భారీ నష్టాల్లో మార్కెట్లు, 769 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, నిఫ్టీ 225 లాస్
ముంబై: భారత మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.45 నిమిషాలకు సెన్సెక్స్ 375 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 100కు పైగా పాయింట్లు కోల్పోయింది. పదిగంటల సమయానికి సెన్సెక్స్ 313.27 (0.84%) నష్టపోయి 37,019.52 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 99.55 (0.90%) పాయింట్లు కోల్పోయి 10,923.70 వద్ద ట్రేడ్ అయింది.
సాయంత్రానికి మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సాయంత్రం 3.40 నిమిషాలకు సెన్సెక్స్ 769.88 (2.06%) పాయింట్లు కోల్పోయి 36,562.91 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా గం.3.32 నిమిషాలకు
225.35 (2.04%) కోల్పోయి 10,797.90 వద్ద ట్రేడ్ అయింది.
పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఆటో ఇండస్ట్రీ నష్టాల్లో కూరుకుపోయాయి. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓన్జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇండియా వీఐఎక్స్ 8 శాతం లాభాల్లో ట్రేడ్ అయింది. ఐటీ షేర్లు మాత్రం లాభాల్లో ప్రారంభమయ్యాయి.

శుక్రవారం పది ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకులు 2017 ఏడాది నుంచి 27 బ్యాంకుల నుంచి 12కు పడిపోయాయి. ఇటీవలి విలీనానికి ముందు 18 బ్యాంకులు ఉండగా, ఇప్పుడు పన్నెండుకు తగ్గాయి. బ్యాంకుల విలీనం నేపథ్యంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈ నిర్ణయం బ్యాంకింగ్ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది.


Click it and Unblock the Notifications