టాటా మోటార్స్ ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో రూ.3,968 కోట్ల నికర నష్టాన్ని చవి చూసింది. గురువారం నాడు టాటా మోటార్స్ క్వార్టర్ 1 ఫలితాలు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే క్వార్టర్‌లో (Q1) రూ.1,902.37 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. దీంతో పోలిస్తే ఇప్పుడు రెండు రెట్ల నష్టాన్ని నమోదు చేసింది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌పై దెబ్బ
జూన్ 30వ తేదీతో ముగిసిన క్వార్టర్‌కు టాటా మోటార్స్ రెవెన్యూ రూ.60,830.16. ఇయర్ టు ఇయర్ బేసిస్‌లో 29 శాతం తగ్గుదల నమోదు చేసింది. తన లగ్జరీ కార్‌మేకర్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) పై ఈ మూడు నెలలకు గాను 402 మిలియన్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. JLR మార్కెట్, బలహీనమైన మార్కెట్ నేపథ్యంలో భారీ నష్టాన్ని నమోదు చేసింది.

ఈ ప్రభావం ఆటో రంగంపై..
వినియోగదారుల డిమాండ్ తగ్గడం, ద్రవ్య ఒత్తిడి వంటి పలు కారణాలు ఆటో పరిశ్రమలో మందగమనానికి కారణమని, ఇది మొత్తం డిమాండ్‌ను ప్రభావితం చేసిందని టాటా మోటార్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. గత కొన్నేళ్లుగా తాము మార్కెట్ డైనమిక్స్, ఫైనాన్షియల్ హెల్త్ మధ్య మంచి సమతుల్యతను సాధించామని చెప్పారు. ఇప్పుడు బడ్జెట్ ప్రకటనతో పాటు రాబోయే పండుగ సీజన్‌తో నేపథ్యంలో మిగిలిన ఆర్థిక సంవత్సరంలో మంచి మార్కెట్ ఉంటుందని భావిస్తున్నామన్నారు.

లాభాలు పెంచుకుంటాం
జూన్ త్రైమాసికంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రపంచ రిటైల్ అమ్మకాలలో 11.6 శాతం క్షీణించి వాహనాల అమ్మకం 1,28,615కు పడిపోయిందని టాటా మోటార్స్ తెలిపింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రస్తుతం మేజర్ పరివర్తన పీరియడ్‌లో ఉందన్నారు. తమ వ్యాపారాన్ని సరళీకృతం చేస్తున్నామని, కఠినమైన మార్కెట్ వాతావరణానికి అనుగుణంగా రూపాంతరం చెందుతున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో లాభాల్లోకి తిరిగి రావడానికి తాము తమ బలమైన పునాదులను, పెరిగిన నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకుంటామని జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాల్ఫ్ స్పెథ్ అన్నారు.

మరింత బలపడతాం
రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం బ్రిటన్ అతిపెద్ద వాహన తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క నికర ఆదాయం 2.8 శాతం క్షీణించి 5.1 బిలియన్ పౌండ్లగా ఉంది. మార్కెట్‌కు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, మార్కెట్ ఛాలెంజెస్ విశ్వాసాన్ని నింపుతున్నాయని, తాము మరింత బలపడతామని టాటా మోటార్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ మూలధన వ్యయం తగ్గింపు
జాగ్వార్ ల్యాండ్ రోవర్ మూలధన వ్యయాన్ని (కాపెక్స్) తగ్గిస్తామని, దేశీయ మార్కెట్లో రిటైల్ మెరుగుదలపై దృష్టి సారించి, భారతదేశంలో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలపై పట్టు సాధిస్తామని టాటా మోటార్స్ తెలిపింది. JLRకు చైనాలో డిమాండ్ పెరుగుతోందని, అక్కడి మార్కెట్ పైన దృష్టి సారిస్తామని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications