For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్ళీ ఇండియాకి ఈబే... ఇప్పుడు పేటీఎం మాల్‌తో ఎంట్రీ, రూ.1,000 కోట్లకు 5.5% వాటా కొనుగోలు

|

ఇటీవలే భారత్ కు గుడ్ బాయ్ చెప్పిన ప్రముఖ ఈ కామర్స్ దిగ్గం ఈబే ... మళ్ళీ ఇండియా బాట పట్టింది. అమెరికా లోని సాన్ జోస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈబే ... ప్రస్తుతం ఇందిరెచ్త్ రూట్ లో భారత్లోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం పేటీఎం మాల్ తో జట్టు కడుతోంది. తాజాగా పేటీఎం మాల్ లో ఈ సంస్థ 5.5% వాటాను కొనుగోలు చేసినట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం లో పేర్కొంది. దీంతో మళ్ళీ కంపెనీ ఇండియా మార్కెట్ లో తన కార్యకలాపాలను కొనసాగించనుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా తనకున్న మర్చంట్ వస్తువులను సైతం పేటీఎం మాల్ లో కొనుగోలు చేసేందుకు ప్రస్తుత లావాదేవీ దోహదపడనుంది.

ఇవి ఆరోగ్య బీమా ప్లాన్లు.. ఎంచుకోండి ఏది మీకు సూటవుతుందో..

రూ 1,000 కోట్ల డీల్?....

రూ 1,000 కోట్ల డీల్?....

అయితే పేటీఎం మాల్ గత కొంత కాలంగా కార్యకలాపాలను తగ్గించింది. జనవరి లో జాతీయ స్థాయిలో ఈ కామర్స్ వ్యాపారాన్ని నిలిపివేసింది కూడా. భారీ డిస్కౌంట్స్ ఇచ్చి విపరీతమైన నష్టాలను చవిచూసిన ఈ సంస్థ... డిస్కౌంట్లకు దూరంగా మరో ప్రత్యామ్నాయం వెతికే పనిలో పడింది. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఇదే విషయాన్నీ గతంలో వెల్లడించారు కూడా. పేటీఎం లో అతి పెద్ద ఇన్వెస్టర్ ఐన జాక్ మా నేతృత్వం లోని అలీబాబా ఈ మేరకు నష్టాలను తగ్గించు కోవాలని వార్నింగ్ కూడా ఇచ్చింది. దాంతో ఒక అడుగు వెనక్కు వేసిన విజయ్ శేఖర్ శర్మ ... మళ్ళీ దీన్ని వేరే మార్గంలో నడిపించాలని వ్యూహాలు రచించారు. అందులో భాగంగానే ఆన్లైన్ తో ఓఫ్ఫ్లిన్ (ఓ 2 ఓ ) విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ కొత్త విధానం నచ్చడం తో ఈబె ... ప్రెటం మాల్ లో పెట్టుబడికి సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో కంపెనీలో 5.5% వాటా ను కొనుగోలు చేసింది. అయితే, డీల్ విలువను ఇరు వర్గాలు వెల్లడించలేదు. కానీ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ది ఎకనామిక్ టైమ్స్ ... ఈ డీల్ విలువ 150 మిలియన్ డాలర్లు (సుమారు రూ 1,000 కోట్లు ) అని పేర్కొంది.

ఓ 2 ఓ పై విశ్వాసం...

ఓ 2 ఓ పై విశ్వాసం...

కాగా ఈ లావాదేవిపై స్పందించిన పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ ఇది షాప్ కీపర్ కామర్స్ విధానానికి ఇన్వెస్టర్ల గుర్తింపు ఉందని నిరూపించండని పేర్కొన్నారు. అలాగే తమ కంపెనీ టర్న్ఎరౌండ్ కి కూడా ఈ లావాదేవీ నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ కొత్త తరహా మోడల్ ను పునర్వ్యవస్థీకరణ లో భాగంగా కనుగొంది. పూర్తి వివరాలు త్వరలోనే విల్లడించే అవకాశము ఉంది.

10 లక్షలకు పైగా ఉత్పత్తులు...

10 లక్షలకు పైగా ఉత్పత్తులు...

ప్రపంచ వ్యాప్తంగా ఈబె కు ఉన్న 10 లక్షలకు పైగా ప్రత్యేకమైన ఉత్పత్తులు ఇకపై పేటీఎం మాల్ లో అందుబాటులో ఉంటాయి. పేటీఎం లో ని సుమారు 13 కోట్ల ఆక్టివ్ యూజర్లు ఈ ప్రయోజనాన్ని అందుకొంటారు. వివిధ దేశాలకు చెందిన ఉత్పత్తుల లభిస్తుండటం వల్ల దీనిని క్రాస్ బోర్డర్ బిజినెస్ గ పరిగణిస్తారు. మన దేశంలో అమెజాన్ కూడా తన గ్లోబల్ స్టోర్ లోని వస్తువులను కొనుగోలు చేసే అవకాశాన్ని ఇటీవలే ఇండియా లో ప్రవేశ పెట్టింది. ఇప్పుడు ఈ డీల్ తర్వాత ఈబె, పేటీఎం మాల్ సైతం ఇదే తరహా అవకాశాన్ని కల్పిస్తున్నట్లు అవుతుంది.

ఫ్లిప్కార్ట్, స్నాప్ డీల్ నుంచి ఎగ్జిట్...

ఫ్లిప్కార్ట్, స్నాప్ డీల్ నుంచి ఎగ్జిట్...

గతం లో మన దేశ ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, స్నాప్ డీల్ లో పెట్టుబడులు పెట్టిన ఈ బె ... వాటి నుంచి ఎగ్జిట్ అయినట్లు ది ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. అయితే, భారత్ దేశ మార్కెట్ ప్రపంచంలోని అతి పెద్ద మార్కెట్ల లో ఒకటి కావటం తో దీనిని వదులుకోలేని పరిస్థితిలో ఈబె ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే, ఈ బె మళ్ళీ ఇండియా లోకి రంగ ప్రవేశం చేస్తోందని చెబుతున్నారు. అయితే, ఇప్పటికే స్నాప్ డీల్, షాప్ క్లూస్ వంటి సంస్థలు దెబ్బతినగా... కేవలం ఫ్లిప్కార్ట్, అమెజాన్ మాత్రమే రంగంలో నిలిచాయి. ఈ రెండు కంపెనీలు కూడా నువ్వా నేనా అంట్లు డిస్కౌంట్స్ ఇచ్చి మార్కెట్ ఓ కొనసాగుతున్నాయి. రెండు కంపెనీలు భారీ నష్టాలను మూట కట్టుకొంటున్నాయి. ఐన కూడా భారత మార్కెట్ వృద్ధి దృష్ట్యా ఇవి కంటిన్యూ అవుతున్నాయి. ఇంత పోటీ మధ్య ఆల్రెడీ మూట పడ్డ పేటీఎం మాల్ .... ఈబె రంగ ప్రవేశం తో మళ్ళీ పరుగులు పెడుతుందా చూడాలి. ఇదిలా ఉంటె... ఈ బె సైతం తన సొంత వెబ్సైటు ను భారత్లో కొనసాగించనుందట.

English summary

eBay logs into Paytm Mall with 5.5% stake, eyes pie of online retail

eBay has agreed to buy a 5.5% stake in e-commerce marketplace Paytm Mall in a renewed attempt by the San Jose, California-based company to grab a foothold in India’s fast-growing and intensely competitive online retail market.
Story first published: Thursday, July 18, 2019, 13:12 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more