For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తనఖా తెచ్చిన తంటా.. రుణదాతల చేతిలోకి కంపెనీలు

|

కంపెనీల నిర్వహణ అంత సులభం ఏమీ కాదు. కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. స్థిరాస్తులు, చరాస్తులు, నిర్వహణ ఖర్చులు తదితరాల కోసం సొంత నిధులతో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి డబ్బులు సమకూర్చుకోవాలి. వ్యాపారం సక్సెస్ అయితే పండగే. కానీ అనుకున్న స్థాయిలో వ్యాపారం సాగక పోతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్వహణ ఖర్చుల కోసం కష్టపడాల్సి వస్తుంది. మరిన్ని అప్పులు తీసుకు రావాల్సి ఉంటుంది. వీటి వడ్డీలు తడిసి మోపెడవుతాయి. ఫలితంగా కొన్ని సందర్భాల్లో ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి ఉంటుంది. రుణాల కోసం చాలా మంది ప్రమోటర్లు తమ షేర్లను బ్యాంకుల వద్ద తనఖా పెడుతుంటారు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించకపోవడం వల్ల ఆ షేర్లను బ్యాంకులు కంపెనీలో తమ వాటాగా మార్చుకుంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కంపెనీలు పూర్తిగా బ్యాంకుల చేతిలోకి వెళ్లిన సందర్భాలున్నాయి.

<strong>సంచలన నిర్ణయం దిశగా ట్రంప్.. లక్షలాది భారతీయుల ఆందోళన</strong>సంచలన నిర్ణయం దిశగా ట్రంప్.. లక్షలాది భారతీయుల ఆందోళన

ఇటీవలే మరికొన్ని..

ఇటీవలే మరికొన్ని..

* సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ కంపెనీలో పలు మోసాలు వెలుగు చూశాయి. ఏడాది క్రితం ప్రమోటర్ గౌతమ్ థాపర్ కు చెందిన ఆవంత గ్రూప్ నకు కంపెనీలో 34.38 శాతం వాటా ఉండేది. ప్రమోటర్ తన మొత్తం వాటాను బ్యాంకుల వద్ద తనఖా పెట్టారు. అప్పు తీసుకున్నారు. దాన్ని తిరిగి చెల్లించలేక పోయారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు విభిన్న సందర్భాల్లో తనఖా పెట్టిన షేర్లను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. దీని కారణంగా సీజీ పవర్ లో ఆవంత గ్రూప్ మొత్తం షేర్లను కోల్పోవాల్సి వచ్చింది.

* ఇటీవలి కాలంలో చాలా మంది ప్రమోటర్లు పెద్ద కంపెనీల్లో తనఖా పెట్టిన తమ షేర్లను కోల్పోవాల్సి వచ్చింది. మార్కెట్ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం వల్ల కంపెనీల వ్యాపారం పై దెబ్బ పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోటర్ల వాటాలు తమ చేతినుంచి జారిపోతున్నాయి.

తమకు తాముగా.

తమకు తాముగా.

* కొన్ని సందర్భాల్లో ప్రమోటర్లు తమకు తాముగా కూడా షేర్లను అమ్ముకున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఓపెన్ మార్కెట్ లేదా సంస్థాగత ఇన్వెస్టర్లకు వాటాలు విక్రయించి తమ కంపెనీ అప్పులు తీర్చి వేశారు.

* ఎఫ్ ఎం సి జీ దిగ్గజం ఇమామి ప్రమోటర్లు రుణదాతలకు బకాయిలు చెల్లించడానికి షేర్లను విక్రయించారు.

* ఈ ఏడాది జూన్ తో ముగిసినా త్రైమాసికం వరకు నిఫ్టీ 500 కంపెనీల్లో 178 కంపెనీల ప్రమోటర్ల వాటా గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే తగ్గింది.

* ఇందులో ఎక్కువ మంది వాటా తగ్గడానికి కారణం రుణదాతలు తమవద్ద తనఖా పెట్టుకున్న షేర్లను విక్రయించడమే.

* ఇలాంటి కంపెనీల్లో అనిల్ అంబానీ కంపెనీలైన రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ పవర్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాక్స్ అండ్ కింగ్స్ వంటివి ఉన్నాయి.

* కాక్స్ అండ్ కింగ్స్ కమర్షియల్ పేపర్ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయింది. దీని మూలంగా రుణదాతలు వాలాను విక్రయించాల్సి వచ్చింది. దీంతో కంపెనీలో ప్రమోటర్ గ్రూప్ వాటా 49.34 శాతం నుంచి 39.73 శాతానికి చేసుకుంది.

ఆర్థిక సంస్థలు వెనుకడుగు...

ఆర్థిక సంస్థలు వెనుకడుగు...

* షేర్లను తనఖా పెట్టుకుని బ్యాంకులు ఇతర ఆర్ధిక సంస్థలు రుణాలు ఇస్తుంటాయి. రుణం చెల్లించలేని సందర్భాల్లో ఆ షేర్లను తమ స్వాధీనంలోని తీసుకుంటాయి. అయితే షేర్లను స్వాధీనంలోకి తీసుకునే సందర్భాల్లో షేర్ల ఉంటె బ్యాంకులకు ఇబ్బందే. ఎక్కువ ధర ఉంటే ప్రయోజనం లభిస్తుంది.

English summary

తనఖా తెచ్చిన తంటా.. రుణదాతల చేతిలోకి కంపెనీలు | Banks take co lending route with NBFCs to boost retail, SME loans

It has been almost a year since the RBI laid out the framework for co origination of loans by banks and non deposit taking NBFCs in the priority sector.
Story first published: Friday, August 23, 2019, 17:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X