For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గిల్ట్ ఫండ్స్‌లో 16 శాతం రాబడి ! ఇన్వెస్ట్ చేయొచ్చా ?

By Chanakya
|

గిల్ట్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇదో భిన్నమైన ఫండ్. ప్రభుత్వ బాండ్స్‌లో మాత్రమే పెట్టుబడి పెట్టే ఈ ఫండ్స్‌లో కాస్త రిస్క్ తక్కువ ఉంటుంది. అలాంటి గిల్ట్ ఫండ్స్ ఈ మధ్యకాలంలో అనూహ్యమైన రిటర్న్స్ ఇస్తున్నాయి. ఈ కేటగిరీలోని ఫండ్స్ యావరేజ్‌న 13.24 శాతం రాబడిని ఇచ్చాయి. ఇదే కేటగిరీలో ఉన్న ఓ ఫండ్ ఏకంగా ఏడాదికి 16 శాతం రాబడిని అందించింది. ఈ స్కీముల్లో ఉన్న వరస్ట్ పర్ఫార్మర్ కూడా కనీసం రండంకెల లాభాలను అందించింది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు చెబ్తున్న లెక్కల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ ఫండ్స్ మెరుగైన పనితీరునే కనబర్చవచ్చని సూచిస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో ఈ గిల్ట్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చా.. ?

ఆదాయపన్ను నిబంధనల్లో మార్పులు ఇవే...: బ్యాంక్ విత్‌డ్రా రూ.1 కోటి దాటితే 2 శాతం TDSఆదాయపన్ను నిబంధనల్లో మార్పులు ఇవే...: బ్యాంక్ విత్‌డ్రా రూ.1 కోటి దాటితే 2 శాతం TDS

ఏ ఆధారంగా రిటర్న్స్ ?

ఏ ఆధారంగా రిటర్న్స్ ?

గిల్ట్ ఫండ్స్‌లో రిటర్న్స్ ప్రధానంగా ప్రభుత్వ బాండ్స్ (గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్) పనితీరుపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఆ బాండ్స్‌లో వడ్డీ రేట్లు తగ్గితే వీటికి డిమాండ్ పెరిగి రేట్లు పెరుగుతాయి. 2019లో కాలంలో ప్రభుత్వ 10 ఏళ్ల కాల పరిమితిగల సెక్యూరిటీల్లో రాబడి ఎనిమిదిన్నర శాతం నుంచి 7 శాతానికి దిగొచ్చాయి. ప్రభుత్వ సెక్యూరిటీలను ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా ఆర్బీఐ కొనుగోలు చేయడం, ప్రపంచ వృద్ధిలో అనిశ్చితి, చమురు ధరల్లో నీరసం, ఇన్‌ఫ్లేషన్ కూడా బాండ్ల రేట్లలో కదలికలకు కారణమైంది.

వడ్డీ రేట్లు మరింతగా తగ్గే సూచనలు

వడ్డీ రేట్లు మరింతగా తగ్గే సూచనలు

ఇక్కడి నుంచి వడ్డీ రేట్లు మరింతగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాల రుణ బాండ్లకు ఇక్కడ మరింత డిమాండ్ ఉంది. అన్ని అనుకూలతలూ ఉన్న తరుణంలో వడ్డీ రేట్లు మరో పావు నుంచి ముప్పావు శాతం వరకూ తగ్గేట్టు కనిపిస్తున్నాయి. ఇది గిఫ్ట్ ఫండ్స్‌కు చాలా పాజిటివ్ న్యూస్. ఎందుకంటే పదేళ్లు, అంతకు మించి కాల పరిమితి ఉన్న బాండ్స్ ఎక్కువగా ఇస్తాయి కాబట్టి వీటికి డిమాండ్ పెరుగుతుంది.

ఇన్వెస్ట్ చేయొచ్చా

ఇన్వెస్ట్ చేయొచ్చా

ఫండ్ మేనేజర్ల సలహా ప్రకారం ఇప్పటికిప్పుడు ఆవేశపడి ఈ గిల్ట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ఆ స్థాయిలో భారీగా రిటర్న్స్ వచ్చే ఆస్కారం ఉండబోదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సెగ్మెంట్లో సాధారణంగా అత్యధిక ఒడిడుదుకులు ఉంటాయి. గతేడాది ఇదే ఫండ్స్ రెండు,మూడు శాతానికి మించి లాభాలను ఇచ్చిన దాఖలాలు లేవు. అందుకే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక వేళ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే కొద్ది మొత్తంలో మాత్రమే పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అది కూడా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్‌ను మాత్రమే పరిగణించాలని విశ్లేషిస్తున్నారు.

English summary

గిల్ట్ ఫండ్స్‌లో 16 శాతం రాబడి ! ఇన్వెస్ట్ చేయొచ్చా ? | Some gilt funds are offering 16 per cent returns in one year

The gilt mutual fund category is among the toppers on the return chart. The average return posted by the category is 13.24 per cent in one year.
Story first published: Saturday, July 6, 2019, 18:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X