For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరపడండి!!: దీపావళి నాటికి రూ.40,000 బంగారం

|

ముంబై: బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి ధర పైపైకి వెళ్తోంది. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం, చమురు ధరలు, ఇతర అంతర్జాతీయ దేశీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయాలా వద్దా అనే డైలమాలో ప్రజలు ఉన్నారు. హఠాత్తుగా పెరిగింది కాబట్టి కాస్త తగ్గుతుందేమో.. వేచి చూద్దాం అనుకుంటే.. అది దిగివచ్చేలా కనిపించడం లేదు. అలాగే తీరా కొనుగోలు చేసిన తర్వాత తగ్గితం ఎలా అనే డైలమాలో ఉన్నారు. బంగారం ధరలు ఈ ఏడాది చివరి నాటికి రూ.40,000కు చేరుకుంటుందని నిపుణులు ఇటీవల భావించారు. కానీ దీపావళి నాటికే ఈ మార్క్‌కు చేరుకోవచ్చునని తాజా అంచనాలు.

<strong>బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయాలా: ఎలా చేయాలి, ఎంత ఛార్జ్?</strong>బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయాలా: ఎలా చేయాలి, ఎంత ఛార్జ్?

దీపావళి నాటికి రూ.40,000

దీపావళి నాటికి రూ.40,000

సాధారణంగా బంగారానికి ఉన్న డిమాండ్ భవిష్యత్తు అంచనాలను ప్రతిబింబిస్తుంది. ఆర్థిక అనిశ్చితులు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు వంటి పలు కారణాల వల్ల పసిడి ధర పైపైకి ఎగురుతుంది. ఎంసీఎక్స్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.37,995 ఉంది. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం తగ్గితే బంగారానికి డిమాండ్ తగ్గుతుందని, కానీ పరిస్థితులు అలా కనిపించడంలేదని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దీపావళి నాటికి బంగారం రూ.39,000, రూ.40,000 వరకు ఉండవచ్చునని ఏంజిల్ బ్రోకింగ్ అనుజ్ గుప్తా అన్నారు. అయితే, పరిస్థితులు కుదుటపడితే పరిస్థితులు వేరుగా ఉండే అవకాశముంది.

బంగారం వంటివి కొనుగోలు చేయాలని సూచన

బంగారం వంటివి కొనుగోలు చేయాలని సూచన

ప్రపంచ వృద్ధి రేటు క్షీణిస్తున్న నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగిందని, ధరలు పెరుగుతున్నాయని అనుజ్ గుప్తా అన్నారు. ఆర్థిక నిపుణులు కూడా బంగారం వంటి కాస్ట్‌లీ మెటల్స్‌పై ఇన్వెస్ట్ చేయమని సూచనలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెడితే ధీమాగా ఉండవచ్చునని సూచిస్తున్నారని, అందుకే బంగారం రోజు రోజుకు పెరుగుతోందన్నారు.

అదే జరిగితే ఆర్థిక మాంద్యం

అదే జరిగితే ఆర్థిక మాంద్యం

విలువైన లోహాలపై ఇన్వెస్ట్ చేస్తే మంచిదని గోహ్రింగ్ అండ్ రోజెన్వాగ్ రిపోర్ట్ అభిప్రాయపడింది. సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేటును తగ్గించడం, రెండు అతిపెద్ద ఆర్థిక దేశాలైన అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగి, ధర పెరిగిందని పేర్కొంది. యూరోప్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ ప్రతికూల వృద్ధిని నివేదించింది. మాంద్యం ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నారు. బ్రెగ్జిట్ కారణంగా బ్రిటన్, చైనా వృద్ధి మందగించడం వంటివి ఆందోళన కలిగిస్తున్న అంశాలు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న అన్ని వస్తువులపై అమెరికా 25 శాతం టారిఫ్ విధిస్తే రానున్న మూడు క్వార్టర్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది.

మరో ఏడాది పాటు పెరుగుదలే...

మరో ఏడాది పాటు పెరుగుదలే...

బంగారం ధర సమీప భవిష్యత్తులో తగ్గే పరిస్థితి లేదని, ఇంకా పెరుగుతుందని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో ఈ సంవత్సరం చివరి నాటికి ఔన్స్ పసిడి 1830 డాలర్ల వరకు పెరగవచ్చునని అంచనా. వచ్చే ఏడాది ఆగస్ట్ నాటికి ఇంకా పెరిగి ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నారు. అంటే మరో ఏడాది పాటు బంగారం పెరగడమే కానీ తగ్గడం ఉండదని అంటున్నారు.

ఆచితూచి కొనుగోలు

ఆచితూచి కొనుగోలు

బంగారం ధర భారీగా పెరుగుతుండటంతో కొనేవాళ్లు తగ్గుతున్నారు. ఆభరణాల కొనుగోళ్లకు వినియోగదారులు తొందరపడటం లేదట. ధర పెరుగుదల నేపథ్యంలో పాత బంగారం అమ్మాలనుకునే వాళ్లు కూడా వెయిట్ చేస్తున్నారు. బంగారం వినియోగంలో ప్రపంచంలోనే మన దేశం ముందుంటుంది. మన దేశంలోను దక్షిణాది మరింత ముందుంటుంది. పెళ్లిళ్లు వంటి అత్యవసరం ఉన్న వారు తప్పితే మిగతా వారు కొనుగోలు చేయడంపై ఆచితూచి అడుగులేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారంపై వెచ్చించే మొత్తం..

తెలుగు రాష్ట్రాల్లో బంగారంపై వెచ్చించే మొత్తం..

ఏటా మన దేశం దిగుమతి చేసుకునే బంగారం 800 టన్నుల వరకు ఉంటుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా 20 శాతం వరకు ఉంటుంది. ఏపీలో ప్రజలు తమ ఆదాయంలో బంగారం కోసం వెచ్చించే మొద్దం దాదాపు 22 శాతం వరకు ఉండగా, తెలంగాణలో 17 శాతం, తమిళనాడులో 28 శాతానికి పైగా ఉంటుంది.

English summary

త్వరపడండి!!: దీపావళి నాటికి రూ.40,000 బంగారం | Gold may surge to Rs.40,000 per 10 gram by Diwali

Amid global growth concerns and heightened trade tensions, gold prices might cross the Rs. 40,000 mark by Diwali, analysts have said.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X