For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనాకు 'ట్రంప్' షాక్: 17 ఏళ్ల కనిష్టానికి చైనా పారిశ్రామిక ఉత్పత్తి

|

బీజింగ్: అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం బీజింగ్ పారిశ్రామిక ఉత్పత్తిపై భారీగా పడినట్లుగా ఉంది. చైనా పారిశ్రామిక ఉత్పత్తి 17 ఏళ్ల గరిష్టానికి పడిపోయింది. పెట్టుబడులు, రిటైల్ అమ్మకాలు మందగించాయి. ఈ మేరకు బుధవారం అధికారిక డేటా మందగమనాన్ని తెలియజేస్తోంది. అమెరికాతో ట్రేడ్ వార్‌కు తోడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గిన నేపథ్యంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. జూలై నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 4.8 శాతం మాత్రమే పెరిగింది. అదే సమయంలో జూన్‌లో 6.3 శాతం మేర తగ్గింది. 2002 నుంచి ఇది అత్యంత బలహీన వృద్ధి ఇదే కావడం గమనార్హం.

ఆర్థిక నిపుణుల అంచనా కంటే తక్కువ

ఆర్థిక నిపుణుల అంచనా కంటే తక్కువ

ఆర్థిక నిపుణులు 6 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేయగా, దాని కంటే ఇది చాలా చాలా తక్కువ అని బ్లూమ్‌బర్గ్ న్యూస్ వెల్లడించింది. బహిరంగ మార్కెట్లో సంక్లిష్టమైన పరిస్థితులు, అలాగే దేశంలో ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఈ పరిస్థితి అంటున్నారు. ఆర్థిక వ్యవస్థ స్థిరమైన, ఆరోగ్యకరమైన వృద్ధి పునాదికి ఏకీకృతం కావాలని నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో స్పోక్స్ పర్సన్ లియు అయిహూ తెలిపారు.

రిటైల్ అమ్మకాలు ఇలా...

రిటైల్ అమ్మకాలు ఇలా...

చైనాలోని పెద్ద ఎత్తున గల వినియోగదారులు మితంగా ఖర్చు చేస్తున్నారని కూడా డేటా తెలియజేస్తోంది. దీర్ఘకాలికంగా ఎంతో ప్రకాశవంతంగా ఉన్న రిటైల్ అమ్మకాలు గత నెలలో (జూలై) 7.6 శాతం మాత్రమే పెరిగాయి. అదే సమయంలో జూన్ నెలలో 9.8 శాతం మేర తగ్గాయి.

అమెరికాతో ట్రేడ్ వార్...

అమెరికాతో ట్రేడ్ వార్...

చైనా ఆర్థికస్థితిని ముందుకు తీసుకెళ్లడంపై చైనా నేతలు దృష్టి సారించారు. ఫిక్స్‌డ్ అసెట్స్ ఇన్వెస్ట్‌మెంట్ జనవరి - జూలై మధ్య 5.7 శాతం పెరిగితే, జనవరి - జూన్ నెలలో 5.8 శాతం మందగించింది. గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ వృద్ధి సెకండ్ క్వార్టర్‌లో 6.2 శాతానికి మందగించింది. గత మూడు దశాబ్దాల్లో బలహీనమైన వృద్ధి ఇదే కావడం గమనార్హం. చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ అమెరికాకు వ్యతిరేకంగా చేస్తున్న ట్రేడ్ వార్ నేపథ్యంలో ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లపై చైనా విషయంలో కఠినంగా ఉన్న విషయం తెలిసిందే.

English summary

చైనాకు 'ట్రంప్' షాక్: 17 ఏళ్ల కనిష్టానికి చైనా పారిశ్రామిక ఉత్పత్తి | China's industrial output hits 17 year low

China's economy showed further signs of strain in July with output at its factories falling to its lowest level in 17 years, while investment and retail sales slowed, official data showed Wednesday.
Story first published: Wednesday, August 14, 2019, 19:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X