For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండో రోజూ లాభాల్లోనే.. ! ఈ రోజు యెస్ బ్యాంక్ హీరో

|

స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలకు తోడు కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు నిఫ్టీని 11650 పాయింట్ల మార్క్ పైకి తీసుకెళ్లింది. ఐటీ, మీడియా మినహా అన్ని రంగాల సూచీలూ లాభాల్లో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ్ కౌంటర్‌లో జోరు నమోదైంది. ఉదయం 11596 పాయింట్ల మార్కు దగ్గర ప్రారంభమైన నిఫ్టీ మిడ్ సెషన్ తర్వాత 11670 పాయింట్ల గరిష్టానికి చేరి దాదాపుగా అక్కడే ముగిసింది. చివరకు 75 పాయింట్ల లాభంతో 11663 దగ్గర స్థిరపడింది. సెన్సెక్స్ 235 పాయింట్లు పెరిగి 39132 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 125 పాయింట్లు ఎగసి 30571 వద్ద క్లోజైంది.

సెక్టోరల్ సూచీల పరంగా చూస్తే ఐటీ, మీడియా మినహా అన్ని రంగాలూ లాభాల్లో కొనసాగాయి. రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా, ఎఫ్ఎంసిజి, ఆటో, మెటల్ కౌంటర్లలో లాభపడ్డాయి.

Sensex, Nifty End Higher For Second Day, Yes Bank Rallies 11%

యెస్ బ్యాంక్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి.
టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్ సి ఎల్ టెక్, కోటక్ బ్యాంక్, యూపీఎల్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

యెస్ బ్యాంక్ మళ్లీ రూ.100పైకి..

చాలాకాలం తర్వాత యెస్ బ్యాంక్‌లో మళ్లీ కొనుగోళ్లు ఊపు కనిపించింది. కష్టాల నుంచి బయటపడేందుకు, వృద్ధి దిశగా బ్యాంకును నడిపించేందుకు సుమారు 1.2 బిలియన్ డాలర్లను సమీకరించబోతోంది. వీటికి తోడు కొంత మంది పీఈ ఇన్వెస్టర్లు స్టాక్స్‌ను కొనుగోలు చేయబోతున్నారనే వార్తలు స్టాక్‌ను పరుగులు తీయించాయి. చివరకు స్టాక్ 11.5 శాతం లాభంతో రూ.106.25 దగ్గర క్లోజైంది. రేపు (బుధవారం) ఈ సంస్థ తన త్రైమాసిక ఫలితాలను వెల్లడించబోతోంది.

హెచ్ డి ఎఫ్ సి ఏఎంసికి రిజల్ట్స్ బూస్ట్

ఈ రోజు త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన సంస్థ మెరుగైన నికరలాభాన్ని ఆర్జించింది. ఆదాయం రూ.471 కోట్ల నుంచి రూ.504.4 కోట్లకు, నికర లాభం రూ.205 కోట్ల నుంచి రూ.292కి పెరిగింది. దీంతో స్టాక్ కూడా మూడు శాతానికి పైగా పెరిగింది. చివరకు రూ.1994 దగ్గర క్లోజైంది.

టాటాకు జెఎల్ఆర్ కలిసొచ్చింది

ఇంతకాలానికి జెఎల్ఆర్‌ వల్ల టాటా మోటార్స్‌కు కలిసొచ్చింది. ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ధికి యూకె ఎక్స్‌పోర్ట్ నుంచి 500 మిలియన్ పౌండ్ల మద్దతు లభించింది. దీంతో ఈ స్టాక్ లాభాల బాటలో పయనించింది. వరుసగా నాలుగో రోజు కూడా ఎగిసింది. చివరకు 5.53 శాతం లాభపడి రూ.170 దగ్గర క్లోజైంది.

ఫెడరల్ బ్యాంక్ స్థిరత్వం

త్రైమాసిక ఫలితాల తర్వాత ఫెడరల్ బ్యాంక్ ఫ్లాట్‌గా ముగిసింది. నికర వడ్డీ ఆదాయంలో 18 శాతం, నికర లాభంలో 46 శాతం వృద్ధిని బ్యాంక్ నమోదు చేసింది. ప్రొవిజన్స్ రూ. 178 కోట్ల నుంచి రూ.192 కోట్లకు పెరిగింది. మొండిబకాయిలు కూడా అక్కడక్కడే ఉన్నాయి. చివరకు స్టాక్ 0.19 శాతం లాభంతో రూ.107.35 దగ్గర క్లోజైంది.

బ్రిగేడ్‌ బోనస్ షేర్లు

ఈ సంస్థ ప్రతీ రెండు షేర్లకూ ఒక్క బోనస్ షేర్లను కేటాయించేందుకు బోర్డ్ ఆమోదం తెలిపింది. ప్రమోటర్ గ్రూపునకు రూ.269 చొప్పున రూ.115 కోట్లకు కన్వర్టిబుల్ వారెంట్స్‌ను జారీ చేశారు. ఈ రెండు వార్తల నేపధ్యంలో స్టాక్ 4 శాతానికి పైగా లాభపడింది. చివరకు రూ.275 దగ్గర క్లోజైంది.

రెండో రోజూ ఆర్.బి.ఎల్. బ్యాంక్‌కు దెబ్బ

వరుసగా రెండో రోజూ ఆర్.బి.ఎల్. బ్యాంక్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. నిన్న సుమారు 5 శాతం పతనమైన స్టాక్ ఈ రోజు కూడా అదే స్థాయిలో నష్టపోయింది. ఇంట్రాడేలో రూ.573 కనిష్టానికి దిగొచ్చిన స్టాక్ చివరకు రూ.579 దగ్గర క్లోజైంది. పతనానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరానప్పటికీ.. స్టాక్ మాత్రం నీరసిస్తోంది.

English summary

రెండో రోజూ లాభాల్లోనే.. ! ఈ రోజు యెస్ బ్యాంక్ హీరో | Sensex, Nifty End Higher For Second Day, Yes Bank Rallies 11%

Indian equity benchmarks extended gains for the second consecutive trading session.
Story first published: Tuesday, July 16, 2019, 17:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X