For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోడ్డెక్కిన ఇండిగో ప్రమోటర్ల గొడవ: ఉద్యోగులకు సీఈవో లేఖ

|

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటర్ల మధ్య విభేదాలు కంపెనీ షేర్లపై బుధవారం ప్రభావం చూపిన విషయం తెలిసిందే. కంపెనీ షేర్లు ముగింపు సమయానికి 11 శాతం కంటే ఎక్కువకు పడిపోయాయి. ఓ దశలో 19 శాతానికి పైగా నష్టపోయి, గత మార్చి తర్వాత తొలిసారి భారీగా నష్టపోయింది.
ఇండిగో ప్రమోటర్లు రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ మధ్య విభేదాలు బయటకు రావడం ఈ షేర్లపై ప్రభావం చూపింది. మార్కెట్ ప్రారంభంలోనే 19 శాతానికి పైగా షేర్లు నష్టపోయి, రూ.1264కి చేరుకుంది. ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే ట్రేడ్ ముగిసింది. 2016 జనవరి తర్వాత ఇండిగోకు ఇంత దారుణమైన రోజు ఇదే కావడం గమనార్హం. మరోవైపు స్పైస్‌జెట్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

<strong>మీరు లోన్ డిఫాల్టరా?: మరో కొత్త చిక్కులో పడినట్లే!</strong>మీరు లోన్ డిఫాల్టరా?: మరో కొత్త చిక్కులో పడినట్లే!

కంపెనీ ఉద్యోగులు కూడా ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండిగో ఉద్యోగులకు సీఈవో దత్తా లేఖ రాశారు. ఇవి కేవలం ప్రమోటర్ల మధ్య విభేదాలు మాత్రమేనని, దీని వల్ల ఎయిర్‌లైన్స్ లేదా ఇండిగో కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ఎయిర్ లైన్స్ మిషన్, డైరెక్షన్, గ్రోత్ స్ట్రాటజీలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. సంస్థ కార్యకలాపాలు, వృద్ధి పైనే దృష్టి సారించడం ముఖ్యమన్నారు.

IndiGo CEO Assures Employees As Promoters Feud In Public

ప్రమోటర్ల మధ్య విభేదాల వల్ల మనకు (ఉద్యోగులకు, ఎయిర్ లైన్స్‌కు) ఏమీ నష్టం జరగదని సీఈవో తెలిపారు. నా శక్తి సామర్థ్యాల మేరకు నా ఉద్యోగాన్ని నేను నిర్వర్తిస్తున్నానని, అలాగే, మీ నుంచి కూడా ఇదే ఆశిస్తున్నానని చెప్పారు. సమయానికి మన లక్ష్యాలను చేరుకునేందుకు అదే అంకితభావంతో కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అన్నారు.

ఏం జరిగిందంటే?

ఇండిగోలో పెద్ద ఎత్తున పాలనాపరమైన లోపాలున్నాయని, సెబీ జోక్యం చేసుకోవాలని కోరుతూ రాకేష్ గంగ్వాల్‌ లేఖ రాయడంతో ఈ విభేదాలు వెలుగుచూశాయి. పాలనలో ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండటంతో సంస్థ ఉన్నత స్థాయికి చేరిందని, అయితే ఇప్పుడు ఆ ప్రధాన సూత్రాలు, విలువలు పక్కదారి పడుతున్నాయని ఆయన ఆరోపించారు. సహ వ్యవస్థాపకుడైన రాహుల్ భాటియా లావాదేవీలు చట్టాలను ఉల్లంఘించేలా ఉన్నాయన్నారు. ఇండిగో గవర్నెన్స్ లోపాలు చాలా ఉన్నాయని, దాంతో పోలిస్తే పాన్ షాప్ నిర్వహణ మెరుగు అన్నారు.

రాహుల్ భాటియా, ఆయన సంస్థలు సందేహాస్పద లావాదేవీలు జరిపినట్లు పేర్కొన్నారు. భాటియాకు కంపెనీపై అసాధారణ నియంత్రణ అధికారులు కట్టబెట్టేలా షేర్ హోల్డర్ల ఒప్పందం ఉందని ఆరోపించారు. సందేహాస్పద ట్రాన్సాక్షన్స్‌తో పాటు కనీస ప్రాథమిక గవర్నెన్స్ నిబంధనలు, చట్టాలు పాటించట్లేదని, ఇది ఇలాగే ఉంటే దురదృష్టకర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని, తక్షణమే సరిదిద్దే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కాపీని ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్రపౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, వాణిజ్య శాఖమంత్రి పీయూష్ గోయల్‌లకు కూడా పంపించారు. కాగా, ఈ ఆరోపణలపై 19వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కంపెనీకి సెబీ సూచించింది.

ఇండిగోలో రాకేష్ గంగ్వాల్‌కు 37 శాతం వాటాలు ఉండగా, రాహుల్ భాటియా ఆయన అనుబంధం సంస్థలకు 38 శాతం వాటాలు ఉన్నాయి. సందేహాస్పద లావాదేవీలపై ఇరువురు ప్రమోటర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. దీనిపై అత్యవసర షేర్ హోల్డర్స్ భేటీ నిర్వహించాలని ప్రతిపాదించగా భాటియా నో చెప్పారు. ఆయన అసమంజస డిమాండ్స్ బోర్డు అంగీకరించనందునే రాకేష్ గంగ్వాల్ ఇలా చేస్తున్నారని భాటియా ఆరోపించారు. దీంతో ఇరువురి మధ్య విభేదాలా తారాస్థాయికి చేరుకున్నాయి. కాగా, దేశీయంగా అతిపెద్ద ఎయిర్ లైన్ అయిన ఇండిగోకు 49 శాతం వరకు మార్కెట్ వాటా ఉంది. కాగా, భాటియాకు, ఆయన సంస్థలకు అసాధారణ అధికారాలు కట్టుబెట్టేలా షేర్ హోల్డర్స్ ఒప్పందం ఉంది. తాను అందుకు అంగీకరించేందుకు పలు కారణాలు ఉన్నాయని గంగ్వాల్ చెప్పారు. ఒప్పందం ప్రకారం భాటియాకు చెందిన ఐజీఈ గ్రూప్‌కు... ఆరుగురిలో ముగ్గురు డైరెక్టర్లను, చైర్మన్, సీఈవోను, ప్రెసిడెంట్‌ను నియమించే అధికారాలు ఉంటాయి.

English summary

రోడ్డెక్కిన ఇండిగో ప్రమోటర్ల గొడవ: ఉద్యోగులకు సీఈవో లేఖ | IndiGo CEO Assures Employees As Promoters Feud In Public

CEO Mr Dutta told the company's employees that the issues between promoters have nothing to do with airline and its functioning. (Also read: Rakesh Gangwal has no plans of taking control of IndiGo, says CEO).
Story first published: Wednesday, July 10, 2019, 17:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X