For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండిగో ప్రమోటర్ చేతికి బర్గర్ కింగ్?

By Jai
|

ఓ వైపు సహా ప్రమోటర్ తో విభేదాలు నడుస్తున్న... ఇండిగో ఎయిర్లైన్స్ వ్యవస్థాపక ప్రమోటర్ రాహుల్ భాటియా మాత్రం తన సొంత ప్రణాళికలతో ముందుకు సాగిపోతున్నారు. తాజాగా బర్గర్ కింగ్ కంపెనీకి చెందిన భారత బిజినెస్ ను కొనుగోలు చేసేందుకు ముమ్మర చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బర్గర్ కింగ్ ... అమెరికా లో హాంబర్గర్లు, ఫాస్ట్ ఫుడ్ విక్రయించే అతి పెద్ద చైన్స్ లో ఒకటి. బర్గర్ కింగ్ ఇండియా ఫ్రాంచైజ్ కొనుగోలు కోసం రాహుల్ భాటియా ఏకంగా రూ 1,400 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైనట్లు ది ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.

ప్రస్తుతం బర్గర్ కింగ్ ఇండియా ఫ్రాంచైజ్ హక్కులు సింగపూర్ కు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఎవర్ స్టోన్ కాపిటల్ QSR ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉన్నాయి. ఇప్పటికే బర్గర్ కింగ్ కొనుగోలు కోసం రెండు ప్రముఖ అమెరికా కొనుగోలు సంస్థలతో పాటు ఒక భారత ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ కూడా చర్చలు జరిపినప్పటికీ... ధర విషయంలో ఆ సంస్థలు వెనక్కి తగ్గాయని సమాచారం. అయితే, రాహుల్ భాటియా మాత్రం కొనుగోలు కోసం సీరియస్ గా ప్రయత్నం వినికిడి. కానీ ఇది డీల్ వరకు వెళుతుందో లేదో ఇప్పుడే చెప్పలేమని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు తెలిసింది.

InterGlobe in talks to buy Burger King’s India franchise

140 రెస్టారెంట్లు... రూ 375 కోట్ల ఆదాయం...
బర్గర్ కింగ్ కంపెనీ భారత్ లోని ప్రముఖ నగరాల్లో భారీగా విస్తరించింది. దేశంలో ఈ సంస్థకు 140 రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవన్నీ క్విక్ సెర్వ్డ్ రెస్టారెంటులే. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో బర్గర్ కింగ్ ఇండియా రూ 375 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. స్టోర్ స్థాయిలో నిర్వహణ లాభాలను ఆర్జిస్తున్న బర్గర్ కింగ్... సంస్థాగత స్థాయిలో మాత్రం నష్టాలను చవి చూస్తోంది. టాటా గ్రూపుతో చేతులు కలిపి భారత్లోకి ప్రవేశించిన మరో బహుళ జాతి సంస్థ స్టార్ బక్స్ తో పొల్తిచే మాత్రం మెరుగ్గానే ఉంది. 2017-18 లో స్టార్ బక్స్ భారత్ లో రూ 348 కోట్ల ఆదాయాన్ని మాత్రమే ఆర్జించటం గమనార్హం.

విభిన్న రంగాల్లో ...
ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ పేరుతో ఇండిగో ఎయిర్లైన్స్ ను నిర్వహించే ఇంటర్ గ్లోబ్ గ్రూప్... విభిన్న రంగాల్లో విస్తరించింది. ఆతిథ్యం, ఐటీ సేవలు, లగ్జరీ గూడ్స్, ట్రావెల్ బుకింగ్ వంటి రంగాల్లో మెరుగైన వ్యాపారాలను రాహుల్ భాటియా నిర్వహిస్తున్నారు. అకార్ గ్రూపుతో సంయుక్తంగా ... ఐబైస్, నోవొటెల్, పుల్మాన్ అనే బ్రాండ్ హోటల్స్ ను నిర్వహిస్తున్నారు. అంటే కాకుండా వ్యక్తిగతంగా రాహుల్ భాటియాకు ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ మూడు ఖరీదైన రెస్టారెంట్లు ఉన్నాయి. ఒక్క ఐబైస్ హోటల్ కె భారత్‌లో 19 ప్రాపెర్టీలు ఉన్నాయి. అవి సంయుక్తంగా 3,500 హోటల్ గదులను నిర్వహిస్తుండటం విశేషం. ఇండిగో విషయంలో పార్టనర్ రాకేష్ గంగ్వార్ తో రాహుల్ భాటియా కు విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.

బర్గర్ కింగ్ కు ఐదేళ్లు...
అమెరికా లో ప్రసిద్ధి చెందిన బర్గర్ కింగ్... తన వ్యాపార సామ్రాజ్యాన్ని భారత్లో విస్తరించాలి ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తోంది. కానీ ఐదేళ్ల క్రితం సింగపూర్ కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ ఎవర్ స్టోన్ కాపిటల్ చేతులు కలపడంతో ఆ కల నెరవేరింది. 5 ఏళ్ళ కాలంలో భారత్లో బర్గర్ కింగ్ నిలదొక్కుకునేందుకు, అలాగే దాదాపు అన్ని ప్రధాన నగరాలకు విస్తరించేందుకు ఎవర్ స్టోన్ కాపిటల్ ఇప్పటి వరకు సుమారు రూ 500 కోట్ల నిధులను వెచ్చించింది. ఒక వేళా ఈ డీల్ కుదిరితే... ఎవర్ స్టోన్ క్యాపిటల్కు దాదాపు మూడు రేట్ల రిటర్న్స్ రానున్నాయి.

English summary

ఇండిగో ప్రమోటర్ చేతికి బర్గర్ కింగ్? | InterGlobe in talks to buy Burger King’s India franchise

Rahul Bhatia controlled InterGlobe group is in advanced discussions to acquire the Burger King India franchise from private equity firm Everstone Capital for about Rs 1,400 crore, according to two people directly aware of the matter.
Story first published: Thursday, July 11, 2019, 11:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X