For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 వారాల కనిష్టానికి మార్కెట్లు ! దెబ్బపై దెబ్బ

|

నిఫ్టీ రెండు వారాల కనిష్టానికి దిగొచ్చింది. తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న నిఫ్టీ చివరకు 11000 పాయింట్ల సెంటిమెంట్ మార్క్ దిగువన క్లోజైంది. అన్ని రంగాల సూచీలూ నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్ రంగ షేర్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపధ్యంలో ఫ్లాట్‌గా మొదలైన సూచీలు ఆ తర్వాత స్థిరంగా కొనసాగాయి. అయితే మిడ్ సెషన్ తర్వాతి నుంచి అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది. ఒక దశలో నిఫ్టీ 10906 పాయింట్ల కనిష్టానికి దిగొచ్చింది. చివరకు 98 పాయింట్ల నష్టంతో 10919 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 267 పాయింట్లు కోల్పోయి 37060 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 264 పాయింట్ల లాస్‌తో 27719 దగ్గర ముగిసింది. వృద్ధి మందగిస్తోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉద్దీపన సంకేతాలేవీ లేకపోవడం మార్కెట్ వర్గాలను కలవర పెడ్తోంది.

మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు రెండు శాతం వరకూ దిగొచ్చాయి. మెటల్ ఇండెక్స్, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ మూడు శాతం నష్టపోయాయి.

Market Updates:Nifty ends below 10,950, Sensex falls 250 pts

హీరోమోటోకార్ప్, మారుతి, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఐషర్ మోటార్స్ టాప్ ఫైవ్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. టాటా మోటార్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యెస్ బ్యాంక్, గ్రాసిం, టాటా స్టీల్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

నెస్లే రికార్డ్ రన్..

ఈ పతనాల మార్కెట్లో నెస్లే రికార్డులపై రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ రోజు కూడా 6 శాతం వరకూ పెరిగిన స్టాక్ రూ.12646 వరకూ వెళ్లింది. చివరకు రూ.12640 దగ్గర క్లోజైంది.
అయితే ఇదే ఎఫ్ఎంసీజి రంగంలో ఉన్న బ్రిటానియా మాత్రం నీరసిస్తోంది. సుమారు ఏడాదిన్నర కనిష్టానికి స్టాక్ దిగొచ్చింది. సంస్థ లాభాల అంచనాలను అందుకోలేకపోవడం వంటివి ప్రధానంగా ఇబ్బందిపెడ్తున్నాయి. దీంతో స్టాక్ ఈ రోజు అర శాతం నష్టంతో రూ.2384 దగ్గర స్థిరపడింది.

హాత్‌వే హై జంప్

కేబుల్ ఆపరేటింగ్ సంస్థ హాత్ వే.. వరుసగా ఆరో సెషన్‌లోనూ లాభాల బాటలో పయనించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన స్టాక్‌లో వాల్యూమ్స్ కూడా అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు 20 శాతం అప్పర్ సర్క్యూట్ దగ్గర లాక్ అయిన షేర్, ఈ ఆరు సెషన్లలో 65 శాతం పెరిగింది. ఈ రోజు రూ.32.60 దగ్గర క్లోజైంది.

పదేళ్ల కనిష్టానికి టాటా మోటార్స్

తగ్గిపోతున్న ఆటో సేల్స్, ప్లాంట్లకు సెలవులతో పాటు మరిన్ని కారణాలతో టాటా మోటార్స్ స్టాక్ దాదాపుగా పదేళ్ల కనిష్టానికి పడిపోయింది. సంస్థ తీసుకున్న రుణాలకు రేటింగ్‌ను ఏఏ నుంచి ఏఏ మైనస్‌కు కేర్ రేటింగ్ తగ్గించింది. వీటన్నింటి దెబ్బకు స్టాక్ ఈ రోజు మరో పది శాతం పతనమైంది. రూ.112.30 దగ్గర స్టాక్ క్లోజైంది.

యెస్ బ్యాంక్ 5 ఏళ్ల కనిష్టానికి..

ముందే తన సొంత సమస్యలతో ఇబ్బందిపడ్తున్న యెస్ బ్యాంక్‌కు సిజి పవర్ కూడా తోడైంది. వాళ్ల సంస్థలో అవకతవకలు జరిగాయనే వార్తల నేపధ్యంలో ఆ స్టాక్ పడ్తోంది. అదే సమయంలో యెస్ బ్యాంక్‌కు వీళ్ల నుంచి ఎక్స్‌పోజర్ ఉన్న నేపధ్యంలో స్టాక్ పడ్తోంది. చివరకు 8.7 శాతం నష్టంతో రూ.65.05 దగ్గర క్లోజైంది.

కాఫీ డే‌పై ఐటీసీ ఆసక్తి

కాఫీ డే స్టాక్ వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో ముగిసింది. ఈ రోజు కూడా 5 శాతం అప్పర్ సర్క్యూట్‌తో స్టాక్ ముగియడం కొద్దిగా ఊరటనిచ్చింది. కాఫీడేలో వాటా కొనుగోలుపై ఇప్పటికీ పెప్సీ ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే. తాజాగా ఐటీసీ కూడా ముందుకు వచ్చిందనే వార్తల నేపధ్యంలో స్టాక్‌కు బూస్ట్ లభించింది. చివరకు రూ.72.80 దగ్గర క్లోజైంది.

English summary

2 వారాల కనిష్టానికి మార్కెట్లు ! దెబ్బపై దెబ్బ | Market Updates:Nifty ends below 10,950, Sensex falls 250 pts

Indian equity benchmarks extended their decline for the second session in a row led by losses in Tata Motors and Yes Bank. The S&P BSE Sensex fell as much as 0.72 percent to 37,060.37 and the NSE Nifty 50 declined as much as 0.89 percent to close at 10,918.70. The broader markets represented by the NSE Nifty 500 Index fell 1.04 percent.
Story first published: Wednesday, August 21, 2019, 16:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X