For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2011 తర్వాత అతిపెద్ద మాంద్యం భయం, బంగారంవైపు పరుగు

|

వరల్డ్ గోల్డ్ కౌన్సెల్స్ ఔట్ లుక్ ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరం క్వార్టర్ 2లో సెంట్రల్ బ్యాంకులు 224.4 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. 2011 తర్వాత రాబోవు పన్నెండు నెలల్లో మాంద్యం ఎక్కువగా ఉంటుందని ఎక్కువ మంది భావిస్తున్నారు. బంగారం కొనుగోలుకు, మాంద్యం ఉంటుందని అంచనా వేయడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది అమెరికా - చైనా ట్రేడ్ వార్. ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచ మార్కెట్లను గందరగోళంలో పడేసింది.

<strong>నోట్లరద్దు టైమ్ అక్రమార్కులకు షాక్, ట్రేస్ చేసేందుకు చెక్‌లి</strong>నోట్లరద్దు టైమ్ అక్రమార్కులకు షాక్, ట్రేస్ చేసేందుకు చెక్‌లి

18 శాతం పెరిగిన బంగారం ధరలు

18 శాతం పెరిగిన బంగారం ధరలు

బంగారంపై ఎంతోమందికి మక్కువ. అలాగే, మాంద్యం ఆందోళనలు నెలకొన్ని పరిస్థితుల్లో వాణిజ్య పరంగా పసిడి పైన పెట్టుబడులు పెడుతుంటారు. బంగారం ధరలు పైపైకి వెళ్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 18 శాతం వరకు పెరిగాయి. అందుకు మాంద్యం ఆందోళనలు ఉండటం, దీంతో పసిడికి డిమాండ్ పెరగడమే కారణం.

అమెరికా పరిస్థితులు కారణం..

అమెరికా పరిస్థితులు కారణం..

2011 తర్వాత రానున్న 12 నెలల్లో బారీ మాంద్యం ఉండనుందని తాజా సర్వేలో వెల్లడైంది. అమెరికా సహా ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ధర రోజు రోజుకు పెరుగుతోంది. అమెరికాలోని పరిస్థితులు బంగారం ధరల పెరుగుదలకు కారణం అవుతున్నట్లుగా కనిపిస్తోందని థామ్సన్ రూటర్స్ జీఎఫ్ఎంఎస్ సీనియర్ ప్రీసియస్ మెటలిల్స్ అనలిస్ట్ దెబాజిత్ సాహా అన్నారు. 2008-09లో చూసిన మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.

బంగారంపై దృష్టి

బంగారంపై దృష్టి

మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారంపై దృష్టి సారించాయని చెబుతున్నారు. ప్రస్తుతం బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా చూస్తున్నారని అంటున్నారు. ప్రపంచ మార్కెట్ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఈ విలువైన లోహం వైపు మరలుతున్నారు. ఓ వైపు బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ, మాంద్యం ఆందోళన కారణంగా పసిడి వైపే చూస్తున్నారు.

బంగారం ధరల పెరుగుదలకు...

బంగారం ధరల పెరుగుదలకు...

మాంద్యం భయంతోనే పసిడిపై ఇతర సురక్షిత వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్ ధరలు కూడా వీటిపై ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళనలు తీవ్రమయ్యాయని చెబుతున్నారు. దీనికి తోడు యూఎస్ ఇంటరెస్ట్ రేట్స్ కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నారు.

సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు

సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు

సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సెల్స్ తాజా ఔట్ లుక్ రిపోర్ట్ ప్రకారం సెంట్రల్ బ్యాంకులు 224.4 టన్నుల బంగారాన్ని 2019 జూన్ క్వార్టర్‌లో కొనుగోలు చేశాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో 374.1 టన్నులకు చేరుకుంది. 19 ఏళ్లలో ఇలా పెరగడం ఇది తొలిసారి.

బంగారం ధరల్లో పెరుగుదల

బంగారం ధరల్లో పెరుగుదల

బంగారం ధర ప్రస్తుతం ఔన్స్ 1,515.10 డాలర్లుగా ఉంది. 2011 సెప్టెంబర్‌లో ఇది జీవనకాల గరిష్టస్థాయికి చేరుకొని 1,921.15గా ఉంది. రూపాయల్లో గత వారం బంగారం ధర పది గ్రాములకు రూ.37,799గా ఉంది. మాంద్యం కారణంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు మరింతగా పరుగెత్తే అవకాశం ఉందని, దీంతో బంగారం ధర కూడా అదే విధంగా పరుగులు పెట్టవచ్చునని చెబుతున్నారు.

English summary

2011 తర్వాత అతిపెద్ద మాంద్యం భయం, బంగారంవైపు పరుగు | Traders flock to gold as fears of recession in the US loom large

Gold prices have continued their upward march and have now risen 18% so far this year, as fears of recession loom large.
Story first published: Monday, August 19, 2019, 16:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X