For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

260 ఏళ్ల ఆట వస్తువుల సంస్థను కొనుగోలు చేసిన రిలయన్స్ బ్రాండ్

|

ముంబై: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్ బ్రిటిష్ టాయ్ రిటైలర్ హామ్‌లేస్‌ను కొనుగోలు చేసింది. రూ.620 కోట్లకు (GBP 67.96 మిలియన్లు) క్యాష్ డీల్‌కు సొంతం చేసుకుంది. హామ్‌లేస్ (హామ్‌లేస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్ -HGHL) ప్రముఖ చిన్న పిల్లల ఆటవస్తువులు తయారు చేసే సంస్థ.

SBI E-Rail: రైల్వే టిక్కెట్‌ను ఇలా ఈజీగా బుక్ చేసుకోండిSBI E-Rail: రైల్వే టిక్కెట్‌ను ఇలా ఈజీగా బుక్ చేసుకోండి

హామ్‌లేస్‌ను కొనుగోలు చేశాం

హామ్‌లేస్‌ను కొనుగోలు చేశాం

ఈ ఏడాది మే నెలలో రిలయన్స్ బ్రాండ్స్... హామ్‌లేస్‌ను 100 శాతం కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. హాంగ్‌కాంగ్ షేర్ మార్కెట్లో లిస్ట్ అయిన సీ-బ్యానర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ నుంచి రిలయన్స్ ఈ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. హామ్‌లేస్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం BSEకి ఇచ్చిన ఫైలింగ్‌లో తెలిపింది.

ఇదీ HGHL ప్రత్యేకత

ఇదీ HGHL ప్రత్యేకత

పిల్లల ఆట వస్తువులు తయారు చేయడంలో ఈ కంపెనీ దాదాపు 260 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. HGHL సంస్థ పద్దెనిమిది దేశాలలో మొత్తం 167 స్టోర్స్‌ను కలిగి ఉండటం గమార్హం. లండన్‌లో ఈ సంస్థకు ఏడు అంతస్తుల భవనం ఉంది. ఇందులో దాదాపు 50వేల రకాల ఆట బొమ్మలు విక్రయానికి ఉంటాయి. ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది ఈ స్టోర్‌ను సందర్శిస్తారు.

1760లో ప్రారంభమైన హామ్‌లేస్‌

1760లో ప్రారంభమైన హామ్‌లేస్‌

హామ్‌లేస్‌ను 1760లో లండన్‌లో ప్రారంభించారు. ప్రపంచంలోని పురాతన బొమ్మల రిటైలర్స్‌లో ఇది ఒకటి. ఇది పలుమార్లు చేతులు మారింది. 2015లో చైనాకు చెందిన సీ-బ్యానర్ ఇంటర్నేషనల్ దీనిని కొనుగోలు చేసింది. నాడు దీని డీల్ విలువ GBP 100 మిలియన్లు. హామ్‌లేస్‌ను విక్రయించేందుకు సీ-బ్యానర్ ఇంటర్నేషనల్ వ్యూహాత్మక సమీక్షను ప్రారంభించిందని గత అక్టోబర్‌లో వార్తలు వచ్చాయి.

మాస్టర్ బ్రాండ్స్ నుంచి 100 శాతం వాటా

మాస్టర్ బ్రాండ్స్ నుంచి 100 శాతం వాటా

కాగా, ఇండియాలో ఇప్పటి వరకు రిలయన్స్ బ్రాండ్స్... HGHL సంస్థకు మాస్టర్ ఫ్రాంఛైజీగా ఉంది. ఇప్పుడు 100 శాతం వాటా దక్కించుకుంది. గత కొన్నేళ్లుగా పిల్లల ఆటవస్తువుల అమ్మకాలలో రిలయన్స్‌ బ్రాండ్స్ లాభాల బాటలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ బ్రాండ్స్‌ దేశం మొత్తంమీద 420 స్టోర్స్ కలిగి ఉంది.

English summary

260 ఏళ్ల ఆట వస్తువుల సంస్థను కొనుగోలు చేసిన రిలయన్స్ బ్రాండ్ | Reliance brands acquires 100% stake in British Toy retailer Hamleys

Reliance Brands, a subsidiary of Reliance Industries, has completed acquisition of British toy retailer Hamleys for about ₹620 crore (GBP 67.96 million) in an all-cash deal.
Story first published: Thursday, July 18, 2019, 20:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X