For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్ ఎఫెక్ట్: పౌరులకు, కంపెనీలకు పెరగనున్న రుణ లభ్యత

By Jai
|

ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో బ్యాంకులకు ప్రాధాన్యం లభించింది. గత రెండు మూడేళ్ళుగా నిరర్థక ఆస్తులు (NPA) పెరిగిపోవటం తో పాటు నిరవ్ మోడీ, విజయ్ మాల్యా వంటి ఎగవేతదారుల వళ్ళ బ్యాంకింగ్ రంగం... ఇంకా కోలుకోలేదు. ముఖ్యంగ ప్రభుత్వరంగ బ్యాంకులు ఇప్పటికీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. గత ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం అందించి ఆదుకున్న ప్రభుత్వం... ఇప్పుడు తాజాగా మరో రూ 70,000 కోట్ల మూలధనం సమకూర్చనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఇటు సాధారణ పౌరులకు, అటు కంపెనీలకు బ్యాంకుల నుంచి రుణ అభ్యత పెరగనుంది.

నిర్మలా సీతారామన్ బడ్జెట కీలక అంశాలు: బడ్జెట్‌లో ఏం చెప్పారు?నిర్మలా సీతారామన్ బడ్జెట కీలక అంశాలు: బడ్జెట్‌లో ఏం చెప్పారు?

NBFCలకు ఊరట

NBFCలకు ఊరట

దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే అనేక కారణాలతో కుదేలైన NBFC లకు ఊరట కల్పించే ప్రయత్నమూ చేసింది. గృహాల కొనుగోలు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మద్దతు లభించేలా బ్యాంకులకు అధిక మూలధన నిధులను కేటాయించాలని నిర్ణయించింది. వ్యవస్థలోకి ఒక ఏడాదిలో రూ 70,000 కోట్ల మూలధన నిధులు అందుబాటులోకి వస్తే రుణాల లభ్యత పెరగటమే కాకుండా తక్కువ వడ్డీ కె రుణాలు లభించే అవకాశం ఉంటుంది. ఒక రూపాయి మూలధనం వాళ్ళ సహజంగానే రెండు నుంచి మూడు రేట్ల ప్రతిఫలం లభిస్తుంది. అంటే ఆ మేరకు దేశంలోని సామాన్యులు, కంపెనీలు లబ్ది పొందనున్నారు.

ఉద్యోగాల కల్పన, వినియోగం పెంపు లక్ష్యం:

ఉద్యోగాల కల్పన, వినియోగం పెంపు లక్ష్యం:

ఆటో అమ్మకాలు తగ్గి, నిరుద్యోగుల సంఖ్య దాదాపు 50 ఏళ్ళ గరిష్ఠానికి చేరుకోవటం తో దేశంలో ఆర్ధిక మందగమన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పరిస్థితిని చాల త్వరగానే అంచనా వేసిన ప్రభుత్వం ... వెంటనే దిద్దుబాటు చర్యలను చేపట్టిందని చెప్పాలి. మౌలిక సదుపాయాల కల్పన, గృహ నిర్మాణం కొనుగోళ్ళకు మద్దతు, స్టార్టుపాలకు నిధుల లభ్యత పెరిగేల చర్యలు, చిన్న పరిశ్రమలు, మహిళా స్వయం సహాయక గ్రూపులు రుణాల అందజేత, గ్రామీణ భారతం లో అధిక పెట్టుబడులు, ఆదాయపు పన్ను స్లాబులు మార్చకున్న ... 5 లక్షల ఆదాయం వరకు పన్ను లేకపోవటం, అన్ని వర్గాలకు రుణాలు సులువుగా దొరికే చర్యల వాళ్ళ.. దేశంలో ఉద్యోగ కల్పనతో పాటు, అటు గ్రామీణ భారతం లోనూ, ఇటు పట్టణాల్లోనూ వినియోగం పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోండి. అందులో భాగమే బ్యాంకులకు అధిక నిధులను సమకూర్చటం.

పర్సనల్ లోన్స్ ఈజీ?

పర్సనల్ లోన్స్ ఈజీ?

సహజంగానే... ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు, పర్సనల్ లోన్స్ ఇచ్చే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తాయి. పర్సనల్ లోన్ తీసుకొన్న వ్యక్తి డిఫాల్ట్ అయితే, ఆ బాధ్యత పర్సనల్ లోన్ శాంక్షన్ చేసిన బ్యాంకు మేనేజర్ పైనే ఉండటం వాళ్ళ చాల మంది మేనేజర్ లు ఇందుకు ముందుకు రారు. కానీ.. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో బ్యాంకులకు రూ 70,000 కోట్ల మూలధనం అందిస్తున్నట్లు పేర్కొంటూనే.. పర్సనల్ లోన్స్ అధికంగా లభించేలా, వినియోగదారుల గుమ్మం వద్దే బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకొంటామని స్పష్టం చేసారు. కాబట్టి.. ఈ బడ్జెట్ తర్వాత దేశంలో రుణ లభ్యత మెరుగు అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

English summary

బడ్జెట్ ఎఫెక్ట్: పౌరులకు, కంపెనీలకు పెరగనున్న రుణ లభ్యత | Government to incentivise banks for buying NBFC assets to provide liquidity

In a move to restore liquidity in the NBFC and push banks to buy assets from them under the pool purchase programme.
Story first published: Saturday, July 6, 2019, 18:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X