For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓయో చేతికి ప్రముఖ కో-వర్కింగ్స్స్ కంపెనీ ఇన్నోవ్8, డీల్ విలువ రూ.200 కోట్లు

|

ఆన్‌లైన్ హోటల్ రూమ్స్ అగ్రిగేటర్ ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ ... తాజాగా మరో కొత్త రంగంలోకి విస్తరించింది. స్టార్టుప్ కంపెనీలు, ఇతర సంస్థలకు ఆఫీసులను అద్దెకు ఇచ్చే ప్రముఖ కంపెనీ ఇన్నోవ్8 ను కొనుగోలు చేసింది. ఇందుకోసం ఓయో హోటల్స్... రూ 200 కోట్లను వెచ్చించింది. ఈ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ఓయో హోటల్స్... ఇప్పుడు తనకున్న కస్టమర్లు, అసెట్స్, వ్యాపార భాగస్వాములకు మరింత విభిన్నమైన సేవలను అందించేందుకు ఇది దోహద పడుతుందని ఓయో భావిస్తోంది. దేశంలో షేరింగ్ ఆఫీస్ లకు గిరాకీ పెరుగుతోంది. ముఖ్యంగా అద్దెలు అధికంగా ఉండే మహా నగరాల్లో వీటికి అధిక డిమాండ్ ఉంటోంది. ఈ రంగంలో ఇన్నోవ్8 తో పాటు వీవర్క్, ఆఫీస్ స్పేస్ సోలుషన్స్, 91స్ప్రింగ్బోర్డు, రీగస్, ఇకివా, రెంటాడెస్క్ వంటి ప్రముఖ కంపెనీలు సేవలు అందిస్తున్నాయి.

HDFC హెచ్చరిక: మీ డబ్బు దొంగిలిస్తారు.. ఇలా చేయకండి!

కమర్షియల్ రియల్ ఎస్టేట్ లోకి...

కమర్షియల్ రియల్ ఎస్టేట్ లోకి...

ఇప్పటి వరకు ఓయో రూమ్స్ పేరుతో కేవలం హోటల్ గదులను ఆన్లైన్ అగ్రిగేషన్ ద్వారా అద్దెకు ఇచ్చే వ్యాపారంలో ఉన్న ఓయో హోటల్స్ ... ఇటీవలే ఇళ్లను కూడా అద్దెకు ఇచ్చే రంగంలోకి ప్రవేశించింది. అలాగే దేశంలో కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగం లో ఉన్న అపార అవకాశాల దృష్ట్యా ఈ సంష్త కన్ను ఇపుడు కో-వర్కింగ్ స్పేస్ వంటి ఆకర్షణీయ రంగాలపై పడింది. అన్ని రకాల ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో కలిగి ఉండాలనేది మా ఆకాంక్ష. అందుకు వర్క్ స్పేసేస్ మంచి అవకాశం. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ రంగంలోకి ప్రవేశించడం లేదు. ఇందులో మరింత విలువను జోడించాలనేదే మా సంకల్పం అని ఓయో హోటల్స్ సీఈఓ (న్యూ రియల్ ఎస్టేట్ బిజినెస్ ) రోహిత్ కపూర్ పేర్కొన్నారు.

30 బిలియన్ డాలర్లు...

30 బిలియన్ డాలర్లు...

భారత దేశంలో కమర్షియల్ రియల్ ఎస్టేట్, ఆఫీస్ లీసింగ్ వ్యాపార పరిమాణం కళ్ళు చెదిరే స్థాయిలో ఉంది. ఈ రంగం 30 బిలియన్ డాలర్ల (సుమారు రూ 2,10,000 కోట్లు) నుంచి 33 బిలియన్ డాలర్ల (రూ 2,31,000 కోట్లు) మార్ట్ ను కలిగిరి ఉన్నట్లు అంచనా. ఇది కూడా కేవలం సంఘటిత రంగంలోనే. అసంఘటిత రంగం తోడైతే మార్కెట్ విలువ భారీగా పెరిగిపోతుంది. అందుకే ఓయో హోటల్స్... ఈ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

బడా బడా ప్రముఖుల పెట్టుబడులు...

బడా బడా ప్రముఖుల పెట్టుబడులు...

ఇన్నోవ్8 కంపెనీ లో చాల మంది ప్రముఖులు, ఏంజెల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. గూగుల్ ఇండియా మాజీ అధిపతి రాజన్ ఆనందన్, పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ ఫ్రేష్ వర్క్స్ సీఈఓ గిరీష్ మాతృభూతం ఉన్నారు. అమెరికా లోని సిలికాన్ వాలీ కి చెందిన ప్రాముఖ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వై కంబినేటర్ కూడా భాగస్వామిగా ఉంది. అయితే, ప్రస్తుతం ఓయో హోటల్స్ చేతికి ఈ కంపెనీ వెళుతోంది కాబట్టి .. వీరందరూ ఎగ్జిట్ అవుతారని మార్కెట్ సమాచారం.

150 ఉద్యోగులు కూడ ఓయో లోకి...

150 ఉద్యోగులు కూడ ఓయో లోకి...

ప్రస్తుత కొనుగోలుతో ఇన్నోవ్8 కు చెందిన 150 ఉద్యోగులు... ఓయో హోటల్స్ అండ్ హొమెస్ రోల్స్ లోకి మారుతారు. ఈ విషయాన్నీ ఇన్నోవ్8 వ్యవస్థాపకుడు రితేష్ మాలిక్ వెల్లడించారు. అయితే, కొనుగోలు అనంతరం కూడా కొంత కాలం ఇదే బ్రాండ్ నామ తో ఓయో కార్యకలాపాలు సాగించనుంది. 2015 లో ప్రారంభించిన ఇన్నోవ్8 కు ప్రస్తుతం ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, చండీగఢ్ లో కార్యాలయాలు ఉన్నాయ్.

Read more about: oyo fund investment
English summary

Oyo Hotels acquires Innov8, expands co working space business

OYO Hotels and Homes, the world’s third-largest chain of hotels, homes, managed living and workspaces, on Tuesday confirmed its acquisition of Innov8, a co-working spaces provider, highlighting the company’s increasing focus on the fast-growing segment.
Story first published: Wednesday, July 17, 2019, 10:27 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more