For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4 శాతం పడిపోయిన బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్లు

|

ముంబై: బ్రిటానియా ఉత్పత్తులు దాదాపు 4 శాతం మేర పడిపోయాయి. జూన్ క్వార్టర్ ముగింపు నాటికి బ్రిటానియా ఇండస్ట్రీస్ ఉత్పత్తులు ఇయర్ టు ఇయర్ 5.9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కన్సాలిడేటెడ్ నెట్ సేల్స్ రూ.2,677.3 కోట్లు కాగా, నెట్ ప్రాఫిట్ ఇయర్ టు ఇయర్ 3.7 శాతం పడిపోయింది.

ఒకప్పుడు ప్రపంచంలో టాప్ సేల్స్, ఇప్పుడు 10,000 ఉద్యోగాలు కట్!ఒకప్పుడు ప్రపంచంలో టాప్ సేల్స్, ఇప్పుడు 10,000 ఉద్యోగాలు కట్!

సేల్స్ తగ్గిన నేపథ్యంలో బుధవారం మార్కెట్లో బ్రిటానియా షేర్లు 4 శాతం తగ్గి, 52 వారాల కనిష్టానికి చేరుకుంది. ఇంతకుముందు బ్రిటానియా రూరల్ వ్యాపారం అర్బన్ కంటే ఐదు రెట్లు వేగంగా ఉండేది. కానీ గత క్వార్టర్‌లో మాత్రం అర్బన్ కంటే వేగం బాగా తగ్గింది. ఈ క్వార్టర్‌లో కేవలం 3 శాతం వృద్ధిని మాత్రమే చవి చూసింది. అంతకుముందు క్వార్టర్‌లో అత్యధికంగా 12 శాతం వృద్ధి నమోదు చేసింది.

Slowdown bites: Britannia Industries falls nearly 4%

రూ.5 బిస్కట్ ప్యాకెట్ కొనుగోలు చేసేందుకు కూడా కన్స్యూమర్లు ఆలోచిస్తున్నారని, అంటే ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉందని అర్థమవుతోందని చెబుతున్నారు. ఆగస్ట్ 9వ తేదీ నుండి మంగళవారం నాటికి ఈ కంపెనీ షేర్లు 7.5 శాతం పడిపోయాయి. స్టాక్స్ 34 శాతం పడిపోయి, 52 వారాల కనిష్టానికి చేరుకుంది. ఆగస్ట్ 23, 2018 తర్వాత 3,472.05హైకి చేరుకున్న స్టాక్స్ పడిపోయాయి.

ఆటోమొబైల్ సేల్స్ భారీగా పడిపోయి కంపెనీల్ని తాత్కాలికంగా మూసివేస్తున్నారు. డీలర్స్ దుకాణాలను క్లోజ్ చేస్తున్నారు. దీంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం కూడా ముందుకు సాగడం లేదు. ఆటో రంగం తర్వాత FMCG రంగం భారీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సేల్స్ పెద్ద ఎత్తున పడిపోయాయి. బ్రిటానియా, పార్లే, డాబుర్ వంటి దిగ్గజ కంపెనీల సేల్స్ దిగజారాయి. ఈ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించే పరిస్థితులు ఏర్పడటం తీవ్ర ఆందోళన కలిగించే అంశం.

Read more about: fmcg goods jobs production
English summary

4 శాతం పడిపోయిన బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్లు | Slowdown bites: Britannia Industries falls nearly 4%

Shares of Britannia Industries plunged nearly 4 per cent to hit a 52-week low of Rs 2,302 apiece on the BSE in intra day trade on Wednesday, as worries over demand slump worsened. Parle Products, India’s largest biscuit maker, said on Tuesday that it may be forced to layoff up to 10,000 people if the ongoing consumption slowdown persists.
Story first published: Wednesday, August 21, 2019, 15:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X