ప్రైవేట్ రంగంలో అత్యంత విలువైన బ్యాంకు ఐన HDFC బ్యాంకు ... తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెబుతోంది. కొత్తగా కోటికి పైగా మందికి క్రెడిట్ కార్డులను జారీ చేయనుంది. ఇప్పటికే కోటికిపైగా తన కస్టమర్లు క్రెడిట్ కార్డులు వాడుతుండగా.. మరో కోటి మందికి ఈ అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఇందుకోసం నగరాలూ, పట్టణాలు అన్నింట్లోనూ వినియోగదారులను పెంచుకొనే ప్రయత్నాల్లో ఉంది. ఈ విషయాన్నీ బ్యాంకు కంట్రీ హెడ్ - కార్డు ప్రెమెంట్స్, మర్చంట్ అక్విజిషన్స్ పరాగ్ రావు తెలిపారు. పరాగ్ రావు ను ఉటంకిస్తూ ది ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో ఈ విషయాన్నీ పేర్కొంది.

ప్రస్తుతం 1.25 కోట్ల కార్డులు...
HDFC బ్యాంకు వినియోగదారుల్లో ప్రస్తుతం 1.25 కోట్ల మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. ఈ సంఖ్యను సరిగ్గా రెట్టింపు చేయాలనీ బ్యాంకు టార్గెట్ పెట్టుకొంది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మా సేవింగ్స్ అండ్ శాలరీ అకౌంట్స్ ఖాతాలు రెట్టింపు అయ్యాయి. ప్రతి నెలా మా కరెంటు అండ్ సేవింగ్స్ అకౌంట్స్ (CASA) ఐదు లక్షలు దాటుతోంది. కాబట్టి, కార్డుల రెట్టింపు అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని పరాగ్ రావు వ్యాఖ్యానించారు.

రెట్టింపు కానున్న మర్చంట్ లు ...
ప్రస్తుతం బ్యాంకు క్రెడిట్ కార్డుల సంఖ్య పెంపు పైనే కాకుండా ... రిటైల్ మర్చంట్ నెంబర్ పెంచుకొనే పనిలో పడింది. ఇప్పటి వరకు బ్యాంకు వద్ద 9,00,000 మంది రిటైల్ మర్చంట్ లు ఉన్నారు. ఈ సంఖ్యను కూడా డబల్ చేయాలనీ బ్యాంకు టార్గెట్గా పెట్టుకోంది. ఈ ప్రక్రియలో భాగంగా నెలకు సుమారు 1,00,000 మంది కొత్త మర్చంట్ లను తన వేదికపైకి తెస్తోంది. 15 లక్షల మేరకు పేమెంట్ ఆక్సెప్టెన్స్ పాయింట్లను కలిగి ఉన్న బ్యాంకు .. ఈ విషయంలో అగ్రస్థానంపై కన్నేసింది. ఇప్పటికే దీనికి మర్చంట్ ల మార్కెట్లో 43% వాటా ఉండటం విశేషం.

రూ 50,000 కోట్ల రుణాలు...
HDFC బ్యాంకు తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీగా రుణాలు ఇచ్చింది. ఈ విషయం లో భారతీయ బ్యాంకులన్నింటిలోనూ అదే ముందు ఉంటుంది. ఈ రుణాలు ఏకంగా రూ 50,000 కోట్లు దాటాయి. దేశంలోని అన్ని బ్యాంకులు సంయుక్తంగా ఇచ్చిన రుణాలు రూ 94,900 కోట్లు కాగా... ఈ ఒక్క బ్యాంకే రూ 50,000 కోట్ల రుణాలు ఇవ్వటం గమనార్హం. ఈ విషయంలో బ్యాంకు వాటా 52% కావటం విశేషం. అయితే, ఈ రుణాలను పరాగ్ రావు సమర్థించుకున్నారు. ముంబై లోని స్లం ఏరియా ఐన ధారవి లోని ప్రతి ఒక్కరూ రుణ ఎగవేతదారు కాదని అయన స్పష్టం చేసారు.

పల్లెలకూ విస్తరణ...
క్రెడిట్ కార్డుల వినియోగం లో నగరాలు ముందు ఉండటం సహజమే. కానీ... తమ కొత్త వ్యూహం లో భాగంగా HDFC బ్యాంకు సెమి అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రెడిట్ కార్డులను జారీ చేయాలనీ లక్ష్యంగా పెట్టుకోంది. ఆయా ప్రాంతాల్లోని వినియోగదారుల వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ ... భవిష్యత్ పెట్టుబడిగా దీనిని భావిస్తున్నట్లు పరాగ్ రావు వెల్లడించారు. సో, పల్లె ఐనా, పట్టణమైనా ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు లేని వారు, ఈ సారి తప్పకుండ ఒకటి పొందే అవకాశం ఉందన్న మాట.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications