For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుపీ షాక్: తొలిసారి డాలర్‌తో రూ.72కు దిగజారిన రూపాయి!

|

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం మధ్యాహ్నం సమయానికి ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రోజు రోజుకు దిగజారుతోంది. ఈ రోజు 72.01 వద్ద ట్రేడ్ అయింది. 2019 సంవత్సరంలో రూపాయి 72కు చేరుకోవడం ఇదే తొలిసారి. చైనా యువాన్ 11 ఏళ్ల కనిష్టానికి చేరుకుంది.

<strong>ఏపీ నుంచి కియా 'మేడిన్ ఇండియా' కార్లు అదుర్స్: ధరలు</strong>ఏపీ నుంచి కియా 'మేడిన్ ఇండియా' కార్లు అదుర్స్: ధరలు

రూపాయి దిగజారడం తొలిసారి...

రూపాయి దిగజారడం తొలిసారి...

గురువారం నాటితో పోలిస్తే రూపాయి శుక్రవారం ఉదయం 15 పైసల తక్కువకు (71.97) ట్రేడ్ అయింది. ఆ తర్వాత 72కు దిగజారింది. 2019లో ఇలా తగ్గడం ఇదే మొదటిసారి. అదే సమయంలో ఒక నెలలో రూపాయి ఇంత దిగజారడం ఆరేళ్లలో ఇది తొలిసారి. ఈ ఒక్క ఆగస్ట్ నెలలోనే 4.60 శాతం నష్టపోయిన రూపాయి, 2019 ఆరంభం నుంచి చూస్తే మొత్తంగా 3.10 శాతం నష్టపోయింది.

రూ.71.80 నుంచి రూ.72.50 మధ్య క్లోజ్ అయ్యే ఛాన్స్

రూ.71.80 నుంచి రూ.72.50 మధ్య క్లోజ్ అయ్యే ఛాన్స్

అమెరికా - చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా నష్టాలను చవి చూసిన అంతర్జాతీయ మార్కెట్లు, ఇటీవలే కోలుకుంటున్నాయి. భారత్ రూపాయితో పాటు చైనా యువాన్ కిందకు జారుతోంది. రూపాయి నష్టపోతుండటంతో సాఫ్టువేర్ రంగ షేర్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు రూపాయితో డాలర్ మారకం విలువ రూ.71.80 నుంచి రూ.72.50 మధ్య క్లోజ్ అవుతుందని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేశారు.

భారీ ఎఫ్‌పీఐలు వెనక్కి

భారీ ఎఫ్‌పీఐలు వెనక్కి

గురువారం నాడు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూపాయి 71.82 వద్ద క్లోజైంది. శుక్రవారం ఓ సమయంలో 71.51, 71.72 వద్దకు చేరుకుంది. ఆ తర్వాత కాస్త కోలుకుంది. 2018 డిసెంబర్ నుంచి రూపాయి ఇంతలా నష్టపోవడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా, ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు (FPI)లు గురువారం రూ.900 కోట్లను కేపిటల్ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు.

English summary

రుపీ షాక్: తొలిసారి డాలర్‌తో రూ.72కు దిగజారిన రూపాయి! | Rupee weakens to 72 against US dollar for first time in 2019

The rupee on Friday slipped to 72 mark against the US dollar for the first time in 2019 following selloff in domestic equities amid weakness in Chinese Yuan which fell to a fresh 11 year low level.
Story first published: Friday, August 23, 2019, 11:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X