For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: ఇక నుంచి వాట్సాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు

|

మీరు వాట్సాప్ ద్వారా కూడా మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడులు పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్ హౌసెస్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (CAMS)లు ఈ సౌకర్యం కల్పించాయి. ప్రస్తుతం వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ లేదని చెప్పవచ్చు. ఇండియాలో 400 మిలియన్ల వాట్సాప్ యూజర్లు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు. ఆదిత్యా బిర్లా సన్ లైఫ్ మ్యుచువల్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ మ్యుచువల్ ఫండ్.. వాట్సాప్ ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్ సౌకర్యాన్ని ఇటీవలే తీసుకువచ్చాయి.

అలర్ట్: ATM కొత్త రూల్స్, మనీ విత్ డ్రా రోజుకు ఒక్కసారే!!అలర్ట్: ATM కొత్త రూల్స్, మనీ విత్ డ్రా రోజుకు ఒక్కసారే!!

వాట్సాప్ ఆధారిత ఫండ్స్ కోసం...

వాట్సాప్ ఆధారిత ఫండ్స్ కోసం...

మోతీలాల్ ఓస్వాల్ మ్యుచువల్ ఫండ్ కంటే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యుచువల్ ఫండ్ విస్తృత ఎంపికలను అందిస్తోంది. కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లేదా CAMS కూడా ఇటీవలే ఆధారిత CAMServను ప్రారంభించింది. దీని ద్వారా 16 AMC సేవలలో దేనిలోనైనా వివిధ ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ నిర్వహణకు సహకరిస్తుంది.

ఆదిత్య బిర్లా, మోతీలాల్ ఓస్వాల్.. ఆఫర్లు

ఆదిత్య బిర్లా, మోతీలాల్ ఓస్వాల్.. ఆఫర్లు

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ ద్వారా పెద్ద మొత్తంలో లేదా SIP ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. రీడీమ్, అకౌంట్ స్టేట్‌మెంట్ తీసుకోవడానికి, క్యాపిటల్ గెయిన్ స్టేట్‌మెంట్, మీ స్కీంల NAV పొందడానికి అనుమతిస్తుంది.

మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ పండ్ ద్వారా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ SIP లేదా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈక్విటీ స్కీంలు, ఇండెక్స్ ఫండ్ NFOలు, హైబ్రిడ్ స్కీంలను కొనుగోలు చేయవచ్చు. మోతీలాల్ ఓస్వాల్ ద్వారా మీరు డెబిట్ ఫండ్స్‌ను కొనుగోలు చేయలేరు. ఒకేవళ మీరు AMC తొలిసారి ఇన్వెస్టర్ అయితే ఖాతాను తెరవమని అడుగుతుంది.

CAMServ.. ఆఫర్లు

CAMServ.. ఆఫర్లు

CAMServ ద్వారా కొనుగోలు, రీడీమ్, SIP స్టార్ట్, అకౌంట్ స్టేట్‌మెంట్ రిసీవింగ్, మీ ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ వంటి సౌకర్యాలు ఉంటాయి. మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్‌గా ఉన్న AMCల ప్రస్తుత లేదా కొత్త ఫోలియోలలో అదనపు కొనుగోళ్లు చేయవచ్చు. ఈ వాట్సాప్ బాట్ కొత్త పోలియో క్రియేట్ చేసేందుకు మాత్రం అనుమతించదు. మీ బ్యాంకు వివరాలు, నామినీ, జాయింట్ హోల్డర్ తదితర వ్యక్తిగత వివరాలు మార్చుకునే వెసులుబాటు కల్పిస్తుంది.

ఎలా ప్రారంభించాలి?

ఎలా ప్రారంభించాలి?

- CAMServకు చెందిన 6384863848 నెంబర్‌ను మీ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేసుకొని, యాక్సెస్ పొందాలి. ఆ తర్వాత వాట్సాప్ విండో ఓపెన్ చేసి, Hi అని టైప్ చేసి ప్రారంభిస్తే చాలు.

88288 00033 నెంబర్‌ను మీ కాంటాక్ట్ లిస్టులో సేవ్ చేసుకొని ఆదిత్య - బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ ఫెసిలిటీని పొందవచ్చు. Hi అని టైప్ చేసి ప్రారంభిస్తే చాలు. లేదా 9579810022 మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా 9579810022 నెంబర్‌కు Yes అని ఎస్సెమ్మెస్ చేయడం ద్వారా ప్రారంభించవచ్చు.

- మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ వాట్సాప్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటీ సౌకర్యం పొందేందుకు మొదట 9372205812 నెంబర్‌ను మీ ఫోన్ లిస్టులో సేవ్ చేసుకోవాలి. వాట్సాప్ విండో ఓపెన్ చేసి, Hi అని సంభాషణ ప్రారంభించవచ్చు.

విష్ ఫిన్ ద్వారా కూడా... కానీ

విష్ ఫిన్ ద్వారా కూడా... కానీ

ఫైనాన్షియల్ మార్కెట్‌ప్లేస్ విష్‌ఫిన్ (Wishfin) కూడా వాట్సాప్ ద్వారా SIP పెట్టుబడులకు అనుమతిస్తోంది. Wishfin వెబ్ సైట్లోకి వెళ్లి మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్‌కు వెళ్లి మీ పేరు, మొబైల్ నెంబర్ టైప్ చేయడం ద్వారా ప్రారంభించవచ్చు. ఇందులో లిమిటేషన్ ఉంది. మీకు ఫండ్స్ ఎంచుకునే విషయంలో విస్తృత పరిధి లేదు. సెలెక్టెడ్ SIPలలో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి.

మీరు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చా?

మీరు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చా?

CAMS ద్వారా సేవలు అందించే 16 ఫండ్ హౌస్‌లలోని ఏదైనా పథకంలో మీరు CAMServ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మోతీలాల్ ఓస్వాల్ AMC లేదా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యుచువల్ ఫండ్‌లోను వాట్సాప్ ఆధారిత సేవలు పొందవచ్చు.

అదే కారణంగా ఉండకూడదు...

అదే కారణంగా ఉండకూడదు...

అయితే మ్యూచువల్ ఫండ్లలో మీరు పెట్టుబడులు ప్రారంభించడం లేదా కొనసాగించేందుకు మాత్రమే ఈ సౌకర్యం కారణంగా ఉండకూడదు. మీ లక్ష్యాలు, రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా మీరు ఎల్లప్పుడూ మీ మ్యుచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. చివరగా మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియకపోతే మీరు ఎప్పుడూ అనుభవజ్ఞులైన సలహాదారు సహాయం తీసుకోవాలి.

English summary

గుడ్‌న్యూస్: ఇక నుంచి వాట్సాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు | You can now invest in mutual funds through WhatsApp, should you?

A couple of mutual fund houses and Computer Age Management Services (CAMS), a registrar and transfer agency for 16 fund houses, have recently launched investment facilities through WhatsApp, probably the most used app on your mobile phone.
Story first published: Thursday, August 29, 2019, 12:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X