For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టైటన్ పడేస్తే, బజాజ్ ట్విన్స్ నిలబెట్టాయి ! ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్

By Chanakya
|

నిన్నటి భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ తేరుకుంది. ఈ రోజు కూడా తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడైన సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. బడ్జెట్ ఎఫెక్ట్‌తో ఓవర్ సెల్లింగ్ జోన్‌లో ఉన్న మార్కెట్లు... కాస్త కుదుటపడ్డాయి. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్, రియాల్టీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లూ నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా ఐటీ, ఎఫ్ఎంసిజి షేర్లలో అధిక అమ్మకాల ఒత్తిడి నమోదైంది. చివరకు సెన్సెక్స్ 10 పాయింట్ల లాభంతో 38731 దగ్గర, నిఫ్టీ 3 పాయింట్లు నష్టపోయి 11556 దగ్గర ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 35 పాయింట్లు దిగొచ్చి 30569 దగ్గర స్థిరపడింది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫిన్ సర్వ్ స్టాక్స్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. టైటాన్, యూపీఎల్, టిసిఎల్, గెయిల్, హెచ్ సి ఎల్ టెక్ లూజర్స్ జాబితాలో నిలిచాయి.

Indices end flat, Nifty holds 11,556

టైటన్‌కు దెబ్బ
బంగారం, జ్యువెల్రీ అమ్మకాల్లో క్షీణత నేపధ్యంలో మొదటి క్వార్టర్లో నిరుత్సాహక ఫలితాలు ప్రకటించిన టైటన్, రాబోయే క్వార్టర్లపై కూడా ఆ స్థాయి నమ్మకాన్ని చూపించలేదు. దీంతో షేర్ హోల్డర్లకు అమ్మకానికి తెగబడ్డారు. ప్రధాన రీసెర్చ్ సంస్థలు కూడా స్టాక్‌ను డౌన్ గ్రేడ్ చేసి టార్గెట్లను తగ్గించాయి.

దీంతో స్టాక్ ఏకంగా 13 శాతం వరకూ కోల్పోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేరోజు ఈ స్థాయి పతనాన్ని చూసింది. చివరకు రూ.1099 దగ్గర స్టాక్ క్లోజైంది.

కోలుకున్న బజాజ్ ట్విన్స్ఎ
ఫ్ ఐ ఐల సెల్లింగ్‌తో నిన్న భారీగా నష్టపోయిన బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ స్టాక్స్ ఈ రోజు కాస్త తేరుకున్నాయి. ఫిన్ సర్వ్ 3 శాతం, ఫైనాన్స్ 6 శాతం వరకూ పెరిగి ఇన్వెస్టర్లు కాస్త ఊపిరి పీల్చుకునేలా చేశాయి. అయితే ఇప్పటికీ ఎక్స్‌పెన్సివ్‌గానే కనిపిస్తున్న స్టాక్స్‌పై స్పష్టత వచ్చేంత వరకూ వెయిట్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మేఘమణి ఆశావహం
ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో 12 నుంచి 15 శాతం వరకూ ఆదాయంలో వృద్ధి నమోదు కావొచ్చని మేఘమణి ఆర్గానిక్స్ యాజమాన్యం ధీమాగా ఉంది. మార్జిన్లు కూడా నిలకడగా ఉండొచ్చని సూచించింది. దీంతో ఈ పిగ్మెంట్స్, ఆగ్రోకెమికల్ కంపెనీ స్టాక్‌లో 4 శాతం వరకూ ర్యాలీ వచ్చింది. చివరకు రూ.63.30 దగ్గర స్టాక్ క్లోజైంది.

రెండేళ్ల తర్వాత రూ.6000 దిగువకు మారుతి
మారుతి సుజుకి స్టాక్ రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. వరుసగా మూడో రోజు కూడా స్టాక్ నష్టాల్లో ముగిసింది. రూ.5915 స్థాయికి ఇంట్రాడేలో పడిపోయిన స్టాక్ ఆ తర్వాత పెద్దగా కోలుకోలేదు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా రూ.6 వేల దిగువన స్టాక్ క్లోజైంది. చివరకు రూ.5947 దగ్గర స్టాక్ ముగిసింది.

ఆర్ ఈ సీ మళ్లీ మళ్లీ
రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సంస్థ వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లో ముగిసింది. రెండు నెలల కాలంలో వరుసగా ఈ స్థాయిలో పతనం ఆర్ ఈ సీలో నమోదైంది. ఈ రోజు కూడా సుమారు 15 శాతం వరకూ స్టాక్ దిగొచ్చింది. చివరకు రూ.137 దగ్గర క్లోజైంది. వరుస పతనాల నేపధ్యంలో నిఫ్టీ సీపీఎస్ఈ ఇండెక్స్ నుంచి దీన్ని తొలగించబోతున్నారు.

English summary

టైటన్ పడేస్తే, బజాజ్ ట్విన్స్ నిలబెట్టాయి ! ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్ | Indices end flat, Nifty holds 11,556

The Sensex closed 10.25 points, or 0.03 per cent, higher at 38,731 levels with TCS, HCL Tech and ITC being the top laggards. On the contrary, Bajaj Finance, Sun Pharmaceuticals and Hero Moto Corp were the top gainers on the Sensex.
Story first published: Tuesday, July 9, 2019, 18:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X