫైబర్: అప్లై ఎలా చేసుకోవాలి, ధరలు ఎంత? | Reliance Jio Fiber to launch on Sept 5: here's how to apply, prices, 4K TV offer, other details

Reliance Jio GigaFiber that has been renamed Jio Fiber will be launched in India this week on September 5.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X