న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం రెపో రేటును 35 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఈ క్యాలెండర్ ఇయర్లో గత మూడు పర్యాయాలు 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, ఈసారి అంతకంటే ఎక్కువ తగ్గించింది. దీంతో రెపో రేటు ఈ సంవత్సరం 6.50 శాతం నుంచి 5.40 శాతానికి తగ్గింది. దీనికి అనుగుణంగా పలు బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తూ, తమ కస్టమర్లకు రేపో రేటు ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా రుణ రేట్లను తగ్గించింది.

15 బేసిస్ పాయింట్స్ తగ్గించిన ఎస్బీఐ
ఎస్బీఐ అన్ని కాలవ్యవధులపైన రుణ రేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇది 10 ఆగస్ట్ 2019వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఎస్బీఐ తెలిపింది. ఏప్రిల్ 10, 2019 నుంచి ఇప్పటి వరకు ఎస్బీఐ హోమ్ లోన్ లింక్డ్ ఎంసీఎల్ఆర్ రేట్లను 35 బేసిస్ పాయింట్స్ తగ్గించింది.

ఎంసీఎల్ఆర్ 8.25 శాతానికి తగ్గింపు
ఎస్బీఐ నిర్ణయంతో వన్ ఇయర్ ఎంసీఎల్ఆర్ 8.25 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్‌ను తగ్గించడం ఇది వరుసగా నాలుగోసారి. రెపో రేటు ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలని రిజర్వ్ బ్యాంకుతో పాటు ఆర్థిక శాఖ కూడా బ్యాంకులను ఎప్పటికప్పుడు ఆదేశిస్తోంది.

కస్టమర్లకు ప్రయోజనాలు
ఆర్బీఐ ప్రకటించే రెపో రేటు ప్రయోజనాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అందించిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 85 బేసిక్ పాయింట్స్ తగ్గించిందని ఓ ప్రకటనలో ఎస్బీఐ పేర్కొంది. ఈ ఏడాదిలో వరుసగా నాలుగోసారి ఎంసీఎల్ఆర్ తగ్గించినట్లు తెలిపింది.

రెపో రేటు లింక్డ్ హోమ్ లోన్
ఎస్బీఐ రెపో రేటు లింక్డ్ హోమ్ లోన్ ప్రాడక్ట్స్‌ను ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి ప్రారంభించింది. దీంతో రెపో రేటు తగ్గినవెంటనే హోమ్ లోన్ రేట్లు సమీక్షిస్తారు. ఎస్బీఐ ఇటీవలే ఆగస్ట్ 1వ తేదీన FDలపై వడ్డీ రేట్లను సవరించింది. 20 నుంచి 75 బేసిస్ పాయింట్స్ తగ్గించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications