For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

6 నెలల కనిష్టానికి మార్కెట్లు ! సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్

|

స్టాక్ మార్కెట్లో పతనం నానాటికీ తీవ్రమవుతోంది. ఎవరూ ఊహించని విధంగా రెట్టించిన ఉత్సాహంతో భల్లూకం మార్కెట్లపై పట్టుబిగిస్తోంది. బేర్స్ దెబ్బకు ఇన్వెస్టర్లు బేజారెత్తిపోతున్న పరిస్థితి. ఎఫ్‌పీఐల విషయంలో కేంద్రం కాస్త మెత్తబడినప్పటికీ స్టాక్స్ మాత్రం ఏ దశలోనూ కోలుకున్న దాఖలాలు కనిపించలేదు. స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలిపోతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 600 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 700 క్షీణించింది. మాంద్యం భయాలకు తోడు.. కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన పాజిటివ్ సంకేతాలు రాకపోవడంతో సూచీలు వణికిపోయాయి. మిడ్ సెషన్ తర్వాత సూచీలు మరింతగా క్షీణించాయి. చివరకు సెన్సెక్స్ 588 పాయింట్లు నష్టపోయి 36,473 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 178 పాయింట్లు పడిపోయి 10741దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 685 పాయింట్ల నష్టంతో 27034 వద్ధ స్థిరపడింది.

నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.03 శాతం దిగొచ్చాయి. ఒక్క ఐటీ మినహా ఏ సెక్టోరల్ సూచీ కూడా లాభాల్లో లేదు. ముఖ్యంగా మెటల్స్, మీడియా, ప్రైవేట్ - పీఎస్‌యూ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగ షేర్లు దిగొచ్చాయి.

బ్రిటాయనియా, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, టిసిఎస్, హిందుస్తాన్ యునిలివర్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. యెస్ బ్యాంక్, వేదాంతా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్ టాప్ ఫైవ్ లూజర్స్ జాబితాలో చేరాయి.

Market updates: Sensex tumbles 600 pts, Nifty below 10,750

72కు చేరిన రూపాయి

అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం ఏడాది కనిష్టానికి పడిపోయింది. ఈ రోజు తాజాగా 0.5 శాతం పడిపోయి రూ.71.92 వరకూ వెళ్లింది. డిసెంబర్ 2018 స్థాయికి రేట్ దిగొచ్చింది.

6 ఏళ్ల కనిష్టానికి యెస్ బ్యాంక్

వివిధ కారణాలతో కుప్పకూలిపోతున్న యెస్ బ్యాంక్ షేర్ ఈ రోజు కూడా మరో 15 శాతం నష్టపోయింది. సొంత సమస్యలకు తోడు సిజి పవర్ కూడా తోడవడంతో స్టాక్ తీసికట్టుగా తయారైంది. ఈ రోజు స్టాక్ 14 శాతం నష్టంతో రూ.56.30 దగ్గర క్లోజైంది.
అవకతవకల వార్తలతో సిజి పవర్ స్టాక్ కూడా 10 శాతం నష్టంతో రూ.10.65 దగ్గర క్లోజైంది.

క్రూడ్ కూల్.. స్టాక్ హాట్

ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు కాస్త చల్లబడ్డాయి. వరుసగా ఐదో రోజూ ధరలు దిగిరావడంతో దేశీయ ఓఎంసీల స్టాక్స్ కూడా నీరసించాయి. ఇండియన్ ఆయిల్ కార్ప్ 3 శాతం, బిపిసిఎల్ 5 శాతం, హిందుస్తాన్ పెట్రోలియం 5 శాతం దిగొచ్చాయి.

నాలుగో రోజూ హాట్ కాఫీ
కెఫే కాఫీ డే స్టాక్ వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిసింది. ఐటీసీ ఆసక్తి కనబరుస్తోందనే వార్తల నేపధ్యంలో స్టాక్ జోరుమీద ఉంది. అయితే ఈ డీల్‌పై పెద్దగా చెప్పుకోదగ్గ ప్రోగ్రెస్ ఏమీలేదని ఐటీసీ వ్యాఖ్యానించినప్పటికీ స్టాక్ మాత్రం లాభాల్లో దూసుకుపోయింది. ఈ రోజు రూ.76.40 దగ్గర క్లోజైంది.

డీఎల్ఎఫ్‌కు గట్టి దెబ్బ

షేర్ హోల్డర్లకు తెలియకుండా కొంత సమాచారాన్ని డీఎల్ఎఫ్ దాచిందనే వార్తలు స్టాక్‌ను పడదోశాయి. హర్యానాలో ఉన్న ఓ అతిపెద్ద భూమి వ్యవహారంపై కోర్టు వ్యాజ్యం వివరాలను షేర్ హోల్డర్లకు తెలియజేయలేదు అని బయటకు పొక్కింది. దీంతో స్టాక్ 16 శాతం నష్టంతో రూ.144.30 దగ్గర క్లోజైంది.

ఎల్ఐసీ హౌసింగ్.. ఏడాది కనిష్టానికి

ఇంట్రాడేలో భారీ పతనానికి గురైంది దేశంలోని రెండో అతిపెద్ద గృహరుణ సంస్థ. ఈ రోజు స్టాక్ 11 శాతం నష్టంతో రూ.413 దగ్గర క్లోజైంది.

500 స్టాక్స్ 52 వారాల కనిష్టానికి..

మార్కెట్ పతనంతో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కరిగిపోతున్నాయి. అనేక ప్రముఖ కంపెనీల స్టాక్స్ కూడా దిగొచ్చి మల్టీ ఇయర్ కనిష్ట స్థాయిలకు చేరుతున్నాయి.

English summary

6 నెలల కనిష్టానికి మార్కెట్లు ! సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్ | Market updates: Sensex tumbles 600 pts, Nifty below 10,750

Indian equity benchmarks declined for the third-straight session driven by losses in Yes Bank and private lenders. The Nifty slipped to a six-month low as investors anticipated stimulus to support businesses currently facing a slowdown. The S&P BSE Sensex fell as much as 1.59 percent to 36,472.93 and the NSE Nifty 50 declined as much as 1.62 percent to 10,741.35.
Story first published: Thursday, August 22, 2019, 16:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X