For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాలుగో రోజూ లాభాల్లోనే స్టాక్ మార్కెట్, బడ్జెట్ ముందు ఊగిసలాట

By Chanakya
|

స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా లాభాల్లో ముగిసి ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. రేపు కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న నేపధ్యంలో మార్కెట్లు ఆచితూచి కదలాడుతున్నాయి. ఈ రోజంతా నిఫ్టీ 50-60 పాయింట్ల రేంజ్‌లోనే కదలాడింది. ఆఖర్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి నేపధ్యంలో లాభాలు కొద్దిగా కరిగిపోయినా చివరకు 11900 పాయింట్లపైనే ముగిసింది. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు వచ్చిన కొనుగోళ్ల మద్దతు మార్కెట్లను ముందుకు నడిపించింది. అయితే ఆఖర్లో ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్ వంటి స్టాక్స్‌లో సెల్లింగ్ బ్యాంక్ నిఫ్టీని నీరసింపజేసింది. చివరకు సెన్సెక్స్ 69 పాయింట్లు కోల్పోయి 39908 దగ్గర, నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 11947 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 90 పాయింట్లు పెరిగి 31472 వద్ద ముగిశాయి.

మిడ్ క్యాప్ ఇండెక్స్ పావు శాతానికి పైగా నష్టపోతే, స్మాల్ క్యాప్ మాత్రం అర శాతం వరకూ పెరిగింది. ఇక సెక్టోరల్ సూచీల్లో అయితే మీడియా, మెటల్, ఫార్మా స్టాక్స్ మాత్రమే నీరసించాయి. మిగిలిన వాటిల్లో రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసిజి, ఆటో స్టాక్స్ పరుగులు తీశాయి.

Markets end in green, Sensex up 69 points

యూపీఎల్, భారతి ఎయిర్టెల్, బ్రిటానియా, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్స్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. యెస్ బ్యాంక్, టైటన్, జీ ఎంటర్‌టైన్మెంట్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్ సి ఎల్ టెక్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

ఇండియామార్ట్ బంపర్ లిస్టింగ్

బి2బిలో లిస్టింగ్, క్లాసిఫైడ్ సేవలను అందించే ఇండియామార్ట్ ఈ రోజు బంపర్ లిస్టింగ్ పూర్తి చేసుకుంది రూ.973 ఇష్యూ ధరతో పోలిస్తే 21 శాతం అధికంగా రూ.1180 దగ్గర లిస్ట్ అయింది. అయితే కొనుగోళ్ల మద్దతు మరింతగా కనిపించడంతో రూ.1338 వరకూ వెళ్లింది. చివరకు రూ.1302 దగ్గర క్లోజైంది.

యునిప్లై ఇండస్ట్రీస్

కువైట్‌కు చెందిన మర్కాబ్ సంస్థ యూనిప్లైలో 29.21 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇందుకోసం రూ.313.84 కోట్లను సిద్ధం చేసుకుంది. ఈ నేపధ్యంలో ఈ స్టాక్ 5 శాతం వరకూ పెరిగింది. చివరకు రూ.66.55 దగ్గర క్లోజైంది. తొమ్మిది నెలల గరిష్ట స్థాయికి చేరింది స్టాక్ ధర.

కుంగిన క్వెస్‌కార్ప్

స్వష్టమైన కారణాలేవీ ఇంకా పూర్తిగా తెలియనప్పటికీ క్వెస్ కార్ప్ స్టాక్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇంట్రాడేలో సుమారు 15 శాతం పతనమైంది. ట్రైమ్యాజ్ అనే సంస్థతో తాము చేపడ్తున్న ప్రాజెక్ట్ 30 రోజుల్లో పూర్తవుతుందని, డబ్బును మొత్తం రికవర్ చేస్తామని క్వెస్ కార్ప్ సీఈఓ సుబ్రతా కుమార్ తెలియజేశారు. దీనికి తోడు రిడంప్షన్‌ను ఒత్తిడి వల్ల కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు స్టాక్స్‌ను అమ్మేసి ఉండొచ్చని, అందుకే స్టాక్ ధర కూడా పడిందని ఆయన చెప్పారు. ఏదేమైనా స్టాక్ మాత్రం రూ.447 దగ్గర క్లోజైంది.

కోల్టేపాటిల్‌కు బూస్ట్పూ
ణెలో మూడు కొత్తప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధికి సంబంధించి ఒప్పందాలు కుదిరిన నేపధ్యంలో కోల్టే పాటిల్ లాభాల బాట పట్టింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ 5 రెట్లు పెరిగాయి. చివరకు స్టాక్ 6 శాతం పెరిగి రూ.233 దగ్గర క్లోజైంది.

టైటన్‌కు మోర్గాన్ స్టాన్లీ దెబ్బ

రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఈ స్టాక్‌ను ఓవర్ వెయిట్ నుంచి ఈక్వల్ వెయిట్ కు తగ్గించింది. టార్గెట్ ప్రైస్‌ను రూ.1300కే పరిమితం చేసింది. అయితే ఇక్కడి నుంచి స్టాక్ అద్భుతాలు చేయకపోయినా ఆదాయం మాత్రం స్థిరంగానే ఉంటుందనే విషయాన్ని వెల్లడించింది మోర్గాన్ స్టాన్లీ. ఈ రిపోర్ట్ నేపధ్యంలో టైటన్ స్టాక్ 3 శాతం వరకూ కోల్పోయి రూ.1291 దగ్గర క్లోజైంది.

English summary

నాలుగో రోజూ లాభాల్లోనే స్టాక్ మార్కెట్, బడ్జెట్ ముందు ఊగిసలాట | Markets end in green, Sensex up 69 points

The Sensex hit an intraday high of 39,979.10 and a low of 39,858.33. Similarly, the Nifty touched an intraday high of 11,969.25 and a low of 11,923.65.
Story first published: Thursday, July 4, 2019, 17:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X