For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పతనమైన LIC హౌసింగ్ షేర్లు, 5 సెషన్లలో 14% డౌన్

|

ముంబై: LIC హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు గురువారం నాడు పది శాతానికి పైగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో జరిగిన ఒక బ్లాక్ డీల్ తర్వాత ఈ షేర్లు భారీగా పతనమయ్యాయి.ఈ డీల్‌లో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు సంబంధించిన 7.7 శాతానికి సమానమైన 3.9 కోట్ల షేర్లు రూ.431 వద్ద చేతులు మారాయి. ఫిడిలిటీ మేనేజ్‌మెంట్ సంస్థ కూడా షేర్లను విక్రయించినట్లుగా వెల్లడించింది. దీంతో షేర్లు 47.15 (10.17%) నష్టపోయి 416.25 వద్ద క్లోజ్ అయ్యాయి. 8 నెలల కనిష్టానికి దిగజారింది.

<strong>హైక్ లేదు... ప్రైవేటు ఉద్యోగులకు.. ఇది అత్యంత చెత్త ఏడాది!</strong>హైక్ లేదు... ప్రైవేటు ఉద్యోగులకు.. ఇది అత్యంత చెత్త ఏడాది!

కాగా, ఈ డీల్ విలువ రూ.1,261 కోట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఎవరు కొనుగోలు చేశారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. బీఎస్ఈ వద్ద ఉన్న సమాచారం మేరకు ఫెడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టుకు జూన్ 30వ తేదీ నాటికి ఇందులో 3.41% వాటా ఉంది. బ్యాంక్ మస్కట్ ఇండియా ఫండ్‌కు 2.278% , గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్‌కు 1.831% వాటాలు ఉన్నాయి.

LIC Housing drops 10% to lowest in 8 months after multiple block deals

సాధారణంగా ఐదు లక్షల వాటాలు కానీ, రూ.5 కోట్లకు మించిన విలువైన షేర్లను కానీ ఒకే లావాదేవీలో చేతులు మారిస్తే దానిని బ్లాక్ డీల్ అంటారు. ఈ డీల్ నేపథ్యంలో తెలిసినప్పటి నుంచే షేర్లు కుంగిపోయాయి. మధ్యాహ్నమే 9 శాతానికి పైగా నష్టపోయాయి. ఐదు సేషన్సుగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు 14.05 శాతం పడిపోయాయి. ఇటీవల ఆగస్ట్ 14వ తేదీన ఈ షేర్లు రూ.489 వద్ద ట్రేడ్ అయ్యాయి. గురువారం నాటికి రూ.416కు పడిపోయాయి.

English summary

భారీగా పతనమైన LIC హౌసింగ్ షేర్లు, 5 సెషన్లలో 14% డౌన్ | LIC Housing drops 10% to lowest in 8 months after multiple block deals

Shares of LIC Housing Finance plunged 14.05% in five trading sessions to its current market price of ₹416.25.
Story first published: Thursday, August 22, 2019, 17:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X