For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో దడ.. లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి

By Jai
|

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో దడ మొదలైంది. తమ పెట్టుబడులు ఎక్కడ ఇరుక్కు పోతాయోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. జూన్ నెలలో వీరంతా నికరంగా రూ. 1.60 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. డెట్ సంబంధిత ప్లాన్లపై విశ్వాసం సన్నగిల్లడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మే నెలలో డెట్ ఓరియెంటెడ్ పథకాల్లోకి రూ.70,119 కోట్లు రాగా జూన్ నెలలో రూ.1.71 లక్షల కోట్లు తరలిపోయాయి.

కారణం ఇదే....
* ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, ఎస్సెల్, డీహెచ్ఎఫ్ఎల్ వంటి గ్రూపులు రుణ సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు భద్రతా ఉంటుందా అన్న ఆందోళనలో పడిపోయారు. అందుకే తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.

Mutual fund assets dwindle as debt investors cash out

* ముఖ్యంగా డెట్ విభాగంలో నుంచి పెట్టుబడులు జూన్ నెలలో రూ.1,71,349 కోట్లు బయటకు వెళ్లాయి. మే నెలలో రూ. 70,119 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
* మంచి పేరున్న కంపెనీలే డీఫాల్ట్ కావడం లేదా చెల్లింపుల్లో జాప్యం చేయడం వల్ల ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లుతోంది.
* డెట్ ఓరియెంటెడ్ ఫండ్స్ లో ఓవర్ నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, తక్కువ కాలపరిమితి ఫండ్స్ ఉంటాయి. లిక్విడ్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు బాగా బయటకు వెళ్లాయి.
* లిక్విడ్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్న పెట్టుబడుల మొత్తం రూ. 1.52 లక్షల కోట్లుగా ఉంది.

ఈక్విటీ ఫండ్స్ లో పెరిగిన పెట్టుబడులు
* జూన్ చివరినాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల మొత్తం రూ. 25.81 లక్షల కోట్లుగా ఉంది. అంతకు ముందు మే నెలలో ఆస్తులు రూ. 25. లక్షల కోట్లుగా ఉన్నాయి.

* ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు మే నెలతో పోల్చితే జూన్ లో 41 శాతం పెరిగి రూ. 5,407 కోట్ల నుంచి రూ.7,633 కోట్లకు చేరుకున్నాయి.
* ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు వెల్లడైన నేపథ్యంలో ఇన్వెస్టర్లు సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఏర్పడింది.
* రాజకీయ స్థిరత్వం, తక్కువ స్థాయిలో ద్రవ్యోల్భణం ఉండటం, ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం, కార్పొరేట్ రాబడుల్లో వృద్ధి వంటి అంశాలు ఈక్విటీ ఓరియెంటెడ్ స్కీముల్లో పెట్టుబడులు పెరగడానికి దోహదపడుతున్నాయి.
* ఈక్విటీ సెగ్మెంట్లో మల్టీ క్యాప్ ఫండ్స్ రూ. 1,835. కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ లోకి రూ. 1,509. కోట్లు, స్మాల్ క్యాప్ ఫండ్స్ లోకి రూ. 927 కోట్లు వచ్చాయి.
* మల్టీ క్యాప్, లార్జ్ క్యాప్ ఫండ్స్ కు ఇన్వెస్టర్లు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
* ఇక ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ లో నుంచి పెట్టుబడుల ప్రవాహం బయటకే ఎక్కువగా ఉంటోంది.
* జూన్ లో రూ. 2,361.3 కోట్లు, మేలో రూ. 1,797.94 కోట్లు, ఏప్రిల్లో రూ. 17,644 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు.
*క్రమానుగత పెట్టుబడి పథకాల (సిప్) ఖాతాలు 2.73 కోట్లు ఉన్నాయి. జూన్ లో వీటిలో పెట్టుబడులు రూ . 8,122. 13 కోట్లుగా ఉన్నాయి.

కొత్త ఫండ్స్ వచ్చాయ్ ... పెట్టుబడికి సిద్ధమేనా?కొత్త ఫండ్స్ వచ్చాయ్ ... పెట్టుబడికి సిద్ధమేనా?

English summary

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో దడ.. లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి | Mutual fund assets dwindle as debt investors cash out

The assets under management of mutual funds was down 6 per cent in June to Rs.24.25-lakh crore against Rs.25.93-lakh crore logged in May.
Story first published: Tuesday, July 9, 2019, 11:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X