For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్నారుల పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మొదలెట్టారా?

By Jai
|

నేటి కాలం తల్లిదండ్రుల ఆలోచన ధోరణి మారుతోంది. తమవద్ద మిగులు ఉంటే ఆ మొత్తాన్ని పెట్టుబడుల కోసం వినియోగించాలని ఆలోచిస్తున్నారు. పిల్లల చదువులకే కాకుండా సంపదను పెంచే విధంగానూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలామంది తమ సొమ్మును పెట్టుబడి పెట్టేందుకు మ్యూచువల్ ఫండ్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే పెద్దవారు తమ పిల్లల పేరు మీద కూడా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది.

వారి పేరుమీద పెట్టుబడులు పెడితే తల్లిదండ్రులు భాద్యతగా ఉంటారు. మరింత ఎక్కువ పొదుపు చేస్తూ పెట్టుబడుల కోసం ఆ సొమ్మును మళ్లిస్తారు. పిల్లలు పెరిగే కొద్దీ ఈ సొమ్ము పెరుగుతుంది. అది వారి ఉన్నత చదువులు, పెళ్లి తదితర భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి. పిల్లల పేరుమీద కనీసం రూ.500 తో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి ప్రారంభించవచ్చు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు తెచ్చిన ఏ స్కీం లోనైనా పెట్టుబడి పెట్టవచ్చు.

 Investing in mutual funds in the name of a minor child

* పద్దెనిమిదేళ్ల లోపు వయసున్న వారిని మైనర్లుగా పరిగణిస్తారు. పుట్టిన తేదికి సంబంధించిన ధృవపత్రం ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. మైనర్ల పేరుమీద పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఈ ధృవపత్రాన్ని లేదా పాస్ పోర్ట్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. గార్డియన్ (సహజ - తల్లిదండ్రులు లేదా చట్ట పరమైన గార్డియన్- కోర్టు నియమిస్తే) తో ఉన్న సంబంధం వివరాలు కూడా తెలియజేయాలి. వీరి పెట్టుబడి మొత్తంపై పరిమితి ఏమి ఉండదు.

* మొదటి పెట్టుబడి సందర్భంగా లేదా ఫోలియో ప్రారంభంలో వీటిని సమర్పించాల్సి ఉంటుంది. ఒకే ఫండ్ సంస్థలో తర్వాతి పెట్టుబడులు పెట్టే సమయంలో వీటి అవసరం ఉండదు.

* మైనర్ కు సంబంధించిన గార్డియన్.. మీ కస్టమర్ గురించి తెలుసుకోండి (కేవైసీ ) నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

* తల్లిదండ్రుల బ్యాంకు ఖాతా నుంచి పెట్టుబడులు మళ్లిస్తే థర్డ్ పార్టీ డిక్లరేషన్ ఫామ్ ను సమర్పించాల్సి ఉంటుంది.

* పిల్లల బ్యాంకు ఖాతా నుంచి కూడా నేరుగా పెట్టుబడి లావాదేవీలు నిర్వహించవచ్చు.

* 18 సంవత్సరాల వరకు మాత్రమే గార్డియన్ మైనర్ మ్యూచువల్ ఫండ్ ను నిర్వహించవచ్చు. ఈ వయసు తర్వాత గార్డియన్ మైనర్ ఖాతాను నిర్వహించే అవకాశం ఉండదు.
* పిల్లలకు 18 ఏళ్ళు నిండడానికి ముందుగానే ఫండ్ సంస్థ యూనిట్ హోల్డర్ చిరునామాకు నోటీసు పంపుతుంది. మెజారిటీ వయసు వచ్చిన తర్వాత మైనర్ నుంచి మేజర్ కు ఫోలియో స్టేటస్ ను మార్చేందుకు వీలుగా కొన్ని పత్రాలను సమర్పించాలని కోరుతుంది. పత్రాలు సమర్పించిన తర్వాత తగిన విధంగా మార్పులు చేర్పులు చేస్తారు.

నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!

పన్ను ఎంత ?

* తల్లిదండ్రుల నుంచి పిల్లలకు నగదు బదిలీ చేసినా, పిల్లల నుంచి తల్లిదండ్రులకు బదిలీ చేసినా ఆదాయ పన్ను ఉండదు. గిఫ్ట్ టాక్స్ కూడా వర్తించదు. అయితే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల ద్వారా పిల్లలకు వచ్చే ఆదాయం తల్లిదండ్రుల ఆదాయంతో కలుపుతారు. ఆదాయ పన్ను లెక్కింపు నిమిత్తం ఇలా చేస్తారు. పిల్లల పేరుమీద చేసే ఈ పెట్టుబడివల్ల ఆదాయ పన్ను ఆదాకు అవకాశం ఉండదు.

English summary

చిన్నారుల పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మొదలెట్టారా? | Investing in mutual funds in the name of a minor child

Many parents want to build a corpus for their child before he turns an adult so that it could come handy for higher education. They often channelise piggy-bank money, small amounts received as gifts on occasions like their birthday, winning a competition, performing well in a sport and so on to mutual funds.
Story first published: Thursday, July 4, 2019, 16:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X